Wednesday, May 18, 2011

పాటల దొర శ్రీ క్రిష్ణ మూర్తి















పాటల దొర శ్రీ క్రిష్ణయ్య
ఎద ఎదనూ ;తేట గీతిగా మార్చెనొహో!
నీటుగ ప్రతి మది మందిరమాయెను
ఇదేమి మాయా మర్మమొహో! ||
 
బృందావనిలో మాధవు అలికిడి ;
సందడి సేయుచు గాలి తెలిపెను ;
లేమలార! మనమందరమూ;
ఏమరకుండా సేయుదము;
సాధన తప్పక నిత్యమునూ;  
మృదు మురళీ వీచిక లయ్యెదము ||
రాధా దేవికి ఎపుడో ఆయెను
ఇనుముబ్బడిగా కరతలామలకము ;
సాధన విద్యా నిధి రహస్యము ;
మాధవీ లతా నికుంజములెల్లడ ;
ధ్యాన తపస్విని, క్రిష్ణ ప్రేయసి    
తానే సురభిళమాయెనొహో! ||
&&&&&&&&&&&&&&&&&













paaTala dora, eda edanuu ;
tETa gItigaa maarchenohO!
nITuga maMdiramaayenu eDadalu;
idEmi maayaa marmamohO! ||
E mAtramu jaapyamu
sEyakuMDa raMDi, raMDi!
parugiDi, vEgame  raa raMDi!
BAmA maNulAra! satvaramE
taamellaru saraguna raaraMDI! mIru
bayalu dEri, tarali raMDi! ||
bRMdaavanilO maadhavu alikiDi ;
saMdaDi sEyuchu gaaali telipenu ;
lEmalaara! manamaMdaramuu;
EmarakuMDA sEyudamu;
saadhana tappaka nityamunuu;
mRdu muraLI vIchika layyedamu ||
raadhaa dEviki epuDO aayenu ;
inumubbaDigaa karatalaamalakamu
saadhana vidyaa nidhi rahasyamu ;
maadhavI lataa nikuMjamulellaDa ;
dhyaana tapasvini krishNa prEyasi ;
taanE suraBiLamaayenohO! ||

&&&&&&&&&&&&&&&&&&& 

No comments:

Post a Comment