Saturday, May 27, 2017

క్రిష్ణయ్య కిల కిలలు

మురళీ లోల! కెరలించుమయా కిల కిల ;-
మురళీ లోలా! గాన వినోదీ!
కెరలించుమయా కిల కిలలు ; || 
;
వేణు గాన వినోదీ! 
నీదు వంశీ రవళి ;
మువ్వంపు ఓమ్ కార -
పవన చిత్రణలు ఆయెనయ్యారే!
;
మురళిని రాగము ఊరినంతనే - 
గాలి ఆయెనే గాన వర్ణ చిత్రిత యవనిక ; 
మా - ముగ్ధ మయూరి నాట్య లహరికల -
కెరలించుమయా కిల కిలలన్ ; || 

చిరు గాలి చిత్రముల ఎల్లరి డెందముల ;
తన్మయాలెల్లెడల విస్తరిస్తుండగా 
భక్తుల లాలిత్య భావ సుకుమారముల ;
కెరలించుమయా నీదు కిల కిలలున్ ; ||
;
క్రిష్ణయ్య కిల కిలలు ;

No comments:

Post a Comment