Tuesday, June 30, 2009

రంగులు,రమణీయమైన మోజులు


రంగులు - రమణీయమైన మోజులు ;

======================

"ఇంద్రధనుస్సు" అనగానే సప్త వర్ణ సమ్మేళన సుమనోజ్ఞ వర్ణ వేదికా తోరణం చటుక్కున మన తలపులలో మెదులుతుంది. ఎరుపు, నీలం, ఆకు పచ్చ ప్రధానమైన రంగులు. వివిధ నిష్పత్తులలో మూడింటి మిశ్రమాలే అనేకనేక వర్ణాలను సృజిస్తున్నాయి.

మనస్సుకు రంగుల పట్ల గల ఆకర్షణయే, అనేక పండగలకూ, పబ్బాలకూ; రంగవల్లికలు, చిత్రలేఖనము ఇత్యాది అనేక కళలకు, దేవతారాధనల వేడుకలకు, తిరణాళ్ళకు ఎన్నింటికో పునాదులను వేసిందని చెప్పవచ్చును.

"ఆయా రంగులను ఇష్టపడేవారు ఎలాంటి స్వభావాలను కలిగి ఉంటారు?" అనే విషయం మీద అనేక ఆసక్తికరమైన ఫలితాలు వెలువడుతున్నాయి.
*********************************************
"ఎరుపు" రంగును ఇష్టపడే వారికి కోపం అధికంగా కలిగి ఉండే స్వభావాన్ని కలిగి ఉండే అవకాశం ఉన్నది. వారికి తమ పట్టుదల, పంతం నెగ్గి తీరాలనే ఆవేశం, మొండితనం ఉంటాయి. అలాటి వారు ఆడంబరాలకు ఎక్కువగా వెచ్చిస్తారు. ముఖ్యంగా రమణులకు రంగుల పట్ల మక్కువ ఎక్కువ. పిల్లలు ఎక్కువగా లేత రంగులను, పెద్దలు ముదురు రంగులను ఇష్టపడతారు.

"పసుపు" వన్నెను ఇష్టపడే వారికి జీవితంలో అనుకున్నది సాధించాలన్న పట్టుదల ఉంటుంది. వీరికి ఆవేశం తక్కువగా ఉంటుంది. ఐనప్పటికీ కృత నిశ్చయాన్ని, దృఢ చిత్తాన్ని కలిగి ఉంటారు.

"ముదురు నీలం" వన్నెను ఇష్ట పడే వారు భద్రతకై ఆరాటపడతారు.

"ఆకు పచ్చ, నీలం వర్ణాలు" ప్రియమైన వారికి జీవితం పట్ల ఎంతో భద్రతా భావం కలిగి ఉంటారు. వీరు బ్రతుకు పట్ల ఎంతో విశ్వాసము కలిగి ఉండి, స్థిమితంగా ఉంటారు కూడా.

ఆభరణాల ఎంపికలలో కూడా రంగుల పట్ల గల మక్కువ, అభిరుచులు తెలుస్తూంటాయి.

"నీలం రంగు" శాంతిని ప్రసాదిస్తుంది.




*** *** *** ************************************

పురాణ, ఇతిహాస గాధావళిని అనుసరించి, వానిలోని వర్ణ విశ్లేషణలను గమనించండి, ఎంతో ఆశ్చర్యం కలుగక మానదు. త్రిమూర్తులు, వారి భార్యల ఆహార్యము, నివాసముల ఎంపిక విభిన్న తరహాలలో గోచరిస్తాయి. "వీణా పాణి", "పుస్తక ధారిణి" ఐన శ్రీ సరస్వతీదేవి కువలయ నివాసిని, ఆమె తెల్లని కలువ పూవులో ఆశీనురాలై, సారస్వత జగత్తును అనుగ్రహిస్తున్నది.


*****

శ్రీ లక్ష్మీ దేవి పద్మాలయ, తామర పూవు ఆమె నివాసము. శ్రీ విష్ణుమూర్తి పీతాంబరధారి, పన్నగ శయనుడు, వైకుంఠ నివాసి.

పాపం! భోళా శంకరుడు, విభూది ప్రియుడు. ఐతే, దేవి సకల ఆభరణాలంకృత.


*** *** *** ***

స్త్రీలు సహజంగా అనేక రంగులని ఇష్టపడతారు. అందుకనే పేరంటాలకు, పెళ్ళిళ్ళకు, పండగలకూ పబ్బాలకూ వన్నె వన్నెల పట్టు చీరలు రెప రెపలాడుతూ నిండుదనాన్ని చేకూరుస్తాయి.

కనుదోయికి ఆహ్లాదాన్ని కలిగించే "బొమ్మల కొలువు" వంటి వేడుకలు, మహిళామణుల నిర్వహణలో శోభాయ మానంగా సందర్శకులను అలరిస్తూ ఉంటాయి.

వర్ణ సమ్మేళనాల ప్రభావం మీద పరిశోధనలు సరి కొత్త మలుపు తిరిగాయి. వైద్య రంగంలో ప్రయోగాలు దిశగా సాగుతున్నాయి. "బాబిట్" మొదలగు వారు ప్రకృతి వైద్యంలో విషయ పరిజ్ఞాన్ని ఉపయుక్త పరుస్తున్నాయి.


*** *** *** ***

బట్ట తల నివారణకై నీలి వర్ణోదకమును వాడి, అద్భుత ఫలితాలను పరిశోధకులు వెల్లడించారు. నీలం రంగు సీసాల్లో నీళ్ళు పోసి, సూర్యరశ్మిలో ఉంచాలి. అలాంటి నీలి వర్ణోదకమును రెడీ చేసుకోవాలి. బట్ట తలకు ఆలివ్ ఆయిలును పట్టించి తరువాత నీలి వర్ణోదకమును వెంట్రుకల కుదుళ్ళకు మర్దన చేస్తూ, వాడిన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని ప్రకటించారు.

ఇలాంటీ సిద్ధాంతాలను ఆధారము చేసుకుని ఇప్పుడు ఇంటి గోడలకు, గదులకు వైవిధ్యభరితముగా వివిధ వర్ణల సున్నాలను, డిస్టెంపరులనూ వాడుతున్నారు.

నవ వధువు చేతిలో గోరింటాకుకు, పెదవులలో తాంబూల రాగము, పాదములకు పారాణి సుందర మధు హాసాలాను చిందిస్తాయి. పెళ్ళిళ్ళలో రంగు రంగుల పూలను అలంకరిస్తారు. ఈనాడు గోరింటాకు, ఒక అద్భుతమైన కళగా "మెహిందీ ఆర్టు"గా కొత్త పుంతలు తొక్కుతూ, అభివృద్ధి గాంచుతున్నది.

ఇలాగ అడుగడుగునా నిత్య జీవితంలో రంగుల సొగసులు ప్రధాన నేస్తాలుగా మారి, మానవుని మనస్తత్వానికి అద్దం పడుతూ, అందరినీ పలకరిస్తూ, మానసికోల్లాసాన్ని కలుగజేస్తున్నాయి,

Monday, June 29, 2009

ద్వారకా తిరుమల !

అఖిలవనిత: ద్వారకా తిరుమల !

ద్వారకా తిరుమల !










Kovela ;


ద్వారకా తిరుమల

=============
By
kadambari piduri ;



ఇది ద్వారకా తిరుమల

భువి వెలసిన నాకము !

పుణ్యములకు ద్వారము //



భావముల ముడుపులు

మనసు స్వర్ణ వలిపెము

ఉడుపులలో వేసిన

"ముడి"భక్తి కలికి తురాయి //



వసుధ చివురు టాకులో

ఉజ్జ్వల నీహారిక

త్రుళ్ళు బిందు తుషారము

సొంపైన ఆణి ముత్యము //



సీతమ్మ వారి దోసిట

దాచిన చూడా మణి!

కృష్ణ కౌస్తుభ ద్యుతి

పుణికి పుచ్చు కున్నది

పుడమి ఈ కోవెలను //



******************************************

Wednesday, June 24, 2009

ఎన్నెన్నో పిట్టలు!


~1)మామిడి కొమ్మల కోయిలమ్మ
కమ్మ కమ్మని పాట లెన్నెన్నొ పాడేను
సంపెంగ గుత్తులలో వయ్యారి నెమలి
హొయలు లొలుకుచు సొగసు నాట్యాలు ఆడేను
2)చేమంతి, మందార,పారిజాతాలలో
'సీత కోక చిలకమ్మలు!
3)జామ చెట్లల్లోన
రామ చిలకల్లు ,
బాదాము తరువులలో
ఉడుత పిల్లల్లు
ధాన్యాల కంకులపై
కిచ కిచల పిచ్చుకలు
క్షేత్రాల మడుగులలొ
కొంగల జపములు
4)మైనాలు, గోర్వంక , పాలపిట్టలు
గిజిగాడి గూడులు అందాల నేతలు!
బాతుల హొయలు
హంసలకు గురువులు!
~5)నెహ్రూ చాచాకు ప్రీతి
"శాంతి పావురములు"
పిట్టల్ని తిలకించి,
కట్టారు బాలలు
"గుజ్జన గూడులు":
చేసారు అందరూ
కేరింత నాట్యాలు.
ఆబాల గోపాలమున ఇంత సందడిని
వీక్షించ "కృష్ణుడు" ఈ భువి నవతరించేను!

(By kadambari piduri )

Monday, June 22, 2009

వేళ్ళతో బొమ్మలు





మూడు అంశముల సమాహారము ;
మువ్వన్నెల మెరయు హారము
చదువరులకు కూర్మి చంద్ర హారము !
~1) నచ్చిన సేకరణలు ఇవి.
******************************************************
~౨)
Baala
వెన్నెలకు శీతలత్వము
By kadambari piduri,

చిన్ని చిన్ని
పావురాయిసాగి పోవు
నీలి నింగిలోన
తన రెక్కలను
బార సాచి
అలా....అలా...అలా... //
తెల్ల రంగు పుణికి పుచ్చుకొని,
ఠీవిగ పయనించును
తెలుపంటే అర్ధమేమి?
మన జెండాలో అది ఉన్నది!
తెలుపంటే రంగులకు
ఆది గురువు కాదా మరి?!
సప్త వర్ణ ఇంద్ర ధనుసునకు
ధర్మ దాత శ్వేత కిరణం //
శాంతి విలువ నెరిగినది
"శాంతం తన నగ"అన్నది
చల్ల దనము(ను)వెన్నెలలకు
నేర్పుటకై ,ఎగురుచూ సాగినది
అలా...అలా...అలాగ...
గువ్వ పిట్ట,పావురాయి //
(ఒక బాల గీతిక )
*******************************************
~౩)


Kovela
కళలకు కాణాచి
By kadambari piduri,
కృష్ణం!కృష్ణం!!!వేణు విలోలం!
మదన మోహన,
నంద నందనం
గోవర్ధన గిరి ధారీ!
వన మాలీ! //కృష్ణం//
(అను పల్లవి);;;;;;;
'''''''''''''''''''''''''''''''''''
2)నిన్నే తలచీ తలచీ
పాటలు పాడాలీ !
భజనలు చేయాలీ!! //కృష్ణం//
3)చిటికెల తాళం
చిడతల తాళంచిందులలోనే
నాట్యాలుఅహో!
చిందులు నాట్య నివాసాలు //నిన్నే //
4)కోలాటాల లయల హొయలులు
చిటి చిటి సవ్వడి లాయెను
"నాట్య నివాసాలు"
అహో! సవ్వడి నాట్య నివాసాలు //నిన్నే//
********************************************


Thursday, June 18, 2009

కబీరు సుభాషితాలు ( పార్టు ౨ )

కబీరు సుభాషితాలు ;;;;;;;(పార్టు ౨)

============

కబీరు తన జీవితమునే ప్రతిఫలింప జేస్తూ,

ఉటంకించిన అనేక "సుభాషితము"లు

ఆ కాంతి రత్నములు ఇవిగో!

1)"మాయ జిలుగు జరీల ;లౌకిక ,వస్త్రములను, కట్టినాను.

2)"తుహిన, కణము ,దాహమును ,తీర్చునా?

3)"వంగిన వాడు,నీరు త్రాగును;నిక్కిన వానికి ,దప్పిక తీరదు."

4)"'మాయ 'అనునది ,బహు మాయల మారి;

అది , వన ,జంగమ,సాధువులనూ ,కట్టి వేసినది;

పూజా స్వాములను ఆక్రమించినది;

అర్ధ విచార పడియలను , లో బరచుకున్నది.

అందరినీ త్రాడుతో కట్టి , వేసినది."

5)"పర మాత్మను చేరుట కష్టము.;భాగ్య వశాత్తూ చేర గలిగి నప్పుడు విడి పోవలదు.

అట్లు భగవంతునితో వేరు అయినప్పుడు,

శిరసున అదృష్ట మణిని కలిగి ఉన్నవారు మాత్రమే,,

తిరిగి ఆ భగవానుని చేర గలరు."

6)కబీరు దాసు తన అన్వేషణా యాత్రను గురించి ,

వ్యక్తీకరించిన పద్యాలు అమూల్య చారిత్రక నిధులు.

"కృత యుగమున "పావు కోళ్ళు"వేసుకునాను.

త్రేతా యుగమున "పతాక"ను పట్టుకుని నిలిచాను.

ద్వాపర యుగమున నడిమిని నడిచే (కడలి)బిందువును ఐనాను.

కలి యుగమున ఖండ ఖండాంతరములను తిరిగాను.
***********************************************
ఈ యాత్రావ్వేషణలో , వివిధ అనుభవాలను రుచి చూసాడు కబీరు దాసు.

శ్రీ కృష్ణ భక్తురాలైన 'సతీ సక్కు బాయి 'గృహమునకు సాధు బిక్షకై వెళ్ళాడు కబీరు.

ఆమె అత్త పరమ గయ్యాళి.

కోడలైన సక్కు బాయిని విపరీతముగా వేధిస్తూ ,ఆరళ్ళు పెట్టేది.

అపుడు తటస్థ పడిన కబీరు కూడా ఆ అత్త గారి తిట్లూ,దూషణలకు , గురి , కాక ,తప్ప లేదు.

బహుశా అలాంటి సందర్భములలో ద్యోతకమైన భావాలు

ఆయన "వచనము 'లలో అగుపిస్తాయి.


" సప్త సముద్రాలనూ తిరిగి "జంబూ ద్వీపము"(=భారత దేశము)ను చేరాను.

పర నిందను చేయని వారు అరుదుగా కన పడ్డారు."

ఇవి నేటికీ అక్షర సత్యములే కదా!

2)"సాధువుల జాతిని అడగ వద్దు.

వారి జ్ఞానమును గూర్చి మాత్రమే యోచించు.

మనకు కావలసినది ,లోపల ఉన్న కత్తికి ఎంత పదును ఉన్నది? అనేకానీ,

దాని పైన ఉన్న 'ఒర ' ఎలా ఉన్నదీ ! ,అని కాదు ,కదా!"

ఈ భావముతో ఉన్న ఈ "దోహా"ను తిలకించండి.

"జాతి న పూఛే కీ :

పూఛిలీ జయే జ్ఞాన్ ;

మోల్ కరోతర్ వార్ కా ;

పడా రహన్ దో మ్యాస్."

కబీరు వంటి సాధువులు,

లోకమున శాంతిని నెల కొల్పుటకై శ్రమించిన "మహాత్ములు".

జనులకు సదా ప్రేమను పరస్పర అను రాగమును ,

శాంత జీవనమును,మనో , తృప్తినీ , బోధిస్తూనే ఉన్నారు.

**************************************************

"అహం బ్రహ్మాస్మి."అనే ఉపనిషద్ వాక్కులలో సారము ఇదే!

కబీరు ఇలాగ అన్నాడు ,

"నేను ఉండినప్పుడు 'గురుడు 'కాన రా లేదు.

ఇప్పుడు 'గురుడు '(అనగా భగవానుడు)ఉన్నాడు.

నేను లేను.(దైవములో , లీనము , ఐనాను.)

ప్రేమ మార్గము ఎంతో ఇరుకైనది.

అందు రెండిటికీ , తావు , లేదు.(ఒక్కటి మాత్రమే అక్కడ నెల కొన గలదు.)"

అని కబీరు దాసు అన్నాడు.

నిజముగా ఇవి,"గులాబీ పూవుల గుబాళింపులే కదూ!

మరి కొన్ని చక్కెర పలుకులు చదవండి

"ఈ కబీరు తన కడుపులో , ప్రేమ 'అనే పాత్రనే అట్టి పెట్టు కున్నాడు.

ఆ ప్రేమ రోమ రోమమమున ఉద్భవిల్లుచూ తిరుగాడు చున్నది.

మరి అంత కన్ననూ తినుటకై మంచి పదార్ధము ఏమి దొరుకును!?!

"''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
యోగాభ్యాసములు,యోగాసనములు

కబీరుకు తెలుసుననేందుకు ఈ పద్యములు నిదర్శనములు.

"ఇడ" పడుగుగానూ ;

"పింగళ"ను పేక గానూ :

"సుషుమ్న"ను దారముగానూ స్వీకరించి , ఈ దుప్పటిని నేసాను."

పడుగు,పేకలు మున్నగు పదములు ,నేత వృత్తికి సంబంధించినవి.

ఆ నాటి సమాజములో "చేనేత "వృత్తి అత్యున్నత గౌరవమును పొందినది.

వాణిజ్య పరముగా మన చేనేత వస్త్రములు ,

ప్రపంచములోనే మన భారత దేశమును అగ్ర శిఖరములపై నిలిపినది.

కబీరు దాసు నుడివిన దోహాలు,పద్యములు ,

వృత్తుల విలువను తెలిపే వాడుక మాటలను మనకు అందించిన మేధావి.

సాధారణముగా "సమ కాలీనులు తమ సాటి వారి చేతలను మెచ్చుకోరు."

ఈ కోణములో చూస్తే, కబీరు దాసు నిజముగా అదృష్ట వంతుడే!

ఆతను తన సమ కాలీన సమాజములో మన్ననలను పొందిన 'భాగ్య శాలియే'!

కనుకనే ,"అభంగములు"రచించిన

ప్రసిద్ధ మరాఠీ కవి "భక్త తుకారాము" ఇలాగ అన్నాడు కదా!,

"నాకు నలుగురు మిత్రులు లభించినారు.

వారే జ్ఞాన దేవ్,నామ దేవ్,ఏక నాధ్,కబీర్‌లు."

****************************************************
(1జూన్ ౨౦౦౯ న

కబీరు దాసు (పార్టు ౧)

Wednesday, June 17, 2009

తొండైమాను చక్రవర్తి ; "ఆనంద నిలయము"



మీకు ఆకాశరాజు ఎవరో తెలుసా ?శ్రీ వేంకటేశుని పత్ని "పద్మావతి"కి కన్న తండ్రి అయినట్టి ఆకాశ రాజు .
శ్రీ పద్మావతీ దేవికి చిన్నాయన అనగా ఆకాశ రాజుకు తమ్ముడైన రాజు "తొండై మానుడు".
ఇతడే తొండమాన్ చక్రవర్తి అనే పేరుతో కూడా అన్నమయ్య కృతులలో వినుతి కెక్కాడు
*************************************************

ద్వాపర యుగం తర్వాత కలియుగారంభం అవసాగినది.
మహా భారత యుద్ధం అనంతరం
"మానవ జాతి సమాజము పునర్నిర్మాణము" మరల కొనసాగినది.
విక్రమార్కుడు మున్నగు ప్రభువుల తర్వాత చంద్ర వంశములో జన్మించిన," సుధర్ముడు"
పూర్వ జన్మలో గొప్ప పుణ్యము చేసుకొనెను.
సుధర్మునికి ఆకాశ రాజు, తొండమానుడు అనే సుపుత్రులు ప్రభవించారు.
శ్రీ వేంకటేశునికి తన కుమార్తె పద్మావతీ దేవిని ఇచ్చి ,పెళ్ళి చేసిన పుణ్యచరితుడు
ఆకాశ రాజు.
పద్మావతీ పిన తండ్రి ఐన తొండైమానుడు చారిత్రక ప్రసిద్ధి కల వ్యక్తి.
శ్రీ తిరుమలేశునికి ఇతను "ఆనంద నిలయము"ను కట్టించెను.
"కపిల తీర్ధము"అనే పెద్ద చెరువును త్రవ్వించెను.
ఈ చెరువు జలములతోటే ఇదివరకు స్వామి వారికి అభిషేకములు నిర్వహించే వారు.
కపిల తీర్ధమే "తామర గుంట"గా ప్రసిద్ధి కెక్కెను.
తొండమానుడు శాతవాహనుల సైనిక దళాధిపతి. వీరాగ్రేసరుడు, గొప్ప విజేత.
ఈయనే నారాయణ వనమునకు పాలకుడు.
శైవ భక్తుడైన తొండైమాను చక్రవర్తి పరిపాలించిన సీమకు
"తోండ మండలము" అని పేరు కలిగెను.
ఈతని రాజధాని "కోట". తొండమానుని రాజధాని ఐన కోట శ్రీ కాళ హస్తికి 8కి.మీ. దూరములో ఉన్నది.
ఈ గ్రామమే ఇప్పుడు "తొండమనాడు"గా పేరు గాంచినది.
(టూరిస్టు డిపార్టుమెంటు ఈ సీమను కూడా అభివృద్ధి చేసి,
ప్రజలకు చారిత్రక అవగాహన కల్పించ వలసిన అక్కర ఉన్నది)

*************************************************************

చింతచెట్టు వింజామరగావెలసినవాడు అని ఏడుకొండలవాడినిఅభివర్ణిస్తారు.
కొండ కుంగినట్లుగా నిలచినదేవుడు (మలై కునియ నివు పెరుమాళ్‌)అనీ అంటారు.

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


శ్రీవేంకటేశ్వరుడు నిలిచినస్థానం తిరుమలకొండకు నాభి వలె ఉంటుంది.
చుట్టూ ఎత్తయిన కొండలు హరితపుష్పపురేకల వలె ఉంటాయి.
అర్చావతారంగా వెలసిన శ్రీవేంకటేశ్వరుడి విగ్రహంపై
తొలినాళ్ళలోసూర్యచంద్రులు ప్రకాశించేవారు.
వైష్ణవఆలయాలలో శ్రీవేంకటేశ్వరుడు తొలి ఏకధృవమూర్తి.
ఇతర దేవతలులేకుండా ప్రధాన దైవం మాత్రమేఉండడాన్ని" ఏకధృవమూర్తి అంటారు".

తిరుమలలో శ్రీవేంకటేశ్వరుడు వెలసినతర్వాతే
హిందూ శిల్ప, ఆగమ శాస్త్రాలురూపొందాయని అంటారు.
ఏకధృవమూర్తిగా వెలసినశ్రీవేంకటేశ్వరునికి తొలినాళ్ళలో ఆకాశమే పైకప్పు.
వైకుంఠం నుంచి శ్రీవేంకటేశ్వరుడు దివ్యవిమానంలో అవతరించారని
ఆ విమానం మానవులకుకన్పించదని
భక్తులకు కన్పించేవిధంగాతొండమానుడు విమానాన్ని నిర్మించాడని
పురాణాలు చెబుతున్నాయి.

గోపురాన్ని లేదా గర్భగృహంపై గల ఎత్తైన నిర్మాణాన్ని" విమానం" అంటారు.
తిరుమల గర్భ గృహంపైగల విమానాన్ని "ఆనందనిలయం " అంటారు.

అసలుసిసలైన మేలిమి బంగారపు రేకులతోధగధగలాడే
ఆనందనిలయం లక్ష్మీపతిభక్తులకు పరమానందం కలిగిస్తుంది.
పురావస్తు ప్రమాణాల ప్రకారం
క్రీ.శ. 12వశతాబ్ది ప్రాంతంలో ఆనందనిలయాన్ని నిర్మించారు.
విజయనగరరాజు వీరనరసింగదేవుడుతన ఎత్తు బంగారాన్ని ఆలయానికి ఇచ్చారు.

ఆబంగారంతో తొలిసారిగా ఆనందనిలయానికి పూత వేయించారు.
నరసింగదేవుడు 1262 వరకు రాజ్యపాలనచేశారు.
1251 నుంచి 1275 వరకు పరిపాలించినపాండ్యరాజు "జాతవర్మసుందరపాండ్యన్"
‌ విమానంపైబంగారు కలశాలను ఏర్పరచారు.

కుమార కంపనవడయార్‌కు సేనాని అయిన సాళువమంగిదేవుడు
1359లో మరోసారి బంగారు తాపడంచేయించారు.
2వ దేవరాయలు కొలువులోమంత్రి అయిన

మల్లన్న 1444 ప్రాంతంలోఆనందనిలయానికి మరమ్మతుచేయించారు.
9-9-1518న బహుధాన్యసంవత్సరంలో
త్రిసముద్రాధీశుడు శ్రీకృష్ణదేవరాయలువిమానాన్ని మెరుగుపరచి
బంగారు తాపడంచేయించారు.

కంచికి చెందిన కోటికన్యకాదానం తాతాచార్యులు 1630లో బంగారు పూతపూయించారు.
1908లో మహంత్‌ ప్రయాగదాస్‌బంగారు కలశాలను మరోసారి ఏర్పరచారు.
1958లోతిరుమల తిరుపతి దేవస్థానం ఆనందనిలయాన్నిపూర్తిగా పునర్నిర్మాణం చేసింది.
అప్పట్లో 12లక్షల రూపాయల విలువ చేసే 12వేలతులాల బంగారం వినియోగించి
18 లక్షల రూపాయలఖర్చుతో 5 ఏళ్ళలో నిర్మాణం పూర్తి చేశారు.
27 అడుగుల4 అంగుళాల భుజపు కొలత 37 అడుగుల 8 అంగుళాలఎత్తుగల చతురస్రాకారపు
"ఆనందనిలయానికి " 3అంతస్తులు.
మూల విగ్రహాన్ని దర్శించుకున్నప్పటికితనివి తీరని భక్తులు
ఆరాధనగా చూసే విమానవేంకటేశ్వరుడు ఆనందనిలయపు 2వఅంతస్తులో ఉంటారు.
*************************************************
తింత్రిణీ మూల సంభవుడు ,అనగా చింత చెట్టు వింజామరగా కలిగి ,
తరు మూలము నివాసముగా కల వాడు అని అర్ధము.

ఆషా మాషీ గా......



ఆషా మాషీ గా...... ==========
1)"ఇక్కడ స్పీడు బ్రేకర్లను వేసే అవసరం లేదు.తారు వేస్టు ఔతుంది."

"ఏం?ఎందుకనీ?"డాంబరును' సేవు' చేస్తూన్న

ఆ రోడ్డు కాంట్రాక్టరును ప్రశ్నించారు,తక్కిన వాళ్ళు.

"ఇటు వేపు చూసి చెప్పండీ!మీకు ఏమి కనపడ్తూంది?"

"మరే! ఉమెన్స్ కాలేజీ ఉన్నదండీ!!"

గొప్ప చిదంబర రహస్యము వాళకి అర్ధమై పోయింది,కాంట్రాక్టరు చెప్ప నక్కర లేకుండానే! &&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
2)"మా ఇంట్లో అందరూ స్టార్‌లే!!"

"ఎట్టెట్టా!!అది ఎట్లాగ?" దోస్తు విస్మయ చకిత ప్రశ్నార్ధకము అది.

"ఔనురా! మా తాత స్టేషను మా'స్టారు ':

మా నాన్నేమో స్కూలు మాస్టారు :

మా అమ్మ సంగీతం మాస్టారు :

మా చిన్నాయన ఉద్యోగం ఇన్ "కాదంబినీ త్రీ స్టారు 'హోటలులో!!"
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&


3)వడుగు,కాశీ యాత్ర వేడుకలతో పెళ్ళి వారింటి ముంగిట,

పందిట్లో సందడిగా ఉన్నది.

"పెళ్ళి కొడుకు కోసం 'పాంకోళ్ళూ 'తీసుకు రండి."

{పావు కోళ్ళు = చెక్క చెప్పులు ,వడుగు వేడుకలలో సాంప్రదాయము ప్రకారము వాడెదరు.

"జులపాల స్టూడెంటు వెంఠనే పరుగెత్తి,వెళ్ళి,తీసుకొచ్చాడు,కోడి పుంజునూ,టర్కీ కోడినీ!!!!
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
4)"పురోహితుణ్ణి అడిగారు,కొత్తగా కాలేజీలో జాయిను ఐన విద్యార్ధులు.

"పంతులు గారూ!మీ మంత్రాలను కాస్తంత గట్టిగా,స్పష్టంగా చదవండి.

ఈ కాసెట్టులో రికార్దు చేసుకుంటాము."

"మీకు ఇంత శ్రద్ధ,జిజ్ఞాసలు కలిగినందుకు,చాలా సంతోషం."

మన సంస్కృతి పట్ల గొప్ప ప్రేమను,ఆసక్తినీ వెలిబుచ్చుతూన్న వారిని చూసి,

ఆనందముతో,ఉబ్బి తబ్బిబ్బు ఔతూ అన్నాడు,పాపం!ఆ పిచ్చిబ్రాహ్మడు.

"మరే!మా లెక్చరర్లకు కొత్త నిక్‌నేములు పెట్టాలి;

మీ శ్లోకాలలో నుండి,సెలెక్టు చేసుకుందామని,

అనుకుంటూ ఉన్నాము,మాస్టారూ!"

బహుళ మేధావి కుర్రాడొకడు అసలు రహస్యమును బయట పెట్టాడు.


&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&




Tuesday, June 16, 2009

"జగదేక వీరుడు_ అతి లోక సుందరి "

పద వల్లరి-అల్లరి '''''''''''''
"జగదేక వీరుడు_ అతి లోక సుందరి "


ఈ సినిమా పేరులోనుండి మీరు ఎన్ని తెలుగు పదాలను కూర్చగలరు?
ప్రయత్నించి చూడండి !
అటు తర్వాత
ఈ కింద ఉన్నన్ని మాటలను మీరు సాధించ గలిగారో,లేదో
సరి చూసు కొనండి!
అన్నట్టు,బోనసుగా

"మ"; "ము" అనే అక్షరాలను కూడా
మీరు ఉపయోగించ వచ్చును లెండి!
******************************************

1)జగము;2)గజము;3)అతి;4)మతి;5)జతి;6)సుతి ;7)సుదతి;8)సుందరి;
9)కరి;10)"కరుడు"కట్టిన మనసులు 11)గతి ;12)సురుడు;13)మకరి;
14)ముంజ;15)మగ;16)మదము;17)మరుడు:::18)లోకము;
19)గడుసు;ముందరి :20)మురుగ!(వాడుకలో ఉన్న తమిళ పదము)21)తిరి;
22)గరిమ;23)మగడు;24) అరి(=శత్రువు>"అరి వీర భయంకరుడు): 25)ముకము;
26)సుమము:కసురు(కసురుకొనుట) ;27)సుగమము('సుగమ మార్గము) ::::
28)అజము; 29)....లోమము(అనులోమ,విలోమములు):
30)దేవీ! ;31)కవీ!

***********************************************

"కులగోత్రాలు"(సినిమా పాట)





సరే!ఈ క్రింద ఉదాహరించిన గీతమును చదవండి ;
ఆనక విని ఆనందించండి.
"కులగోత్రాలు" సినిమాలోనిది ఈ పాట .
నాగేశ్వర్ రావు,కృష్ణ కుమారి లు నటించారు.
సినిమాలో వారి పేర్లు "రవి,సరోజ"లు.
కిరణాలలోనేగా సరోజం కిలకిల నవ్వేదీ...."
వెండి తెరపైన సుందరమైన దృశ్యీకరణ.

*********************************************

పల్లవి ;;;;

చెలికాడు నిన్నే రమ్మని
పిలువాచేరరావేలా
ఇంకా సిగ్గు నీకేలా //

~1)(ఆమె );;;;;;;;;;
ప్రియురాలి ఏముందో ,
తెలుపమంటావా
నన్నే తెలుపమంటావా / //చె లికాడు //

~౨) (అతడు );;;;;
నీ నవ్వులో ఏపువ్వులో
పన్నీరు చిలికాయీ
నీ నవ్వులో ఏపువ్వులో
పన్నీరు చిలికాయీ
(ఆమె ) ;;;;;;
కిరణాలలోనేగా సరోజం
కిలకిల నవ్వేదీ
ఆహాహా ...అహా ఒహోహో ....
అహహా ఒహో ......అ //ఆచెలికాడు //

~3) (అతడు) ;;;;;;
నీ అందమే శ్రీగంధమై
నా డెంద మలరించె !!
నీ రూపె దీపమ్మై
ప్రియా! నా చూపుల వెలిగించే!
అహహా ... అహా ఒహోహో .....:
అహహా ఒహో.......అ ఆ ...//చెలికాడు //
4)నీతోడుగా నడయాడగా
ఇంకేమి కావాలీ? !
మధురానురాగాలే
ఫలించే తరుణం రావాలీ!
అహహా...అహా ఒహోహో....హహా
ఒహో...అ ఆ . . //చెలికాడు//

********************************************

Monday, June 1, 2009

కబీరు దాసు సూక్తి రత్నావళి

"తారక మంత్రము కోరిన దొరికెను :ధన్యుడ నైతిని ఓరన్నా!"అనే ప్రజలకు చిర పరిచితమై,జన రంజకమైన ఈ పాట(ధన్యాసి రాగము)రామ దాసు విరచితము.ఈ తారక మంత్ర ఉపదేశమును పొందగనే,కంచర్ల గోపన్న
శ్రీ రామ చంద్రుని భక్తాగ్రేసరునిగా మారి,"శ్రీ రామ దాసు"గా
ఆచంద్ర తారార్కము చిర కీర్తినార్జించాడు.ఎన్నో ఇడుముల పాలైనప్పటికీ, భద్రాచలముపైన "శ్రీ రాముల వారి"దేవళమును నిర్మించగలిగిన ధన్య జీవి ఐనాడు.ఇంత గొప్ప చారిత్రక సంఘటనకు ఇరవైనది ఆ గురు శిష్యుల సంగమమే!ఆ శిష్యుడు 'రామ దాసు'ఐతే, ఆ గురువు"భక్త కబీరు దాసు".
నేత పని వృత్తిగా గల దంపతులకు అనాధ బిడ్డ దొరకగా,"కబీరు"అని పేరు
పెట్టుకుని,ప్రేమతో పెంచుకున్నారు.
"కబీరా చే మాగీం ; మూల ఉర విలే కుంభారాచే." "కబీరు చేత శ్రీ పాండు రంగ విఠలుడు,నేతను నేయించెను;కుమ్మరి వాని పిల్ల వాణ్ణి బతికించెను,"అన్నాడు కబీరు దాసు.;;;;;"పాండు రంగడు వెలసిన(మహారాష్ట్రలోని )పండరి పురము ఎందరో భక్త శిఖామణులను అక్కున చేర్చుకుని,భక్తి సాహిత్యము శాఖోప శాఖలుగా విస్తరిల్లిన పుణ్య క్షేత్రముపరమ భక్తాగ్ర గణ్యుడైన కబీరు మాట్లాడిన మాటలు సుధా సమములై,భక్తి సరస్సునందు తొణికిసలాడినవి.;;;"మాలా ఫేరత్్ జుగ్్ భయా ;ఫిరానమన్'కా ఫేర్;; కర్్ కా మన్్ కా డరేరికే!""ఎన్గాఏళ్ళుగా, యుగములుగా (ఫేర్)మాలను ధరించి,తిప్పుతున్నా,ప్రయోజనం లేదు,చేతిలోని తావళమును వదిలి వేసి,మనస్సునే మాలగా ఒనర్చిసాధన చేస్తే పరమాత్మునికి చేరువ ఔతావు.";;;
కొన్ని కబీరు నుడువులు "ఔరా!"అనిపిస్తాయి.(1)హృదయమునందు విశ్వాసము వలె; మెలకువలోనూ,నిద్దురలోనూ అతడే కలడుఏ వ్యక్తి ఆ స్వామిని తలచు చుండునో,వాని వద్దనే,ఆ స్వామి ఉండును."(2):ఖర్జూరం్ చెట్టు వలే,పొడవుగా పెరిగిన ఫలమేమున్నది?,బాటసారులకు నీడను ఈయదు,ఫలములు అందవు."(3)వాడు ఒకటి తిట్టును,బదులు తిట్టకు.ఆ తిట్టు ఒక్కటే మిగులును."ఇలాగేదోహా>>>"ఆవత్్ గారీ ఏక్్ హై;ఉల్టత్్ హోయ్్ అనేక్;; కహ కబీర్్ నహీ,ఉలటియే వహ్్ ఏక్్ కీ ఏక్."ఎవరైనా ఒక దెబ్బ కొడితే,నీవు సహింపకున్నచో,ఆ దెబ్బ అనేక దెబ్బలకు దారి తీయును.సహించి మిన్నకున్నచో,ఆ దెబ్బ ఒకటిగానే మిగిలి పోవును,పగ,ప్రతీకారములు అంతటితో సమసి పోవును..
సూక్తి>>>

(4)గ్రాసము లేని కొలువు.ఇంగిత జ్ఞానము లేని తనువు.(5')హృదయము'అనే త్రాసు నందు,'మంచితనము'ను తుల తూచుము.(6)నీటిని కోసినచో రెండుగా చీలదు.(7)చెత్తలో రత్నము ఉనది;కసువులో ముత్యము ఉన్నది,ఏరుకొనుము,మిత్రమా!(8)త్రవ్వుట చేత భూమీ,నరుకుట చేత చెట్లూ,దెబ్బల వలన ఇనుమూ,అట్లే ఇతరులు వేసిన నిందలూ,కువచనముల్లు,సాధువును 'ఓరిమి'కి ప్రతిరూపములుగా నిలుపుచూ,లోకమునకు ఉపకారమునే కలిగించుచునే ఉన్నవి.
నిష్కారణముగా పరులను దూషించుటయే వ్యాపకముగా చేసుకున వారి గురించి కబీరు తెలిపెను.(1)మామిడి కొమ్మలలోని కోయిల తీయనైన రాగముతో "కుహు!కుహూ!అన్నది.తటాకములోను,చెరువులలోను కప్పలు బెక బెకమన్నవి.కోకిల తన కూతను ఆపినది,అంతే!మండూకములు'గెలుపు తమదే!'అని తలచినవి.(2)అంధుని ఎదుట నాట్యము,చెవిటి వాని వద్ద శంఖారావము,వృధా!"అంటూ కబీరు దుర్జనుల ఎదుట సాధువుల ప్రవచనముల స్థితి కూడా అంతే!(3)కడలికి తరంగాలు,మనసుకు పరుగులూ సహజము.;;;;;సాధువుల వోలె,భక్తులకు మల్లే నటించే మిధ్యా తవాన్ని గూర్చివాక్కులు ఇవి,(1)జపమాల త్రిప్పినంత నే సాధువుఅగునా?అలాగైతే బావిపైని గిలక,సున్నము గాడిలోని గానుగలు
కూడా సాధువులే!(2)"సద్గురు సవాన్్ కో సగా ;సోధి సయీ న దాతి ;హరి జన్" సయీ న జాత్."{ఈ దోహా లోని"హరి జన"అనే పదమే మహాత్మా గాంధీజీకి స్ఫూర్తి దాయకము.} సద్గురువుతో సమానమైన ఆత్మ బంధువు,తత్వ శోధకుని మించిన దాత,శ్రీ హరిని మించిన హితుడు,హరి భక్తులను మించిన'జాతి వారు' లేరు.
(3)కస్తూరి మృగము తన నుండి వచ్చే సువాసనలను తెలుసుకో లేక,కాననములోని పచ్చికలో అన్వేషిస్తూ,పరుగులు తీస్తూ ఉంటున్నది;పూవులోని పరిమళము వలే,తనలోనే ఇమిడి ఉన్న దైవమును జమనిషి కనుగొనలేడు.దోహా>>"తేరా సాయీ తుఝ్్ మే; జ్యో ప్యుహపన్్ బాన్; కస్తూరి కా'మిరగ్'జ్యో;;ఫిరి ఫిరి ఢూంఢే ఘాస్." ఇట్టి అనేక సూక్తులు,కబీరు దాసు మనకు అందించిన మణి మాణిక్యములే!