Thursday, October 18, 2012

వర్ధనమ్మ! ఇదిగొ మంగళం!


అక్టోబరు 16 నుండి శరన్నవరాత్రులు- ప్రారంభం ఐనవి.
అన్ని చోట్లా పండుగ కోలాహలములు!
బతుకమ్మ పూజలు, ఊరేగింపులు, ఆ సందడులు....
ఆ వైభవ సౌందర్యాలు; నిఖిల లోక జనులకూ  నేత్రపర్వాలే!!!!! !!!!!!!!  
“బతుకమ్మ! బతుకమ్మ! ఉయ్యాలో! బంగారు గౌరమ్మ! ఉయ్యాలో!... అంటూ
జానపద పద సౌరభాలు ఘుమ ఘుమా గుబాళిస్తూంటాయి.

pallavi :-

వర్ధనమ్మ! ఇదిగొ మంగళం!
పర్వత వర్ధనమ్మ! ఇదిగొ మంగళం ||
anu pallavi:-
విద్యావేత్తలకెల్ల ఒజ్జవైనట్టి తల్లి ||వర్ధనమ్మ!||

స్థూల సూక్ష్మ దేహమంత
చూచి చూచి పార జూసి;
నాసికా జ్య మనెడి ;
నాద  బిందుకళల తెలిపే అమ్మ  ||వర్ధనమ్మ!||

తాత్కాల జ్ఞానమనెడి
తగిన ఉసులు నింపినావు:
నిత్య శాంత భావమనెడి
జ్ఞాన జ్యోతిని వెలిగించినావు ||


AAAAAAAAA aaaaaaa!!!!!!!!! ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ 

గౌరమ్మ! పసిడి కుటుంబ పార్వతి! 




















~ ~ ~ ~ ~ ~ ~ ~ ~ ~  మ్మ్ మ్ మ్మ్ మ్ మ్ ~ ~ ~ ~ ~ ~ ~  ~ ~ ~  


ఆకాశవాణి- అదేనండీ; అప్పుడే మరిచినారా?
all India Radio  లో పొద్దు పొద్దునే భక్తి రంజని" ప్రోగ్రామ్" లో
శృతిసుభగమైన భక్తి గీతములు వస్తూన్నవి.
అక్కడ విన్న అపాట ఇది.
సంగీత బాణీ బాగున్నది. వీలైతే. అహ; కాదు, వీలు  కల్పించుకుని, ఈ పాటను వినండి.

No comments:

Post a Comment