Thursday, October 18, 2012

వర్ధనమ్మ! ఇదిగొ మంగళం!


అక్టోబరు 16 నుండి శరన్నవరాత్రులు- ప్రారంభం ఐనవి.
అన్ని చోట్లా పండుగ కోలాహలములు!
బతుకమ్మ పూజలు, ఊరేగింపులు, ఆ సందడులు....
ఆ వైభవ సౌందర్యాలు; నిఖిల లోక జనులకూ  నేత్రపర్వాలే!!!!! !!!!!!!!  
“బతుకమ్మ! బతుకమ్మ! ఉయ్యాలో! బంగారు గౌరమ్మ! ఉయ్యాలో!... అంటూ
జానపద పద సౌరభాలు ఘుమ ఘుమా గుబాళిస్తూంటాయి.

pallavi :-

వర్ధనమ్మ! ఇదిగొ మంగళం!
పర్వత వర్ధనమ్మ! ఇదిగొ మంగళం ||
anu pallavi:-
విద్యావేత్తలకెల్ల ఒజ్జవైనట్టి తల్లి ||వర్ధనమ్మ!||

స్థూల సూక్ష్మ దేహమంత
చూచి చూచి పార జూసి;
నాసికా జ్య మనెడి ;
నాద  బిందుకళల తెలిపే అమ్మ  ||వర్ధనమ్మ!||

తాత్కాల జ్ఞానమనెడి
తగిన ఉసులు నింపినావు:
నిత్య శాంత భావమనెడి
జ్ఞాన జ్యోతిని వెలిగించినావు ||


AAAAAAAAA aaaaaaa!!!!!!!!! ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ 

గౌరమ్మ! పసిడి కుటుంబ పార్వతి! 




















~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~  మ్మ్ మ్ మ్మ్ మ్ మ్ ~ ~ ~ ~ ~ ~ ~  ~ ~ ~  


ఆకాశవాణి- అదేనండీ; అప్పుడే మరిచినారా?
all India Radio  లో పొద్దు పొద్దునే భక్తి రంజని" ప్రోగ్రామ్" లో
శృతిసుభగమైన భక్తి గీతములు వస్తూన్నవి.
అక్కడ విన్న అపాట ఇది.
సంగీత బాణీ బాగున్నది. వీలైతే. అహ; కాదు, వీలు  కల్పించుకుని, ఈ పాటను వినండి.

వాత్సల్య సుధల గని


అవనీతలమున భక్తకోటికి- 
లభియించిన పెన్నిధి నీవమ్మా! 
నీ లాలనలో, మురిపెమ్ముల 
ఊగే తూగే శిశువులమమ్మా! ~ 
మేము  ~  

నీ లాలనలో, మురిపెమ్ముల 
ఊగే తూగే శిశువులమమ్మా!||


అవనీతలమున భక్తకోటికి  ~  
లభియించిన పెన్నిధి నీవమ్మా! నీవేనమ్మా! ||

తల్లివి నీవని - కల్పవల్లివని;  
నీ ఒడియే అందరి సుఖ ధామమని; 
నెర నమ్మితిమి నీ పిల్లలము- 
మేము  ~  నీ పిల్లలము  ||

కరువు ఉండదు నీ కృపా సుధలకు;
దరువులేసి, కేరింతలు ఆడే- చిన్ని బిడ్డలము; 
చేరదీసి, వాత్సల్యమొసగుమా, 
మా చల్లని తల్లివి నీవేనమ్మా! || 

వాత్సల్యపు తరుగని- గనివి నీవని
ఈ అవనిని; ఎరుగనిదెవ్వరనీ    || 
నీ లాలనలో, మురిపెమ్ముల 
ఊగే తూగే శిశువులమమ్మా!   ||

~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ;
~~~~~~~ ~~~~~~



















~ ~~~~~~~ ~~~~~~
~~~~~~~ ~~~~~~
~~~~~~




అఖిలవనిత
 17223 పేజీవీక్షణలు - 670 పోస్ట్‌లు, చివరగా Oct 18, 2012న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
కోణమానిని తెలుగు ప్రపంచం
 33125 పేజీవీక్షణలు - 960 పోస్ట్‌లు, చివరగా Oct 15, 2012న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
Telugu Ratna Malika
 1852 పేజీవీక్షణలు - 109 పోస్ట్‌లు, చివరగా Sep 18, 2012న ప్రచురించబడింది


********************;

AAAAAAAAA aaaaaaa!!!!!!!!!

చంద్రముఖీ! నమో! నమో!


శ్రీ శివజ్యోతీ శుభదాయిని
భువన మోహినీ –
నిఖిల కృపా సుగంధవర్షిణీ
నమో! నమో!  ||

చంద్రముఖీ| జ్యోత్స్నా భాసిని|
మధుర భాషిణీ – శ్రీ గౌరీ
మాతా  దుర్గా - అర్ధనారీశ్వరి
భక్తకోటి వర కల్పవల్లీ! ||
   
శంకరి - దేవీ - శ్రీ ఓంకార ప్రారంభా –
శర్వాణి – శాంకరీ        
జగజ్జనని శ్రీ ఆది పరాశక్తి
సౌందర్య లహరీ విహారిణీ  ||

SHARVANI (KANYASHRAMA),CHITTAGONG




















SHARVANI (KANYASHRAMA),CHITTAGONG,BANGLADESH (photo link)

! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! !  !

aaaaaa a aaaaaa aaaaaaa aaaaaaa 

శ్రీ గాయత్రీ! నమో! నమో!



శ్రీ గౌరి పరాత్పరి- పరమదయాకరి  
అఖిలాండేశ్వరి నమో! నమో!        ||

అంబా శాంభవి - అపర్ణ: పార్వతి:
సుగుణ నిలయ - శ్రీ హైమవతీ            ||

సంగీత విలాసిని! -| విపంచి రాగిణి ;
కళా జ్యోతి! -  శ్రీ గాయత్రీ!                ||      

||అఖిలాండేశ్వరి| నమో! నమో!
పరమదయాకరి  నమో నమో||

! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! !
aaaaaa a aaaaaa aaaaaaa aaaaaaa
















! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! !

aaaaaa a aaaaaa aaaaaaa aaaaaaa

Monday, October 15, 2012

సుందరీ శంకరీ


పల్లవి:
బృహదంబా మదంబా జయతి    
;                    జయతి జయతి
బ్రహ్మాండ స్వరూపా జగదంబా   ||

(samasta charaNam ) :-

మహా దేవ యువతీ భానుమతీ
మద్గురు గుహ జననీ నిరంజనీ
మహేశ్వరీ రాజ రాజేశ్వరీ
మహా త్రిపుర సుందరీ శంకరీ

భానుమతీ రాగము; దీక్షితర్, shitya.Net (Link: for list)

*****************************;

1760 -1850,Trinity of Carnatic music; period Maratha rulers














Pallavi:

bṛhadambā madambā 1jayati
brahmāṇḍa svarūpa jagadambā

Samashti Charanam

mahā dēva yuvatī bhānumatī
madguru guha jananī nirañjanī
(madhyama kāla sāhityam)
mahēśvarī rāja rājēśvarī
mahā tripura sundarī śaṅkarī

Bhnumati ragam: (Link: shity net)
Muthuswami Dikshitar;
వనస్పతీ రాగము =  భానుమతీ రాగము

*****************************;
Tags:
భానుమతీ రాగము;
4వ మేళకర్త రాగము: వెంకటమఖి ;
ముత్తు స్వామి దీక్షితర్ కృతి:
1760 -1850,Trinity of Carnatic music; period Maratha rulers

*****************************;


కోణమానిని తెలుగు ప్రపంచం
 32938 పేజీవీక్షణలు - 959 పోస్ట్‌లు, చివరగా Oct 10, 2012న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
అఖిలవనిత
 17120 పేజీవీక్షణలు - 667 పోస్ట్‌లు, చివరగా Oct 2, 2012న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
Telugu Ratna Malika
 1838 పేజీవీక్షణలు - 109 పోస్ట్‌లు, చివరగా Sep 18, 2012న ప్రచురించబడింది


Tuesday, October 2, 2012

షోడశ కళా జగత్తు


పుష్కర కాలము క్రితము- స్త్రీలు మెహిందీని- ఇళ్ళల్లో తయారించేవారు. ఇప్పుడు అన్ని చోట్లా కోన్లు దొరుకుతున్నవి, కాబట్టి ఈ బాదరబందీని- ఎవరూ ఆట్టే చేయుట లేదు.ప్రస్తుతము అప్పటి పద్ధతి- ని గుర్తుచేసుకుందామా!?
గోరింట మన ఇంట చేసేద్దామా?

mehndi adorning;jewelry; bindis; karwa‑chauth‑celebration


 కావలిసినవి :

ఇంట ఈ రెడీమేడ్ గోరింట పంట- సిద్ధపరుచుకునేటందుకు కావలసిన వస్తువులు రెండే!
100 గ్రాములు బెల్లము (గుడ్) 
చెంచాడు కుంకుమ- 
మరి రెండు ఇవి! ఇంతే!చేసే పద్ధతికూడా చాలా సులభమే!

పధ్ధతి  :

మందమైన గిన్నె( Pan):
అంచు ఉన్న ప్లేటు (Plate):
ఇక్కడ కావలసిన ముఖ్యమైన వస్తువులు.
ఇత్తడి గిన్నెలు వగైరాలు అందుబాటులో లేని వారు-ఇనుపడబ్బాలు – “పారేసినా ఫర్వాలేదు!“ – అనిపించే దాన్ని వాడండి.
పాత్రను ప్లేటుతో గానీ, కంచముతోగానీ పూర్తిగా మూసిఉంచాలి. ప్లేటు గనుక ఐతే- దానిలో నీళ్ళు పోస్తే ఉండగలిగేలాగా- ఆ ప్లేటుకు అంచు ఉండాలి.కంచము లాంటిది .

 step 1 :- డబ్బా లోపల కొంచెము మందముగా బెల్లము (జాగరీ)ను అంటించాలి.
ఇలాగ మెత్తిన Jaggery మధ్య చిన్న గురుగు చేయాలి.
అందులో నడుమ చిన్న గ్లాసు (లోటా)ను నిలిపి ఉంచాలి.
గ్లాసు(లోటా)ను నిలిపి ఉంచాలి.

step 2 :- ఇక డబ్బా పైన(/గిన్నె పైన)
అంచు ఉన్న పళ్ళెము/ కంచమును మూత పెట్టాలి. ఈ ప్లేటులో నీళ్ళు నింపాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టాలి.
(స్టవ్వు వెలిగించడము మరువకండీ!!!!)

 step 3:- బర్నర్ సిం లో సన్నపాటి సెగతో ఉండాలి. ఇలాగ లో వెలుగులో 15 నిముషాల వరకూ ఉంచాలి.

step 4 :- లోపలి బెల్లము {गुड़ (शक्कर)} బాగా మరిగి, మాడుతూన్నపుడు- 
అది ఆవిరిగా మారుతుంది.ఆ బెల్లపు ఆవిరి కాస్తా పై మూతకు తాకి, చుక్కలు చుక్కలుగా అంటుకుని, జారుతాయి.
అలాగ జారుతూన్న ఎర్రటి ఆవిరి ద్రవము- కింద ఉంచిన బుల్లి లోటాలోకి పడ్తాయి. 
బొట్టు బొట్లుగా పడిన ఎర్రటి ద్రవముతో నిండిన గ్లాసును జాగ్రత్తగా బైటికి తీయాలి.
ఈ ద్రవమే మనకు ఉపయోగపడే గోరింటఅన్న మాట!

చిన్న పుల్లతో ఈ మెహిందీని నచ్చిన డిజైనులతో అరిచేతులలో పెట్టుకోవడమే తరువాయి.అన్నట్టు లిక్విడ్ చల్లారాక నెమ్మదిగా హస్తాలంకరణలను ముచ్చటగా తీర్చిదిద్దుకోవచ్చును.

**                          **                      **               **                            **                             
గోరింటాకును దివ్య ఔషధముగా ప్రాచీన యుగముల నాటి నుండీ మానవ జాతి ఉపయోగములోనికి తెచ్చింది. గోరింటపూతను, చెట్టు బెరడును, చిగుళ్ళనూ, చలువ చేసే మందులాగా- చిట్కా వైద్యములకు మల్లే వాడుకలో ఉన్నది.అలంకరణా వస్తువుగా ఐతేనేమి,
ఇన్ని రకాలుగా మేలును కలిగిస్తూన్న గోరింటాకును- సాంప్రదాయరీతులలో ఆవిష్కరించిన  తొలి మనిషికి జోతలు!

**                          **                      **               **                            **    
(Link for my ESSAY):-

**                          **                      **               **                            **    

My essay: 

శనివారం 20 నవంబర్ 2010


పదహారు అలంకారాలు

{కోణమానిని: నవంబర్ 11 తేదీ, 2010:సంవత్సరము}
ఉత్తర భారత దేశంలో “సోలాహ్ సింగార్” అనే ఆచారం సుప్రసిద్ధమైనది.
ఈ మాట "సింగార్ సోలాహ్" ఒక జాతీయంలాగా విస్తృత వ్యాప్తిలో ఉన్నది.
అనేక జానపద, లలిత గీతాలలోనే కాక
సినిమా పాటలలోనూ ఈ పదం సాక్షాత్కరిస్తున్నది.

అసలు “సోలహ్ సింగార్” అంటే “ పదహారు అలంకారాలు” అని అర్ధం.
“షోడశ కళలు” ప్రతీకగా ఇది వాడుకలోనికి వచ్చింది.
16 సింగారాలు సాధారణ జీవనంలో కంటే,
వివాహ తరుణంలో “వధువుకు (ఓపిగ్గా) చేస్తారు అన్న మాట!!!!
సరే! అవేమిటొ ఇప్పుడు పరికిద్దామా?!!!

1.మర్దన -> పెళ్ళి కుమర్తె మేనుకు -
రోస్ వాటర్, మల్లె , గులాబీ, చందన,
గంధాది తైలములతో ( -rose, jasmine, sandal)
మర్దన/ మాలీష్ చేస్తారు.
2.మంగళ స్నానములు ->
పాలు, అత్తరు, ఇతర సుగంధ ద్రవ్యాలను కలిపిన జలములతో
చేయించే స్నానము పేరు ;
శీతా కాలంలో “ఆల్మండ్”( almond) నూనె వగైరాలనూ,
ఎండా కాలంలో ఐతే రోజా పుష్ప దళాలను,
లోధ్ర, వట్టి వేళ్ళూ, మార్వా వగైరాలనూ మిక్స్ చేసిన లేపనాలను ఉపయోగిస్తారు.
(mixed with rose petals and mixed with khus or marwah)
3. కేశ పాశ సుగంధీ కరణము ->
షీకాకాయ(= షీకాయ), నాగర్మోత్, కచ్చూరాలు కల గలిపిన పేస్టును –
ముందర తైలము పూసిన ఆమె కురులకు – అలుముతారు.
4. అంగార విలేపనం,->
ఇప్పటి వాళ్ళు “ఫౌండేషన్ క్రీము"ను పూసుకుంటున్నారు కదా!
అలాంటిదే ఇదిన్నూ!
గంధమును ముఖము, మెడ, చేతులకు పలచగా పూస్తారు.
5. కాజల్ రేఖా దీపనము;
కన్నులకు కాటుకను పెడతారు.
పెళ్ళి కూతురు సోగ కన్నులకు తీర్చి దిద్దేదే ఈ kohl/ kajal.
6. తిలక ప్రసాధనము ->
ఆమె నుదుట (లలాట భాగమున) మాంగల్య చిహ్నముగా
బిందీ-ని/ కళ్యాణ తిలకమును సున్నితంగా తీర్చి దిద్దుతారు.
గోరోచనము, హర్త తాళ్ , కుసుంభము మున్నగు
(gorochana, hartal, kusumba )మున్నగు సుగంధ ద్రవ్యములతో
ఈ తిలకములను తయారు చేస్తారు.
పూల రేకులతో కూడా ఇలాంటి కుంకుమలను తయారు చేస్తారు.
7. ముఖ ప్రసాధనము ->
మూలికలు, బంగారు, వెండి పొడులతో
నవ వధువు వదనము మిసిమి కాంతులతో ప్రకాశిస్తుంది కదా!
అటు తర్వాత బుగ్గపై వధువుతో పాటు –
వరుడికి కూడా దిష్టి చుక్కను పెడతారు. కాటుకతో/
colour pencil తో ఈ నల్లని చుక్క దృష్టి దోష నివారిణి అని విశ్వాసం;
– కానీ దీనిని ఎందు వలననో గానీ,
“ షోడశాలంకారముల పట్టిక”లోనికి అనుసంధానము చేయ బడ లేదు.
@8. కేశ పాశ రచన->
9. ఆలక్త నివేశనము -> మరేమీ కాదు లెండి,
లిప్ స్టిక్ ( lip stick) అన్న మాట.
అలనాటి రోజులలో మూలికలూ, కుసుంభ పుష్ప దళాదులు మిళాయించి
సిద్ధ పరచిన లేపనాలతో వధూ వరుల అధరాలను సున్నితంగా సింగారించే వారు.
ఈ రోజులలో అమ్మలక్కలకు అంత శ్రమ లేకుండా లిప్ స్టిక్ లను
అందుబాటులో ఉంటూన్నాయి కదా!
ఇంచక్కా bride, bride grooms
స్వయంగా తమ పెదవులను వర్ణ భరితం చేసుకో గలుగుతున్నారు కదా!!!!!!!!
10. హస్త సుశోభితము -> చేతులకు అలంకారములు;
11.పాద సుశోభితము ; అర్ధమైంది కదండీ!!!!
చరణ ద్వయముకు = పాదాలకు పారాణి – ఉత్తరాది వారు,
బెంగాలీలు మున్నగు రాష్ట్ర ప్రజలు altah వగైరాలతో –
పద ద్వయికి చుట్టూతా గీతలు, లైన్లు వేసి ముచ్చట కొద్దీ డిజైన్లు చిత్రీస్తారు.
12. మహా వస్త్ర ప్రదానము -> పట్టు, సిల్కు వంటి దుస్తులను ఎంపిక చేస్తారు.
పెళ్ళి పీటలపై కూర్చున్న ఆ జంట ,
హూతులకు నేత్ర పర్వం చేసే రీతిలో వస్త్ర ధారణ ఉంటుంది.
( సాంప్రదాయక పద్ధతులలో – గోచీ – కుచ్చులు – పోసి,
వారికి కట్టడానికి చేసే అందమైన ప్రయత్నము ఇది.)
13. పుష్ప ధారణము -> నీలాల కుంతలములను పరిమళ భరితమైన ,
నయన పర్వము ఒనరించే రంగు రంగు పూవులతో అలంకరిస్తారు.
ఇలాగ పూల జడలను వేయాలని
స్త్రీలు పోటీ పడుతూ చేసే ఆ సందడే సందడి –
అది గొప్ప ముచ్చట.
14. అలంకార ధామము ->
పాపిటి బిళ్ళ, జడ బిళ్ళ, చెవి లోలాకులు/కర్ణాభరణాలు ,
హారములు/ నెక్లెసులు, దండ కడియాలు, వంకీలు;
వడ్డాణము, మణి మేఖల, కాలి పట్టీలు /అందెలు/ కాలి గజ్జెలు,
( పెళ్ళి ఐన వెను వెంట “మెట్టెలు”) ఇత్యాది ఆభరణాలతో
పెళ్ళి పీటలమీద ఆసీనులైన నవ వధూ వరులతో ,
ఆ వివాహ దృశ్యము నయనానంద కరంగా ఉంటుంది కదా!!!!!!
15. తాంబూల సేవనము ->
తాంబూల సేవనము వదనములోని కళా కాంతులకు దోహద కారి.
mouth freshener గా అత్యంత పురాతన కాలం నుండీ
మన భారత దేశములో జన బాహుళ్యము ఆమోదము పొందిన ఆచారము.
16. దర్పణ విలోకనము -
( తరువాతది ఈ “శుభ దృష్టి).
"తమ అలంకారాలను సరి చూసుకుని, సరి చేసు కోవడమే” –
ఈ దర్పణ విలోకనము –
అంటే అద్దములో తమ ముద్దు బింబమును తనివి తీరా చూసుకోవడము అన్న మాట.
దక్షిణాదిని కూడా ఇలాంటి ఆచారాలను పాటిస్తునారు;
మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఇవి అమలులో ఉన్నాయి;
కానైతే ఈ సాంప్రదాయ ఆచరణకు - ప్రత్యేకించి, స్పెషల్ పేరు ఉన్నట్టు అగు పడదు.


- కాదంబరి 
(shhoDasha) = number 16 - 
షోడశ కళా జగత్తు/ 16 సింగారమ్S
16 సింగారమ్S

గోరింట మన ఇంట
Posted on September,2012 by విహంగ 
http://vihanga.com/?p=5188