Tuesday, March 31, 2009

చంద్ర హాస (1965)

నాకు నచ్చిన పాట :::::: 
'''''''''''''' 

1)ఓ వీణ చెలీ! నా ప్రియ సఖీ!  
ఈ ఒంటరి తనము ఏలనో?!
నా చక్కని రాజెట దాగెనో? //  

2)మలయ మారుతము మంటలు రేపె  
మల్లెలు,మొల్లలు ముళ్ళై కలచె  
చిలక పలికితే చికాకు కలిగె!
హృదయము తొందర-పడ సాగె //  

3)కన్నుల కదలెను ఆతని రూపు
మనసున మెరిసెను ఆతని వలపు
అంతట వినపడె ఆతని పిలుపే!
మరువను , ఎన్నడు ఆ తలపు //  
;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

చంద్రహాస"(1965 లో విడుదల) అనే చలన చిత్రములోనిది ఈ మధుర గీతము.
కృష్ణకుమారి వీణ వాయిస్తూ పాడింది.దాశరధి రచన. 
సాహిత్యం కన్న మిన్నగా ఎస్.హనుమంత రావు సంగీత రచనమే
ఈ పాటను మళ్ళీ మననం చేసుకునేలాగా చేసిందనే ఒప్పుకోవాలి.
చంద్ర హాస"దర్శకుడు బి.ఎస్‌రంగా. హరనాధ్ హీరో.

;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;;

ఇదే పేరుతో 1941లో వచ్చిన సినిమా దర్శకుడు ఎం.ఎల్.రంగయ్య.
పాత "చంద్రహాస"లో రావు బాల సరస్వతి,
టంగుటూరి సూర్యకుమారి మున్నగు వారు పాల్గొన్నారు.
 

''''''''

No comments:

Post a Comment