Sunday, October 29, 2017

శీతవెన్నెలను జమ చేసినది రాధమ్మ

తళ తళ లాడే పింఛములు ; పింఛాలెన్నో : 
జమ చేసినది మా రాధమ్మ ; వన మయూరితో : ||
;
ధగ ధగ శీతల చంద్రికలతోటి - మేలమాడుతూ : 
శీతవెన్నెలను తన కన్నుల భరిణల ; 
జమ చేసినది మా రాధమ్మ
అతి నిపుణతతో  - 
జమ చేసినది మా రాధమ్మ ; ||
;
మిల మిల జాబిలి నొడిసి పట్టుకుని ; 
తన దోసిలిలో పదిల పరచినది నీ కోసం ;
;
'ఇదిగో, క్రిష్ణా! వెన్న ముద్ద ' అని 
నీకు చూపుతూ, పిలుస్తున్నది కద, 
భలే కదా - తన నైపుణ్యాలు ; 
చూడవోయి ఇటు, నవనీత చోరుడా! ; || 
;

అంతు పొంతు లేని నీలుగు

అనీ అననట్లు - అన్నామా - 
వానికి అంతెరుగని నీలుగు ;
నీలుగుడు చాలంటే ; 
కస్సుమనును అది ఏమో!?
చెరుకు వింటి ఐదు పూలు : ||
;
అంతు పొంతు లేకున్నవి, ఐదు పూల ముచ్చటలు - 
గాలి పొడుగునా అంతు పొంతు లేకుండా అవేమిటి ముచ్చట్లు 1? - 
అన్నామా మేమంతా!? అనీ అనని విధాన ; అన్నామా మేమంతా!?
అంతెరుగని నీలుగు, వానికి ; అంతెరుగని నీలుగు ;;  ||
;
అనీ అననట్లు - అన్నానూ వానికి ; అంతెరుగని నీలుగు ;
నీలుగుడు చాలంటే ; కస్సుమనును అది ఏమో!? : ||
తక్కువేమి తినలేదు లెండి ; మేమున్నూ తక్కువేమి తినలేదు ;
ఆ ఊసులు ఏమిటో తెలుసుకొన్నాము లెండి ;
 - గాలిని బులిపిస్తూ, బుజ్జగిస్తు ; తెలుసుకొన్నాము లెండి
చిరుగాలి, చిలిపి గాలి, మా చెవిలో ఊదింది ఆ గుట్టు లోగుట్టు ;  ||
;
క్రిష్ణ లీల, రాసక్రీడ ; ప్రణయ వృత్తాంత గాధ ; 
పొద్దు కూడ తెలియకుండ ; చెప్పుకొనును తాము ;
తమలోన తాము ; మన్మధుని వ్రేళ్ళు మీటు - 
ఇక్షు ధనువు నారి నుండి వెలువడే పువ్వులవి ;
పంచ బాణ పుష్పములు ; ఆ కౌతుక, ఉత్సాహము ; 
సహజమైనదే వానికి ; ఔను కదా ముమ్మాటికి ; 
;
ఈ కబురులాటకు మేమూ - జత ఔతాము లెండి, 
ముదముతో పువులారా! ఒప్పుకుంటున్నారు కదా!  
ఔను కదా,సబబు కదా ; ఇది సదా, 
ఔనౌను కదా, సదా సదా! ;  ||
;
-   రూపక గీతం ;- 
=============================;
;
anee ananaTlu - annaamaa  ;
amterugani neelugu ;
waaniki, amterugani neelugu ;
neeluguDu caalamTE ; 
kassumanunu adi EmO!?
ceruku wimTi aidu puulu : ||
amtu pomtu lEkunnawi ;
aidu puula muccaTalu - 
gaali poDugunaa amtu pomtu 

lEkumDA awEmiTi muccaTlu? -  
annaamaa mEmamtaa!? anee anani widhaana ;
amterugani neelugu ; 
waaniki amterugani neelugu ;
;
anee ananaTlu - annaamaa ;waaniki, amterugani neelugu ;
neeluguDu caalamTE ; kassumanunu adi EmO!?

takkuwEmi tinalEdu lemDi ; mEmunnuu takkuwEmi tinalEdu ;
aa uusulu EmiTO - telusukunnaamu lemDi ;
gaalini bulipistuu, bujjagistu ;  telusukunnaamu lemDi ;
cirugaali, cilipi gaali, maa cewilO uudimdi aa guTTu lOguTTu ; 
;
krishNa leela, raasakreeDa ; praNaya wRttaamta gaadha 

; poddu kUDa teliyakumDa ; ceppukonunu taamu ;
- tamalOna taamu ; 
manmadhuni wrELLu meeTu - 
ikshu dhanuwu naari numDi weluwaDE puwwulawi ;
pamca baaNa pushpamulu ; aa kautuka, utsaahamu ; 
sahajamainadE waaniki ; aunu kadaa mummATiki ; 
;
ee kaburulATaku mEmuu - jata autaamu lemDi, 
mudamutO puwulaarA! oppukumTunnaaru kadaa! 
aunu kadaa,sababu kadaa ; idi sadaa, 
aunaunu kadaa, sadaa sadaa! ;  || 
;
-  ruupaka geetam ; 
;

శ్రీకృష్ణ మాయ అంటేను ఇదే కదా

ఆటలు ఆడేరు, పాటలు పాడేరు ; 
భాండీరంలో తోటలన్నియు చైతన్యం  అయ్యేను ; 
చైతన్య మయములయ్యేను : 
;
క్రిష్ణ మాయ అంటేను - ఇదే కదా చూస్తుంటే :  
శ్రీక్రిష్ణ మాయ అంటేను - ఇదియె కదుటె, ఓయమ్మా! :  || 
;
చద్ది బువ్వ మూటలను కొమ్మలకు కట్టారు ; 
చేతి కర్రలను పట్టి ; నడుములకు తుండ్లు కట్టి ; 
గిల్లి దండ, ఉప్పాటలు ; కబడి ఆటలెన్నెన్నో 
ఆడేరు క్రిష్ణ బృందము ; శ్రీక్రిష్ణ బృందము :
||క్రిష్ణ మాయ అంటేను - ఇదే కదా చూస్తుంటే :  
శ్రీక్రిష్ణ మాయ అంటేను - ఇదియె కదుటె, ఓయమ్మా!||  
మట్టి, దుమ్ము ధూళి దూసరములగుతూ ఒళ్ళంతా ; 
ఆడేరు క్రిష్ణ బృందము ; శ్రీక్రిష్ణ బృందము ;
నేల తల్లి పులకించును ; ఈ బిడ్డల స్పర్శతోటి  ;
||క్రిష్ణ మాయ అంటేను - ఇదే కదా చూస్తుంటే :  
శ్రీక్రిష్ణ మాయ అంటేను - ఇదియె కదుటె, ఓయమ్మా!||  
;
క్రిష్ణ మాయ అంటేను - అందమైన కదలిక ;
శ్రీక్రిష్ణ మాయ అంటేను - కదలికలకు కళ కళా ;
అందులకే క్రిష్ణ మాయ - అందరికీ ఆకర్షణ ;
అందుకునే సామర్ధ్యం స్వామి భక్తులందరిదీ ;
ఆ ఆదర్శం అనుసరణ ; విజయపథం దిశ నడక :
||క్రిష్ణ మాయ అంటేను - ఇదే కదా చూస్తుంటే :  
శ్రీక్రిష్ణ మాయ అంటేను - ఇదియె కదుటె, ఓయమ్మా!||   
;
===================================;
;
aaTalu ADEru ; paaTalu paaDEru ; 
bhaamDeeramlO tOTalanniyu caitanyam ayyEnu ; 
caitanyamayamulayyEnu ;    ||

;
krishNa maaya amTEnu - idE kadaa cuustumTE :  
SreekrishNa maaya amTEnu - 
idiye  kaduTe, Oyammaa! :  || 
;
caddi buwwa mUTalanu kommalaku kaTTAru ; 
cEti karralanu paTTi ; naDumulaku tumDlu kaTTi ; 
gilli damDa, uppATalu ; kabaDi ATalennennO ;
aaDEru krishNa bRmdam ; 
Sree krishNa bRmdamu ;
||krishNa maaya amTEnu - idE kadaa cuustumTE :  
SreekrishNa maaya amTEnu - idiye kaduTe, Oyammaa! || 
maTTi, dummu dhULi duusaramulagutuu oLLamtaa ; 
nEla talli pulakimcunu ; ee biDDala sparSatOTi ;  
krishNa maaya amTEnu - amdamaina kadalika ;
SreekrishNa maaya amTEnu - kadalikalaku kaLa kaLA ;
krishNa maaya amTEnu - amdamaina kadalika ;
శ్రీ SreekrishNa maaya amTEnu - kadalikalaku kaLa kaLA ;
amdulakE krishNa maaya - amdarikee aakarshaNa ;
amdukunE saamardhyam swaami bhaktulamdaridee ;
aa aadarSam anusaraNa ; wijayapatham diSa naDaka ;  
||krishNa maaya amTEnu - idE kadaa cuustumTE :  
SreekrishNa maaya amTEnu - idiye kaduTe, Oyammaa! ||  
;

అనుకుంటే ఒక మాట - అదే జపం పూట పూట

అనుకుంటే ఒక మాట ; 
అదే జపం పూట పూట ; 
క్రిష్ణ నామమే! శ్రీ క్రిష్ణ నామమే :  ||
;  
పలికినపుడు తేనె ఊట ;
పులకించిన మది చైత్ర తోట ;
క్రిష్ణ నామమే! శ్రీ క్రిష్ణ నామమే :  ||
;
ప్రతి ఊహ మదివీట ; పసిడి రజను ఎత్తు మేట ; 
జిహ్వకు పుణ్యాల పంట ; ఎన్నికైన నోము పంట ;
క్రిష్ణ నామమే! శ్రీ క్రిష్ణ నామమే :  ||   
;
పేర్మి క్రిష్ణుని పేరుకు ; సరి రాదు, రాలేదు ; 
ఆ స్వర్గ నేత మహేంద్రుని ; మధు చషకం - సుధల కొలత ;
క్రిష్ణ నామమే! శ్రీ క్రిష్ణ నామమే :  ||
;
=================================;
;
anukumTE oka maaTa ; adE japam pUTa pUTa ; 
krishNa naamamE! SrI krishNa naamamE :  ||
;
palikinapuDu tEne uuTa ; 
pulakimcina madi caitra tOTa ;
krishNa naamamE! SrI krishNa naamamE :  || 
;  
prati uuha madiweeTa ; pasiDi rajanu ettu mETa ; 
jihwaku puNyaala pamTa ; ennikaina nOmu pamTa ; 
krishNa naamamE! SrI krishNa naamamE :  ||
;
pErmi krishNuni pEruku ; sari raadu, raalEdu ; 
swarga cashaka mahEmdruni ; madhu cashakam sudhala kolata ; 
krishNa naamamE! SrI krishNa naamamE :  ||
;

సత్య భామామణి దీపావళి - 1

దీపావళి ; క్రిష్ణ దీపావళి ;
భామామణి వచ్చినది ;
సత్య భామామణి వచ్చినది ;  ||
;
కాకర పువ్వొత్తులు ;
రుక్మిణిది తొలి బోణీ ; ||
;
చిచ్చుబుడ్లు మీకన్నది ;
వెన్నముద్ద, పాము పొగలు నాగ్నజితీ!
నీ కొరకు, అంటూ ఇచ్చెను సత్య ;  ||
;
భూ చక్రం, అగరొత్తులు ;
 లక్ష్మణకు చాలన్నది ;
కాళిందీ తడబడకు,
తాటాకు అగ్గి, కాగడాలు -
- మేలంటూ, చాలన్నది ;  || 
;
విష్ణుచక్రములు నావి ;
అనెను క్రిష్ణ దేవేరి ;
పటాసుల పట పటలు ; నింగి నిండ ;
క్రిష్ణ ప్రేమ సాగర హేలయే సత్య గీర ;
;
వాలుజడను విసిరేస్తూ;
భామామణి వచ్చినది ;
సత్య భామామణి వచ్చినది ;  || =
=
] deepaawaLi, krishNa deepaawaLi ;
BAmaamaNi waccinadi ;
satya BAmaamaNi waccinadi ; ||
;
] kaakarapuwwottulu ;
rukmiNidi toli bONI ;
;
] ciccubuDlu meekannadi ;
paamu pogalu naagnajitii!
nee koraku ; amTU iccenu satya ; 
;
] bhuu cakram, agarottulu ;
lakshmaNaku caalannadi ;
kALimdii taDabaDaku,
taaTAku aggi, kAgaDAlu
 - mElamTU, caalannadi ; 
;
wihNucakramulu naawi ;
anenu krishNa dEwEri ;
paTaasula paTa paTalu ; nimgi nimDa ;
క్రిష్ణ prEma saagara hElayE satya geera ;
;
waalujaDanu wisirEstuu  ;
BAmaamaNi waccinadi ;
satya BAmaamaNi waccinadi ; ||

నౌకలోన వ్యాహ్యాళి

నౌకలోన వ్యాహ్యాళి,  క్రిష్ణ రాధ నిరాళి ; 
లహరి లహరి లాహిరి సయ్యాటలు ; ||
;
పడవ నడక తీరు ; 
సోయగముల జోరు;
వాహినికి హెచ్చినది 
వినూత్నమౌ  సౌరు ; || 
;
ఇన్ని నవ్య సొగసులను ;
అందుకొనెను నది వాహిని ;
అందుకు మా నీలి యమును -
అందుకొనుము జోహారు ; || 
=
* ] Virali means Priceless, Valuable, Rare, Precious.  ;;
]  Nirali means Unique and different ;
======================================;
;
krishNa raadha nirALi ; naukalOna wyaahyALi ;
lahari lahari laahirula sayyaaTalu ;  ||
;
paDawa naDakaku teeru ; 
sOyagamula jOru ; 
waahiniki heccinadi 
winuutnamau  sauru ; ||
;
inni nawya sogasulanu ;
amdukonenu nadi waahini ; 
amduku maa neeli yamuna ;
amdukonumu jOhaaru ; || 
;

నులి వెచ్చని పుప్పొడులు

మంచు మంచు - తెలి మంచు ; హేమంతం గడుగ్గాయి ;
మంచు మంచు - తెలి మంచు ; హేమంతం ఆకతాయి  :  || 
;
హిమం మయం ఇల సర్వం మంచు మయం ; 
హిమ ఋతువు దిగి వచ్చి - పుడమిని ప్రశ్నించింది ; 
;
"కుశలమా, క్షేమమా, ఏమంచు" అడుగుతూ -
తెగ ఆరా తీస్తుంటే - పృధ్వి తెల్ల బోయింది ;
మంచు తెరలలోన దాగి ; గాలి నవ్వుకున్నాది :  || 
;
ఘోష వలదు వసుంధరా! 
ఘోష వలదు ప్రకృతీ!;  ;
రాధ నవ్వు పువులు విరిసేను ;
నులి వెచ్చని పుప్పొడుల ;
వన్నెలెన్నొ పూసేను ;
నిశ్చింతగ ఉండమ్మా, ఓ ధరణీ! :  ||
;
=========================;
;
mancu mancu teli mamcu ; hEmatam gaDuggaayi ;
mancu mancu teli mamcu ; hEmatam aakataayi ;
;
himam mayam ila sarwam mancu mayam ;
hima Rtuwu digi wacci - puDamini praSnimcimdi ; 
;
"kuSalamaa, kshEmamaa, Emancu"
aDugutuu ,tega aaraa - teestumTE - pRdhwi tella bOyimdi;
mancu teralalOna daagi ; gaali nawwukunnaadi ; ||
;
GOsha waladu wasumdharA!
GOsha waladu prakRtI!;  ;
రాధ నవ్వుల పువులు - విరిsEnu ;
nuli weccani puppoDula ;
wannelenno puusEnu ;
niScimtaga umDammA, O dharaNI!! :  ||
;

తుహిన కణములు

సృష్టి యావత్తూ రాధమ్మకు సింగారమే ;
బంగారు బొమ్మ , మా రాధమ్మకు ;  ||
;
తుహిన కణములు తూలి ;
రాధ పాపిట వాలి, మణులె ఐనాయి ;  || 
;
రాణివాసము మోటు -
అనుకొంటు నవ్వినవి ;
ఆ మంచు బిందువులు  ;  || 
;
పూల పుప్పొడి తేలి ;  
రాధ నిశ్వాసముల - చేరి ;
అదనపు తావులే పొందినవి ;  ||
;
ప్రకృతియె రాధమ్మ ఐనప్పుడు ;
ఈ రీతి వాడుకకు ;
అచ్చెరువులెందులకు,
అది సహజమే కదా!   అతి సహజమే కదా! ;  || 
;
================================.
pATa  ;-
;
sRshTi yaawattuu raadhammaku simgaaramE ;
bamgaaru bomma ; maa raadhammaku ;  ||
;
tuhina kaNamulu tuuli ; maNule ainaayi ;
raadha pApiTa waali; maNule ainaayi ;  ||
;
puula puppoDi tEli ; taawu lainaayi ;
raadha niSwaasamula - taawu lainaayi ;  ||
;
waana mabbulu karigi ; dhaara saramulainaayi ;
raadha mEnuna - dhaara saramulainaayi ;  ||
;
prakRtiye raadhamma ainappuDu ;
ee reeti waaDukaku ;
acceruwulemdulaku,
adi sahajamE kadaa!  ||
;

కచ్ఛపీ నాదము లిటు దిగి వచ్చును

క్రిష్ణవంశి శిష్యరికం ; 
వాణి వీణ సంబరం ; 
సంగీత పరిధి అంబరం ;  || 
;
క్రిష్ణ మురళి గురువాయెను ;
కచ్ఛపీ వీణియకు సంబరము ; 
తంత్రి - నాద సమ్మోహనం ;  || 
;
వంశి వాదన చేసి చేసి ; 
చివురు వ్రేళ్ళు అలసెనేమొ ; 
క్రిష్ణ! నీదు చివురు వ్రేళ్ళు అలసెనేమొ ;
;  
నీ బడలిక ఉపశమింప ; 
నాదము లిటు దిగి వచ్చును ; 
శారదాంబ వీణియ 
సిరి - కచ్ఛపీ నాదము లిటు దిగి వచ్చును ;  ||    
================================;
;
  LINK :- 
తాత్సారం చేయకండి, వేళ ఆయెను ; 
గోవర్ధన గిరి పూజ వేళ ఆయెను ; || 
ఉగ్రసేన తాతలు ; అవ్వలు, ముత్తవ్వలు ; 
ముత్తాతలు గునగునా ముందు నడుస్తున్నారు ; 
యువత మీకు మగత ఇంత!?, 
వడి వడిగా ముందుకు నడవండి ; 
మునుముందుకు నడవండి ; || ; 
ఏడు తేజిల ..

సౌదామిని పుణికిన సరము రాధిక

భువన మోహనం క్రిష్ణ లాసము ;
భావ రాగము రాధా క్రిష్ణ యుగళము ;  || 
రాధిక వదనం కృష్ణుని సదనం ; 
శ్యామల మోహన కృష్ణుని సదనం ;
మృదు మధు మురళీ రాగ రంజితం ; ||
;
దామిని పుణికిన సరము రాధిక ;
సౌదామిని పుణికిన సరము రాధిక ;
పారము క్రిష్ణ ధ్యాన గగనార్ణవము ;  ||
;
భువన మోహనం క్రిష్ణ లాసము ;
భావ రాగము రాధా క్రిష్ణ యుగళము ;  || 
;
=======================;
;
bhaawa raaagamu ;
raadhaa krishNa yugaLamu ;  || 
;
raadhika  kRshNuni sadanam ;
Syaamala mOhana kRshNuni sadanam ;
mRdu madhu muraLI raaga ramjitam ; ||
;
daamini puNikina ; saramu raadhika ;
saudaamini puNikina saramu raadhika ;
paaramu krishNa dhyaana gaganaarNawamu ;  ||
;
bhuwana mOhanam ;
krishNa laasamu ;
bhaawa raaagamu ;
raadhaa krishNa yugaLamu ;  || 
;

కృష్ణునికి ఆచ్ఛాదనం

రేయికి చలి పుట్టె ;
చలి చలి ; వణికేను రాతిరి ;  ||
రాదిక విచ్చేసె భీతి వలదు ;
;
తన మేలిముసుగును
పరచి కప్పునులే ;
ఓ నిశీ! తన మేలిముసుగును
నీకు చుట్టేనులే ;  ||
;
'చలి చలి'  అంటూను కృష్ణుడు ;;
గడ గడా వణుకుతూంటేను ;
నటనల వణుకులు - చాలులే క్రిష్ణయ్య! ;
అని రమణీయముగ నవ్వె రమణీమణి ;  ||
;
భామామణి రాధిక లక్ష దరహాసాలు ;
నింగిలో విరిసిన - నక్షత్రమాలికలు ;
రాధ పరిష్వంగము ఆచ్ఛాదనం ;
క్రిష్ణునికి ఆచ్ఛాదనం ;  ||
;
==========================;
;
cali cali  ; amTUnu kRshNuDu ;;
gaDa gaDA waNukutuumTEnu ;
naTanala waNukulu -
caalulE krishNayya! ;
ani ramaNiiyamuga nawwe ramaNiimaNi  ;  ||
;
bhaamAmaNi raadhika nawwulu ;
nimgilO wirisina - nakshatramaalikalu ;
raadha parishwamgamu aacCaadanam ;
krishNuniki aacCaadanam ; ||
;

తుహిన కణములు

తుహిన కణములు తూలి ;
రాధ పాపిట వాలి, మణులె ఐనాయి ;  || 
;
రాణివాసము మోటు -
అనుకొంటు నవ్వినవి ;
ఆ మంచు బిందువులు  ;  || 
;
పూల పుప్పొడి తేలి ;  
రాధ నిశ్వాసముల - చేరి ;
అదనపు తావులే పొందినవి ;  ||