Wednesday, May 31, 2017

నవీన టీకా టిప్పణి

అతివల విశాల నేత్రములు ;
దివికి అబ్బురము కలిగించు ; 
అరవిందాక్షుల సంభ్రమ విరళి ;
వ్రేపల్లెకు నవ్య టీకా టిప్పణి ; ||

గోవులు, కోతులు, మయూరమ్ములు - 
పశు పక్ష్యాది - ప్రాణి కోటికి 
అంతటికీ సరి సమమ్ముగా ; 
ఇచ్చెను ప్రేమ, మమతలను ; ||

గరుడ విహంగము వాహనము 
తన వాహనము ; 
బుల్లి ఉడుతలకు వెన్నున 
రేఖా చిత్రములు ; 
వెన్నుని చేతి చలువయె, ఔనా ; ||

ప్రపంచమునందలి - ప్రతి అణువూ 
నీదు లాలనలు పొందుచున్నవి ; 
లలనా మణుల కన్నుల నిండుగ 
ఆనందాశ్రువుల సరళి నిరాళి ; ||

బ్రహ్మ కమలములు నిండి ఉన్నట్టి ; 
అమందానంద పుణ్య పుష్కరిణి ;
ఐ నిలిచేను , మా ముద్దుల గోపాల శ్రీకృష్ణా! : ||
;
రాధామనోహర 

No comments:

Post a Comment