Friday, May 26, 2017

పాట మొదటి పల్లవి

భక్తి లీల భజన రసడోలలొ ; 
       ఊగవె హృదయమ మనసారా ;
రాధికా భజన రసడోలల ; 
        ఊగవె హృదయమ మనసారా ;  ||
;
చిలకలన్ని దొరకబుచ్చుకొనెను
తొలు దొలుత - పాట మొదటి పల్లవిని ; 
మైనా పిట్టలు అందుకొనెను
అనుసరించి అను పల్లవి ;  ||
;
క్రిష్ణ చరణముల వాలెను
              మలి చరణములు ;
గీత బోధకుని చరణముల 
           శేష గీత చరణములు;
పద పదమున 'తేనె ఊట -
         -  తొణుకులాట' - మనోహరం ;  || 
;
; - రాధామనోహర ;

No comments:

Post a Comment