Thursday, November 22, 2012

ప్రతి నుడి "మది గడి" చేరును!


శ్రీ రామ! జయ రామ! జయ జయ రామా!
శ్రీ కృష్ణ! జయ క్రిష్ణ! మురళీ గానలోలా!  ||

అష్టమితో ముడివడిన క్రిష్ణయ్య తులిపి చేష్ఠలు;
నవమి వెన్నెలల నవ్వుల శ్రీ పురుషోత్తముడు!
అందరికీ అనుగ్రహించు శాంతీ సంతోషములు ||

కోదండము విలు పట్టిన సాకేత సార్వభౌముడు;
శివ ధనుస్సు ఒక లెక్కా? అవనిజ నిజ పత్ని అగుట
రామాయణ శ్రీకారము! చోద్యమేమి లేదులే!  ||

కొండనెత్తి చిట్టి వ్రేలు పైనెత్తిన గోవిందుడు;
అండ దండ ప్రజకెపుడూ;
స్వామి! నీదు- కైదండ విడువము
నీ భక్తులము మేమయ్యా! ||

జయ రామ!జయ క్రిష్ణ!  ! !!!!
వడి వడిగా వెల్వడును భజనల మధు సవ్వడి
సందడించు మా ఎడదల; జయ రామ!జయ క్రిష్ణ!
ప్రతి నుడి "మది గడి" చేరును; జయ రామ!జయ క్రిష్ణ!
ముడి పడు నాలుక, పెదవులు; కోవెలలే అయ్యేను,
అయ్యారే! విభ్రమము!
;
అధరములు భజన మందిరములు


No comments:

Post a Comment