Tuesday, November 20, 2012

తకిట థోమ్ 'గురు'వాన

రాగమైన వాన, రమ్యమైన వాన
కొంగ్రొత్త రాగమై నిలిచినట్టి 'మైనా'!
ఈ చిరుజల్లు వాన
ముత్యాల వాన  ||

వైనవైనాలుగా తక్కుతూ తారుతూ
కోట్లాది 'ధారల- దారములు' పెనవైచి
గ్రహ గోళ తతులను సంధానపరిచేను||

మేఘాల మాయ తివాచీలనెక్కేసి
హరివిలుల ద్వారాలు దాటివచ్చేను
పుడమిపై అడుగిడిన బంగారు చాన!
వానమ్మ వాన! వయ్యారి వాన! ||      

కులుకు కులుకుల మెలిక నడకలతొ తాను
తైతక్కలాడుచూ, తచ్చాటలాడుతూ
ఋతు నాట్యరాణి విచ్చేసెనండీ!
ఈ ఉర్వితలమునకు ||

మెరుపుల చెలులతో    
తకిట థోమ్ దరువులను
ప్రకృతికి నేర్పేటి "నెరజాణ గురువు"    
మన వర్ష సామ్రాజ్ఞి!  
వానమ్మ వాన! ముచ్చటల వాన! ||  

;

తకిట థోమ్ "'గురువు"'వాన
(00049318 :  కోణమానిని views)
;


No comments:

Post a Comment