రండి రండి,
నేడు కడు వేడుక ;
నేడు కడు వేడుక ;
వేణుగానలోలుని రాసలీల!
కనుడు కనుడు ;
కన్నులపంటగ సాగే
ఈ రాసలీల హేల ;
మక్కువల మేళా! ; ||
;
నీలాల నింగి పైన గిరి,
నిలిచినది!
గోవర్ధనగిరి, - నిలిచినది! .........
నీలమోహనుని మేని సౌరులందున
అట -
అటులే అగుపించే దృశ్యం
అటులే అగుపించే దృశ్యం
బహు మనోజ్ఞము ; ||
;
శివుని శిరసు సిగలోన ;
నెలకొన్న నెలవంక ;
దిగివచ్చినదేమో! ;
మన - మధురాపతి
మధుర మందహాసమ్ములలోనే
ఆ క్రొన్నెలవంక
దిగివచ్చినదేమో! ; ||
దిగివచ్చినదేమో! ; ||
కనుడు కనుడు ;
కన్నులపంటగ సాగెడి హేల!
ఈ రాసలీల హేల మేళా!
మక్కువల మేళా! ; ||
;
=============
# darahaasa liila :-
ramDi ramDi, nEDu kaDu wEDuka ;:
wENugAnalOluni rAsaliila!
kanuDu kanuDu ;
kannulapamTaga sAgE
ii raasaliila hEla mELA! ||
;
gOwardhanagiripaina,
niilaala nimgi nilichinadEmO
niilamOhanuni mEnisaurulamduna
[mari – aTa - ] ||
;
[mari – aTa - ] ||
;
Siwuni Sirasu sigalOna ;
nelakonna nelawamka ;
digiwachchinadEmO! ;
mana madhuraadhipati
madhuramamdahaasammulalOnE || ;
kanuDu kanuDu ;
kannulapamTaga sAgeDi hEla!
ii raasaliila hEla mELA!||
;
:- [ పాట 8 - బుక్ పేజీ 19 ; శ్రీకృష్ణగీతాలు ]
▼ ▼ ▼ ► ► ▼ ▼ ▼ ► ► ▼ ▼ ▼ ► ►
No comments:
Post a Comment