Monday, June 22, 2009

వేళ్ళతో బొమ్మలు





మూడు అంశముల సమాహారము ;
మువ్వన్నెల మెరయు హారము
చదువరులకు కూర్మి చంద్ర హారము !
~1) నచ్చిన సేకరణలు ఇవి.
******************************************************
~౨)
Baala
వెన్నెలకు శీతలత్వము
By kadambari piduri,

చిన్ని చిన్ని
పావురాయిసాగి పోవు
నీలి నింగిలోన
తన రెక్కలను
బార సాచి
అలా....అలా...అలా... //
తెల్ల రంగు పుణికి పుచ్చుకొని,
ఠీవిగ పయనించును
తెలుపంటే అర్ధమేమి?
మన జెండాలో అది ఉన్నది!
తెలుపంటే రంగులకు
ఆది గురువు కాదా మరి?!
సప్త వర్ణ ఇంద్ర ధనుసునకు
ధర్మ దాత శ్వేత కిరణం //
శాంతి విలువ నెరిగినది
"శాంతం తన నగ"అన్నది
చల్ల దనము(ను)వెన్నెలలకు
నేర్పుటకై ,ఎగురుచూ సాగినది
అలా...అలా...అలాగ...
గువ్వ పిట్ట,పావురాయి //
(ఒక బాల గీతిక )
*******************************************
~౩)


Kovela
కళలకు కాణాచి
By kadambari piduri,
కృష్ణం!కృష్ణం!!!వేణు విలోలం!
మదన మోహన,
నంద నందనం
గోవర్ధన గిరి ధారీ!
వన మాలీ! //కృష్ణం//
(అను పల్లవి);;;;;;;
'''''''''''''''''''''''''''''''''''
2)నిన్నే తలచీ తలచీ
పాటలు పాడాలీ !
భజనలు చేయాలీ!! //కృష్ణం//
3)చిటికెల తాళం
చిడతల తాళంచిందులలోనే
నాట్యాలుఅహో!
చిందులు నాట్య నివాసాలు //నిన్నే //
4)కోలాటాల లయల హొయలులు
చిటి చిటి సవ్వడి లాయెను
"నాట్య నివాసాలు"
అహో! సవ్వడి నాట్య నివాసాలు //నిన్నే//
********************************************


No comments:

Post a Comment