Wednesday, April 12, 2017

రాధామణి హైరానా

గోవింద మాధవునికి - స్వాగతాలు పలుకుదాము ; 
పదండి, ఆ నది కాళిందీ ఒడ్డు వైపు ; 
అని తొందరతో హైరానా పడుతున్నది పడతి రాధిక ;  || 
;
గిరిని మోసి అలిసినాడు గోవిందుడు ; 
గోవర్ధన గిరినెత్తి, కొన గోటను మోసి మోసి ; 
కడు బడలికతో డస్సినాడు 
మా ముకుంద మురళీధరుడు :  | | 
;
రేపల్లెను కాపాడెను ; 
అతను - లోక శ్రేయస్సుకు కవచము ;
అటూ ఇటూ పరుగులిడుతు ; 
పనులు బెత్తాయిస్తూ తిరుగును రాధామణి ;  ||
;
సన్నాయి మేళాలు, బాజా బజంత్రీలు , 
తాషామరప్పాలు - మిన్నంటే ఘోషలు ; 
శృతి సరిగా చూసుకొనండని ; 
పురమాయిస్తున్నది, 
విధులు పనులు అందరికీ , రమణి రాధిక ;  || 
;
వేణు గాన లోలుని సన్నిధిలోన ; 
వాద్యాలు, సంగీతం - 
లయ నెపుడూ తప్పవులే, 
తెలుసుకోవమ్మా, ఓ రాధమ్మా! || 

No comments:

Post a Comment