Wednesday, May 31, 2017

శేష గీత చరణములు

రాధికా భజన రసడోల ; 
ఊగవె హృదయమ - 'మనసారా' ;
ఆ డోలను ఊగవె మనసారా ; ||
;
చిలకలన్ని దొరకబుచ్చుకొనినవి ;
పాట యొక్క పల్లవిని ; ||
;
మైనాలు అందుకొనెను
ఆ పైని అను పల్లవి ; ||
;
గీత బోధకుడు 
- క్రిష్ణ చరణముల వాలినవి ;
శేష గీత చరణములు ;
పద పదమున తేనె ఊట 
తొణుకులాట మనోహరం ; ||

-  రాధామనోహర ;

పోటా పోటీగా పౌర్ణమి

ఆ సొగసులు, మిలమిలలు - 
నింపుకున్న కన్నుదోయి - 
ఎవ్వరివమ్మా? ఎవ్వరివమ్మా? -
ఇంకెవ్వరివంటావు, రాధికవమ్మా! 
అవి మన మన రాధికవమ్మా! ; || 
;
నిడుపాటి కురులు ; కుంతలమ్ముల - 
; బందీ ఐనది పెను చీకటి ; 
నిశి కింత గొప్ప శరణు దొరికినదని - 
ఈసు చెందె పున్నమి ; || 
;
పోటీగా, పోటా పోటీగా ఆ పౌర్ణమి -
; అయ్యింది చాందినీ ; 
తెలి కన్నులందున దూరినది వెన్నెల ; || 
;
అంతటి ఈర్ష్య , అసూయలు - 
తెలుపు, నలుపు వర్ణాలకు పరిమితమా, అని 
తలచిినవి మెరుపులు;
మిన్ను మెరుపు చమక్కులు, తళతళలు - 
రాధ వీక్షణములందున చేరినవి ; ||
;
రాధామనోహర ;

నవీన టీకా టిప్పణి

అతివల విశాల నేత్రములు ;
దివికి అబ్బురము కలిగించు ; 
అరవిందాక్షుల సంభ్రమ విరళి ;
వ్రేపల్లెకు నవ్య టీకా టిప్పణి ; ||

గోవులు, కోతులు, మయూరమ్ములు - 
పశు పక్ష్యాది - ప్రాణి కోటికి 
అంతటికీ సరి సమమ్ముగా ; 
ఇచ్చెను ప్రేమ, మమతలను ; ||

గరుడ విహంగము వాహనము 
తన వాహనము ; 
బుల్లి ఉడుతలకు వెన్నున 
రేఖా చిత్రములు ; 
వెన్నుని చేతి చలువయె, ఔనా ; ||

ప్రపంచమునందలి - ప్రతి అణువూ 
నీదు లాలనలు పొందుచున్నవి ; 
లలనా మణుల కన్నుల నిండుగ 
ఆనందాశ్రువుల సరళి నిరాళి ; ||

బ్రహ్మ కమలములు నిండి ఉన్నట్టి ; 
అమందానంద పుణ్య పుష్కరిణి ;
ఐ నిలిచేను , మా ముద్దుల గోపాల శ్రీకృష్ణా! : ||
;
రాధామనోహర 

ఆనంద కిశోరుడు

మన నడకలు సుభద్రములు ;
నిశ్శంకగ కదలండీ ముందుకు ; || 
;
వాకిలి కడ పాత్రలోన ;
పువ్వులు ఉంచినది యశోదమ్మ ; 
నేడు వన విహార పర్వమనీ - గుర్తు చేసె నందరికీ ; ||
;
బయలు దేరదీసినది నంద సతి ;
అందరికీ మునుముందర ; 
నడుస్తున్న సందడి - 
మన బాలక్రిష్ణునిది కదమ్మ! ; ||
;
లోకములను నడిపించే ; 
సూత్రధారి నంద సుతుడు, 
గోవిందుడు, ఆనంద కిశోరుడు, 
అడుగు దమ్ములందున ;
మన నడకలు సుభద్రములు ;
నిశ్శంకగ కదలండీ ముందుకు ; || 
;
- రాధామనోహర ;-

Saturday, May 27, 2017

క్రిష్ణయ్య కిల కిలలు

మురళీ లోల! కెరలించుమయా కిల కిల ;-
మురళీ లోలా! గాన వినోదీ!
కెరలించుమయా కిల కిలలు ; || 
;
వేణు గాన వినోదీ! 
నీదు వంశీ రవళి ;
మువ్వంపు ఓమ్ కార -
పవన చిత్రణలు ఆయెనయ్యారే!
;
మురళిని రాగము ఊరినంతనే - 
గాలి ఆయెనే గాన వర్ణ చిత్రిత యవనిక ; 
మా - ముగ్ధ మయూరి నాట్య లహరికల -
కెరలించుమయా కిల కిలలన్ ; || 

చిరు గాలి చిత్రముల ఎల్లరి డెందముల ;
తన్మయాలెల్లెడల విస్తరిస్తుండగా 
భక్తుల లాలిత్య భావ సుకుమారముల ;
కెరలించుమయా నీదు కిల కిలలున్ ; ||
;
క్రిష్ణయ్య కిల కిలలు ;

శ్రీరామ్ రామ బోలో

రామ రామ బోలో, శ్రీరామ రామ బోలో,
రామ రామ బోలో, శ్రీరామ రామ బోలో ;  ||

కడలిని అదుపున పెట్టిన వానికి 
;         వందనము ; అభివందనము ; 
దౌష్ట్యము నణచిన మహా ధీరునికి 
;         వందనము ; అభివందనము ;   ||
;
కడు మమతలు, ప్రేమల దర్పణమ్మును ; 
మనుజులకొసగిన మహానుభావుకు 
;         వందనము ; అభివందనము ;   ||
;
కోతి కొమ్మచ్చుల ఆటల ధోరణి  సీమల 
మార్చిన - కువలయ దళ నేత్రునికి 
;         వందనము ; అభివందనము ;   || 
;
ఆటవికులకు కుదురు దనములను నేర్పినట్టి ; 
కమలాయతాక్షునికి 
;         వందనము ; అభివందనము ;   ||
;
వానరములను వందనీయునిగ 
;          మలచిన స్వామికి అభివందనము ; 
హనుమ హృదయ కుటీర నివాసునకు 
;         వందనము ; అభివందనము ;   ||
;
raama raama bOlO, Sreeraama raama bOlO
raama raama bOlO, Sreeraama raama bOlO ; ||
;
***************************************************;
reference ;- Queen Hwang Ok in drama: Kim Soo Ro ;
;
अयोध्या ;- अयोध्या ; अयोध्या ;-
;
] Kim Soo Ro in 48 AD when she arrived from her native India at 16 years old. 
According to the Samguk Yusa, 
she arrived on a boat and married Kim Soo Ro from 
the ancient Indian city/state of Ayuta (야유타국), 
present day city of Ayodhya (아요디아 / अयोध्या ) where she was a princess.
] Ayutthaya Kingdom of Thailand did not exist until 1351 AD, which is even after the Samguk Yusa was written in 1281.
] from Thailand or India, she came a heck of long way! For a young teenage girl to make the long and rough voyage over, to settle in a far and strange land and to marry someone she had never met HAD TO have been not only daunting, but downright scary! She had to have been pretty amazing to capture the love of a foreign king who was a stranger to her. Today, 2000 years later, nearly 4 Million Koreans can trace their ancestry back this young princess. That’s pretty badass in my book!
] we can find Queen Hwang Ok in the following drama: 
Kim Soo Ro ;

 ఌౡ ళ  ఌౡ ళ  ఌౡ ళ  హాయీ ;  ఌౡ ళ  ఌౡ ళ  ఌౡ ళ  హాయీ ; ఌౡ ళ  ఌౡ ళ  ఌౡ ళ  haayee  ;
RAAMAM Sri RAma ; 

Friday, May 26, 2017

పాట మొదటి పల్లవి

భక్తి లీల భజన రసడోలలొ ; 
       ఊగవె హృదయమ మనసారా ;
రాధికా భజన రసడోలల ; 
        ఊగవె హృదయమ మనసారా ;  ||
;
చిలకలన్ని దొరకబుచ్చుకొనెను
తొలు దొలుత - పాట మొదటి పల్లవిని ; 
మైనా పిట్టలు అందుకొనెను
అనుసరించి అను పల్లవి ;  ||
;
క్రిష్ణ చరణముల వాలెను
              మలి చరణములు ;
గీత బోధకుని చరణముల 
           శేష గీత చరణములు;
పద పదమున 'తేనె ఊట -
         -  తొణుకులాట' - మనోహరం ;  || 
;
; - రాధామనోహర ;

కురులలోని మల్లిక happy

మల్లిక, మల్లిక, 
నవ సుగంధ ఇంద్రజాలిక ;   ||
;
ప్రణయ దేవి రాధిక ; 
కురులలోని మల్లిక ; 
పరిమళాల జాలముల ; 
స్థిరపడుట ఆనందము ; 
మల్లికకు - 
మధురమౌ ఆనందము  ;   ||
;
దోబూచి ఆటల ; 
పరిమళాల పంజరముల ; 
మత్తిల్లును పొదరిండ్లు   ;   ||
;
చుట్టు చుట్టు దారులంట ; 
వ్రేపల్లియ మురిసేలా ; 
గోపికల పరుగులాట  ;   ||
;
పల్లె పరిమళాలు చుట్టు ముట్ట ; 
సౌరభాల జాలముల ;
పల్లె - స్వయం బందీ అయి, 
ఇముడునంట, కులుకునంట  ;   ||
======================;
;
mallika, mallika ; 
nawa sugamdha imdrajaalika  ;   ||
;
praNaya dEwi raadhika ; 
urulalOni mallika ; 
mallikaku -
parimaLAla jaalamula ; 
sthirapaDuTa aanamdamu ; 
madhuramau aanamdamu  ;   ||
;
dObuuci ATala ; 
parimaLAla pamjaramula ; 
mattillunu podarimDlu  ;   || 
;
cuTTu cuTTu daarulamTa ; 
wrEpalli murisElaa ; 
gOpikala paruglATa  ;   ||
;
palle parimaLAlu cuTTu muTTa ; 
saurabhaala jaalamula ; 
palle  swayam bamdee ayi, 
imuDunamTa, kulukunamTa  ;   ||
;
-  రాధా మనోహర ;

అన్నానా, అనుకున్నానా!

అన్నానా, అనుకున్నానా, 
అన్నానా, అనుకున్నానా, 
రూపము లేని గాలికి - 
   చక్కని రాగ స్వరూపము 
         ఏర్పడుననుచూ ;  ||
;
తోపులొ ఎండిన పుల్ల దొరికెనట ; 
అది, మురళిగ ఆకృతి దాల్చెనట ;  
వెదురుకె అంతటి భాగ్యాలు ;
వేణుమాధవా! నీ పల్లవాంగుళుల
పిల్లంగ్రోవిగ - 
నను చేయుదువనుకొన్నానా..... ;... ||
;
నీ పల్లవాంగుళుల పిల్లనగ్రోవిగ - 
నన్ను చేయుదువనుకొన్నానా, 
వేణు వినోదీ!
మరీ ఇంత కాపీనము నీకు ;
రాధిక పట్ల, భళి భళి, 
శీతకన్నును వేసినావులే!
;
పన్నగశయనా! 
మాయ నిద్దురను నటియిస్తావు ;
రాధ పట్టుదల నీవెరుగనిదా,
నీ వంశీ రాగము తానౌతుంది ;
తప్పదు, తప్పక - 
    ఇదియే ఎరుక!
       ఇది నీకెరుక!   ;  ||
; ========================'
annaanaa, anukunnaanaa, 
ruupamu lEni gaaliki - 
cakkani raaga swaruupamu 
ErpaDunanucuu ;  ||
;
tOpulo emDina pulla dorikenaTa ; 
adi, muraLiga aakRti daalcenaTa ;  ||  
;
weduruke amtaTi bhaagyaalu ;
wENumaadhawA! nee pallawaamguLula
pillamgrOwiga - 
nanu cEyuduwanukonnaanaa,
maree imta kaapiinamu niiku ;
raadhika paTla ; bhaLi bhaLi, 
SItakannu wEsinaawulE!
pannagaSayanA! 
maaya nidduranu naTiyistaawu ;
raadha paTTudala neeweruganidaa,
nee wamSI raagamu taanautumdi ;
tappadu, tappaka - idiyE eruka!
idi neekeruka!   ;  ||
nee pallawaamguLula pillana grOwiga 
nannu cEyudu anukunnaanaa, wENu winOdI! 
;
- రాగాల పల్లకి ;  jld ksm ;

Tuesday, May 23, 2017

శ్రీరామ రక్ష - చాందినీ

వెన్నెల కడలి ఉప్పొంగినది ; 
మన ముద్దుల రాములు పక పక నవ్వెను ; 
బాల శ్రీరాములు పక పక నవ్వెను ; ||
;
తీపి తీపి పేరు "శ్రీరామ, శ్రీరామ " ; 
బోయ నోటిలోన తిరగ మర గాయెను ; 
అది కాస్త తిరగ మర గాయెను ; ||
;
తిరగబడినా గాని ముదము చేకూర్చేను ; 
అదియె అనువనది , 
అదియె 'శ్రీరామ!' ;
అదియె నామ మహిమ ; 
నీ నామ మహిమ కదరా స్వామి! : || 
;
వాలి, రావణాదులు సైతము, 
కొసను కనుగొన్నారు మాధురిని ;
నీ నామ మాధుర్య దీప్తిని కన్నారు, 
మైమరచి పోయారు కద స్వామి! ; || ; 
;
బాలకునివి - 'చల్లని చాందినీ'
ప్రీతి నీకగుటలో - వింతేమి లేదులే : 
ఎల్ల లోకములకు కారుణ్య రక్షకా! 
నీవె శ్రీరామ రక్ష ;  || =
=======================;
;
wennela kaDali uppomginadi ; 
mana muddula raamulu paka paka nawwenu ; 
baala Sreeraamulu paka paka nawwenu ; 

teepi teepi pEru 
"Sreeraama, Sreeraama " ; 
bOya nOTilOna adi kaasta tiraga 

mara gaayenu 

tiragabaDinaa gaani 
mudamu cEkuurcEnu ; 
అదియె anuwanadi ; 
adiye nee naama mahima 
        kadaraa swaami! :  || 
;
waali, raawaNaadulu saitamu, 
kosanu kanugonnaaru maadhurini ; 
nee naama maadhurya deeptini kannaaru 
maimaraci pOyaaru kada swaami, 

baalakuniwi - callani caamdinii preeti 
neekaguTalO - wimtEmi lEdulE :  
ella lOkamulaku kaaruNya rakshakaa! 
niiwe Sreeraama raksha ;  ||

మణి దీప ప్రభలు

కలనాదమై నీకు కీర్తనమునైతిని ; 
కిలకిలల విరిజల్లు కురిపించరా కృష్ణా! : || 
;
పలు రీతుల నిన్ను వేడుతున్నాను ; 
అలుక కినుకలు వలదురా స్వామి ; 
నీదు కోప, రోషమ్ముల వేడి సెగలు సోకి - 
వాడిన పున్నాగ నయ్యానయా ; || 
;
కసరాకు పొదరిళ్ళ గుబురులందున నక్కి ; 
కిసుకున నవ్వేవు ;
చాటు మాటుగ నక్కి, కిసుక్కున నవ్వేవు ;
నీ నవ్వు, అది ఒకటి చాలురా కన్నా!
నా బ్రతుకున వెలుగులను కురిపించు మణిదివ్వె ;
అనుక్షణము వెలుగులను కురిపించు మణి దివ్వె ; ||  =
- మణి దివ్వె  వెలుగు / మణి దీప ప్రభలు ; 
========================================;

[  Tuesday, April 25, 2017 ;-  పాల సంద్రముకు సాటి ;
 ;- రాధా మనోహర ;