మలయ పవన వీచిక ;
మాయగా ........;
ఆయెనుగా రాగముగా
అత్యద్భుత రాగముగా! ; ||
;
కొండలలో కోనలలో
తారాడే కొండగాలి ;
పిల్లనగ్రోవి పంచన
ఇపుడు చేరినది, తెలుసా!? ; ||
;
చెవులను హోరెత్తించినదీ
క్రితం నిముషము దాకా! ;
ఇపుడేమో మారుతము ;
ఎటులనో ఏమోనో -
ఇటుల రాగమాయెను
తను మాయగా! ||
;
దురుసు ఈదురు గాలియె ;
క్రితం క్షణం దాకాను!
ఇపుడేమో వేడి గాలి
ఎటులనో ఏమోనో -
ఇటుల రాగమాయెను
తను మాయగా! ; ||
;
మాయ మర్మములు లేవు!
పూర్వ పుణ్య ఫలముచే వాయువు ;
కన్నయ్య చేతి వేణువులో చేరినది ;
మృదు తాళ జతుల సంగీతము ఐనది;
చిరుగాలిగ మారినది ; ||
;
[ మురళి పంచన చేరెను రాగము! ]
;
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
;
తెలి గోళ్ళు - వెన్నెల ప్రతి ఫలనము ;-
[ Monday, August 31, 2009 ]
;
మురళిలోన తారాడే - మలయ పవన వీచిక
ఆయె రాగ మాలిక !- అది, ఎల్లరికీ వేడుక! ; ||
;
బృందావనిలోన,
అందందున - వలయ నాట్య హారములు
భామినుల ఆట పాటలన్నీ -
యమునా తటి,
యామినిపై వెద జల్లుతూన్న -
కువలయ విరి సౌరభములు! ; ||
;
రాస లీల వేళలలో -
వెదురు పైన స్వామి వ్రేళ్ళు !
శూన్య వంశి" వేణువు "గా -
అవతరించు క్షణములలో
శ్రీ కృష్ణుని నఖములపై -
విరియు జ్యోత్స్నల కాంతుల
రిమ రిమలు, మిల మిలలు -
జిలి బిలి జాబిల్లి నవులు
ఆ - కిల కిలల అలల పయిన -
రిమ్ ఝిమ్ ఝిమ్
రిమ్ ఝిమ్ ఝిమ్
;
===================================
malaya pawana weechika ;
aayenugaa raagamugaa ; atyadbhuta raagamugA!
] komDalalO kOnalalO taarADE ;
komDagaali ; ipuDu chEre muraLi pamchana ; ||
;
chewulanu hOrettimchinadii kritam nimushamu daakA! ;
ipuDEmO eTulanO EmOnO -
iTula raagamaayenu tanu maayagaa! ||
;
wEDi gaali, waDagaali,
Iduru gaaliye ; kritam kshaNam daakaanu!
eTulanO EmOnO -
iTula
raagamaayenu tanu maayagaa! ; ||
;
maaya kaadu, marmamulEwiyunuu lEne lEwu!
puurwa janma puNya phalamu ;
kannayya wENuwulO chErinadi ;
mRdu taaLa jatula
samgeetamu ainadi chirugaaliga maarinadi ; ||
;
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
] మలయ పవన వీచిక ; ; new song ;- కుసుమాంబ ;
] తెలి గోళ్ళు - వెన్నెల ప్రతి ఫలనము ;-
[ Monday, August 31, 2009 ]
No comments:
Post a Comment