Friday, December 23, 2011

మా చూపులకు దృశ్యప్రసాదము


నవ నళిననేత్రా! 


ఇభరాజ వరద! సుగుణాలయా! నవ నళిననేత్రా! నారాయణా! ;
శుభముగా సుఖ శాంతి సౌభాగ్య పెన్నిధుల నీ జగతి కొసగుమా!
                                                                     మురళీధరా!                ||

దధి క్షీర నవనీత మీగడలు; ఆరగింపులు ఇవిగొ! ఆనందబాలుడా!
అభిమానము, భక్తి ప్రేమానురాగముల; రంగరించీ బాగ
తెచ్చి ఇస్తున్నాము-గారాలు కుడుచుచూ గ్రోలుమోయీ!
నే"నడిగినదె తడవుగా తేలేదు, ఏమనుచు"
కాస్తంత అలిగితే; నీ బుంగమూతిని ముద్దాడు   వెన్నెలలు                      ||

చిన్ని పెదవులను "సున్న"గా చుట్టుంచి; ఆలాగునే ఉంటే ఏలాగయా?
నీ నోటిలో సకల విశ్వమ్ములను చూపు; భాగ్యమొక్క నీ జననికేనా?!
మా ఎల్లరీ చూపులకు ఆ వింత పుణ్య మధుర ప్రసాదమ్మును
అనుగ్రహించ మరిచితే మేమూరుకోము, ముద్దుల క్రిష్ణయ్య!!                   ||

******************************************

       రచన:- కోణమానిని ;

No comments:

Post a Comment