Tuesday, March 10, 2009

ఆణి ముత్యము

ఆణి ముత్యము
;;;;;;;;;;;;;;;
(పల్లె పిల్ల పాట)


1)సత్తెంగా ఆ ముత్తెం
మత్తెక్కించేను నిత్యం 
కోర సూపు సూసేను   
కోటి తూపు లిసిరేను  
"కోలు!కోలు! కోలంటూను
 కోలాటం ఆడేను //  


2)ఒయ్యారాలు బోయేను  
సయ్యాటలు ఆడేను 
 
"పట్టు,పట్టు పట్టంటూ"ను  
దొంగాటలు ఆడేను! // 

3)ఎఱ్ఱ బొట్టు దిద్దేను
గడప ముగ్గు దిద్దేను
 
రార!రార! "అంటూను      పూల దారి పరచేను //  


'''''''''''''''''''''''''''''

No comments:

Post a Comment