ఈ యమునా తటి సీమల ;
రాయబడిన సంతకములు
ఆ పద్మ రేఖలెవ్వరివి?
ఆ అడుగుదమ్ములెవ్వారివి? ;
తెలుపుమమ్మ! ప్రియ సఖియా! ||
ఇంకెవరివి? క్రిష్ణునివి! ;
ఆ శంఖ, పద్మ రేఖలు
మా ముద్దు బాల క్రిష్ణయ్యవి! ||
చరణ విన్యాసములను ;
హత్తుకొనినవి పడగలు;
కాళీయుని ఫణములపై;
అరుణోదయ చిత్రములు ||ఇంకెవరివి?||
చరణ విన్యాసములను
తన ఎదపై అచ్చుకొనెను;
వర ధరా తలము తానే
నిత్య కళ్యాణి అవగా ||ఇంకెవరివి?||
&&&&&&&&&&&&&&&&&&
Lotus Sculpture |
I yamunaa taTi sImala ;
raayabaDina saMtakamulu ;
aa padma rEKalevvarivi?
aa aDugudammulevvaarivi? ;
telupumamma! priya saKiyaa! ||
iMkevarivi? krishNunivi! ;
aa SaMKa padma rEKalu
maa muddu baala krishNayyavi! ||
charaNa vinyaasamulanu ;
hattukoninavi paDagalu;
kALIyuni phaNamulapai;
aruNOdaya chitramulu ||
charaNa vinyaasamulanu
tana edapai achchukonenu;
vara dharaa talamu; taanE ;
nitya kaLyaaNi avagaa ||
&&&&&&&&&&&&&&&&&&&