Wednesday, November 7, 2018

చమత్కార చదరంగం

ఆట కదరా కృష్ణా! ఇది ఆట కదరా కృష్ణా!  
ఆడుచున్నది గోపి - చదరంగమాట ;
మాట మాట కు - మాటి మాటికి ;  
చతురులే ఆడుతూ, చతురతలు మెరయగా ; ||

1) "బంటును జరపర శౌరీ!"
     అన్నది రాధిక, వీనుల విందుగ ;
;
2) "నీదు బంటును నేనే కాదా!
      జరుగుచుంటి"ననె శ్రీ గిరిధారి.
;
3) "గజమును జరపితినిప్పుడు నేను!
      కానిమ్ము క్రీడను, కువలయదమనా!"
;
"గజ గామిని! సొగసు నడకలను ;
చూసిన ఏనుగు అడుగు ముందుకు ;
వేయగ నేర్వదు - అంకుశమ్ములు -
నీ ఓర చూపులు చేయును అదుపు"

4) "ఒంటె కదిలినది ఐ మూలకును."
ముని పంటను నొక్కిన నవ్వుల పంట ; 
;
"ఒంటిగ నా ఒంటె - నడవ నేర్వదు."
తుంటరి కృష్ణుని జవాబులె తంటా ;
;
5) "తురగ వల్గనము అదుపు లేదు నియంత్రణ ; 
అతివ ఎత్తులకు చిత్తు నేనిక,
నీదు చిత్తము! నాదు భాగ్యము!
చిత్తం, చిత్తం!" 
చిలిపి వాక్కులవి చిద్విలాసునివి ; 

6) "చిత్తమును కుదురుగా నిలిపి, కృష్ణుడా! 
మంత్రిని ఐనా ముందుకు కదుపుము."
;
7) "కరణేషు మంత్రీ! - నిన్ను కని ఈ వేళ
దాగుకొనిరి ఇట అమాంతమ్ముగా అమాత్యవర్యులు ;
;
గోముగ గోపిక పలుకుల తళుకులు ;
గోవిందుని వాక్కులు రత్నప్రభలు ;
;
జగడములు అనిపిస్తు - ఉభయుల వాదములు ; 
ఆ జంట ఊసులు -  ఎల్ల జగములకు శ్రీరామ రక్ష ;
;
Chess game Krishna Gopika 

No comments:

Post a Comment