;
;
;
నీ ప్రతి కదలిక మనోహరమ్ము;
విప్రతిపత్తి లేనిదీ కథ,
ఔను కదా! స్వామీ! ||నీ ప్రతి||
వినీల విలసిత కేశములందున;
గోలలు సేయుచు చేరె భ్రమరములు;
స్వామి! నీదు
వినీల విలసిత కేశములందున;
గోలలు సేయుచు చేరె భ్రమరములు ||నీ ప్రతి||
సరసిజ రాసులు- హాస కుశలముగ;
నీ హస్త కమల; విలాసము పొందె చతురముగ ||నీ ప్రతి||
కొలనుజలమ్ముల; రవి కిరణ బింబములు;
మెలగు వినయముగ; నీ పద నఖముల ||నీ ప్రతి||
ఇదియే వింత!- సకల జీవులకు; ఉన్నపాటున;
చకిత చతురముగ; ఒనగూడినవి; చిత్తోల్లాస వైభోగములు
|| నీ ప్రతి కదలిక మనోహరమ్ము;
విప్రతిపత్తి లేని కథ, ఇది నీదే!
ఔను కదా! స్వామీ!! ||నీ ప్రతి||
*********************************************;
nI prati kadalika manOharammu;
vipratipatti lEnidii katha,
aunu kadaa! swaamii!! ||
vinIla vilasita kESamulaMduna;
gOlalu sEyuchu chEre bhramaramulu; swaami! nIdu ||
sarasija raasulu- haasa kuSalamuga;
nii hasta kamala; vilaasamu poMde chaturamuga ||
kolanujalammula; ravi kiraNa biMbamulu;
melagu vinayamuga; nI pada nakhamula ||
idiyE viMta!- sakala jIvulaku; unnapATuna;
chakita chaturamuga; onagUDinavi;
chittOllaasa vaibhOgamulu
nI prati kadalika manOharammu;
vipratipatti lEnidii katha,
aunu kadaa! swaamii!/mi! ||
*********************************************;
పునీతా గాంధిః - ఓ తాళపత్ర వినతి;(Desk-File)
No comments:
Post a Comment