Showing posts with label finek. Show all posts
Showing posts with label finek. Show all posts

Wednesday, April 12, 2017

రాధామణి హైరానా

గోవింద మాధవునికి - స్వాగతాలు పలుకుదాము ; 
పదండి, ఆ నది కాళిందీ ఒడ్డు వైపు ; 
అని తొందరతో హైరానా పడుతున్నది పడతి రాధిక ;  || 
;
గిరిని మోసి అలిసినాడు గోవిందుడు ; 
గోవర్ధన గిరినెత్తి, కొన గోటను మోసి మోసి ; 
కడు బడలికతో డస్సినాడు 
మా ముకుంద మురళీధరుడు :  | | 
;
రేపల్లెను కాపాడెను ; 
అతను - లోక శ్రేయస్సుకు కవచము ;
అటూ ఇటూ పరుగులిడుతు ; 
పనులు బెత్తాయిస్తూ తిరుగును రాధామణి ;  ||
;
సన్నాయి మేళాలు, బాజా బజంత్రీలు , 
తాషామరప్పాలు - మిన్నంటే ఘోషలు ; 
శృతి సరిగా చూసుకొనండని ; 
పురమాయిస్తున్నది, 
విధులు పనులు అందరికీ , రమణి రాధిక ;  || 
;
వేణు గాన లోలుని సన్నిధిలోన ; 
వాద్యాలు, సంగీతం - 
లయ నెపుడూ తప్పవులే, 
తెలుసుకోవమ్మా, ఓ రాధమ్మా! || 

పాల చిందులకు సంగీతం

మధురానగరిలొ – 
నగరికి వెడలితి వనితామణులు ;
లలనల నడుముల పాలకుండలు ;  
పెరుగు, తక్రం, పాల చిందులు ; 
పాల తొణుకుల సవ్వడులన్నియు ; 
సరిగమ పదని – సప్త స్వరముల  
          సుభగత్వం వింతగ వింతలు ; 
            వంతులు వంతులు – భళీ భళీ! :  || 
;
క్షీరాంబుధిని కాపురముండి , 
వసుధకు విచ్చేసిన వాడు ; 
మునుపు విష్ణువు ఓయమ్మా! 
పాల కడలి వాసునికి ;
    పాలు అన్నచో ఎంతో ప్రీతి
        సహజమే  ఓయమ్మా! ;     ||   
;
పల్లె పడుచుల శిరసున మోసే –
దుత్తల పాలకు సంగీతమును నేర్పిస్తున్నది ; 
క్రిష్ణ మురళీ రవళి ; అందులకే కద ఓ యమ్మా! 
అది పూర్వ జన్మ స్నేహ బంధముల 
      కలబోతల  ఫలితం- తెలియగ, ఓ యమ్మా!  || 

అన్నానా, అనుకున్నానా !?

అన్నానా, అనుకున్నానా, 
రూపము లేని గాలికి - 
   చక్కని రాగ స్వరూపము 
         ఏర్పడుననుచూ ;  ||
;
తోపులొ ఎండిన పుల్ల దొరికెనట ; 
అది, మురళిగ ఆకృతి దాల్చెనట ;  
వెదురుకె అంతటి భాగ్యాలు ;
వేణుమాధవా! 
నీ పల్లవాంగుళుల -  పిల్లంగ్రోవిగ -
    నను చేయుదువనుకొన్నానా..... ;... ||
;
నీ పల్లవాంగుళుల పిల్లనగ్రోవిగ - 
నన్ను చేయుదువనుకొన్నానా, వేణు వినోదీ!
మరీ ఇంత కాపీనము నీకు ;
రాధిక పట్ల, భళి భళి, 
శీతకన్నును వేసినావులే!
;
పన్నగశయనా! మాయ నిద్దురను నటియిస్తావు ;
రాధ పట్టుదల నీవెరుగనిదా,
నీ వంశీ రాగము తానౌతుంది ;
తప్పదు, తప్పక - 
    ఇదియే ఎరుక!
       ఇది నీకెరుక!   ;  ||
;
;========================== =;
;
annaanaa, anukunnaanaa, 
ruupamu lEni gaaliki - 
cakkani raaga swaruupamu 
             ErpaDunanucuu ;  ||
;
tOpulo emDina pulla dorikenaTa ; 
adi, muraLiga aakRti daalcenaTa ;  ||  
;
weduruke amtaTi bhaagyaalu ;
wENumaadhawA! 
      nee pallawaamguLula
pillamgrOwiga - 
     nanu cEyuduwanukonnaanaa,
maree imta kaapiinamu niiku ;
raadhika paTla ; bhaLi bhaLi, 
SItakannu wEsinaawulE!
pannagaSayanA! 
       maaya nidduranu naTiyistaawu ;
raadha paTTudala neeweruganidaa,
nee wamSI raagamu taanautumdi ;
tappadu, tappaka - idiyE eruka!
idi neekeruka!   ;  ||
;