క్రిష్ణ లీలలు
నీవు, నడయాడిన ప్రతి జాడ,
ప్రతిదీ ఒక ముచ్చట కద!
కన్నా! - ఇది నీ లీల కాక వేరేమిటి!!! ||
 
కన్నా!
నీ నీలి మేను నిండ - వెన్న పూసలెన్నెన్నొ ;  
కన గలుగుతూన్న నీలి నింగి;            
విశాల గగనము,------  
"తారకలు నిండి ఉన్న- తన రూపమె!" - అనుకున్నది,
అది కూడా ఒక ముచ్చట - కద కన్నా!       
ఇది నీ లీల కాక వేరేమిటి!?! ||   
   
పెరుగు వెన్న - పూస పూస - మెరిసే నక్షత్రము;  
చిరు నవ్వు నీది జాబిల్లికి           
ముద్దు ముచ్చట! -----
శరదిందు పున్నమీ రేయికి    
ఇట విడిది చేయు వైభోగము! 
అది కూడా ఒక ముచ్చట - కద కన్నా!  
ఇది నీ లీల కాక వేరేమిటి!?!     ||    
ఆ యమునా వాహినికి - నింగి అంటె అసూయ,
తన, అలల గాలి మబ్బులతో
దాచి వేయ జూచు నిన్ను!
బృందావని
నికుంజముల పొదువుకొనగ చూచును
ఈ ముచ్చట గాథలన్నినీ లీలలే క్రిష్ణయ్యా!       ||
 
 
 
 
          
      
 
  
 
 
 
 
 
 
 
 
 
 
No comments:
Post a Comment