
పొలతి రాధిక అట్టె నిలిచిపోయేనయా
కదలనీ బొమ్మగా అచ్చెరువున
నీ బొమ్మ తానే! క్రిష్ణయ్యా! ||
నీ కనుబొమ్మల కోవెలలొ తీరుగా ఉన్న:
కస్తూరీ - నామములలో వలయములు తిరిగేను:
వే వేల భాస్కర కిరణావళి;
అది కనిన రాధమ్మ కదలనీ బొమ్మగా:
నిలిచినదీ క్రిష్ణయ్యా! – అచ్చెరువున ||
కొసరి కొసరి పాల బువ్వ ఇదిగో! అనుచు
గోరుముద్దలు నీకు – తినిపించె రాధిక;
పాల బుడగలలోన బస చేసిన
తన బింబముల కనిన రాధమ్మకు ;
సంభ్రమములందున తల మునకలు ||

No comments:
Post a Comment