Tuesday, April 25, 2017

పాల సంద్రముకు సాటి

యమునా తీర సైకతము ; 
క్షీర సంద్రముకు సమము కదా ; ||
;
గోపీ వలయం ; రాసక్రీడల రమ్యం ; 
రమణీ మణుల చిత్ర విచిత్ర ఖేలనము ;
మణి హారం - యమునకు రమణీయం ; ||
;
నడుమను ఉన్నది ఎవరమ్మా!? ;;
ఆ నడుమను ఉన్నది ఎవరమ్మా!?
నీలి మరకతము తెగ మెరసేను ; !? ;
ఇంకెవరమ్మా, చెప్పు 
యశోద గారాల పట్టి ; 

పాము చుట్టల పవళింపు సేవల[ nu+am] ;
నందుకొనేటి మహరాజు ; నీరదశ్యాముడు ; 
నంద నందనుడు ; ముద్దుల క్రిష్ణుడు ; 
ఈయనె అమ్మా! జున్ను ప్రసాదము ఈయమ్మా! : ||

; ==================;

yamunaa teera saikatam ; 
ksheeraabdhiki samamu kadaa ;  ;
gOpee walayam ; raasakreeDala ramyam ; 
ramaNI maNula citra wicitra KElanamu ;
maNi haaram yamunaku ramaNIyam ;   ||
;
naDumanu unnadi ewarammA!? ;;
aa naDumanu unnadi ewarammA!?
neeli marakatamu tega merasEnu ; !? ; 

imkewarammaa, ceppu 
yaSOda gaaraala paTTi ; 
paamu cuTTala pawaLimpu sEwala ;
namdukonETi maharaaju ; neeradaSyAmuDu ; 
namda namdanuDu ;muddula krishNuDu ;
Iyane ammaa! junnu prasaadamu IyammA! :  ||   

ధగ ధగ శీతల చంద్రికలు

తళ తళ లాడే పింఛములు ; 
పింఛాలెన్నో,
జమ చేసినది మా రాధమ్మ ; 
వన మయూరితో :  ||
;
ధగ ధగ శీతల చంద్రికలతోటి ; 
           మేలమాడుతూ : 
శీతవెన్నెలను 
  తన కన్నుల భరిణల ; 
      నతి నిపుణతగా - 
        జమ చేసినది మా రాధమ్మ ;   ||
;
మిల మిల జాబిలి నొడిసి పట్టుకుని ;                              
          తన దోసిలిలో ; 
పదిల పరచినది నీ కోసం ;
'ఇదిగో, క్రిష్ణా! వెన్న ముద్ద ' అని 
నీకు చూపుతూ ; పిలుస్తున్నది కద,             
        భలే  కదా - తన నైపుణ్యాలు ; 
చూడవోయి ఇటు ; నవనీత చోరుడా! ;  || 
;
==========================;
;
taLa taLa lADE pimCamulu ; 
pimCAlennO : 
jama cEsinadi maa raadhamma ; 
wana mayuuritO :  ||
;
dhaga dhaga SItala camdrikalatOTi ; 
mElamADutuu : 
wenniyalanu tana kannula bhariNala ; 
nati nipuNatagaa - 
jama cEsinadi maa raadhamma ;   ||
;
mila mila jaabili noDisi paTTukuni ; 
tana dOsililO ; 
padila paracinadi nee kOsam ;
'idigO, krishNA! wenna mudda 
'ani neeku cuuputuu ; 
pilustunnadi kada, BalE kadaa - 

tana naipuNyaalu ; 
cuuDawOyi iTu ; 
nawaneeta cOruDA! ;  || 

గిల్లికజ్జాలు, వైరాలు

రాధ ;-
గిల్లికజ్జాలు, వైరాలు పెట్టుకుని, 
అల్లరిగా ఎక్కడనో దాగున్నాడు , 
గోవిందుడు , మన గోపాల కృష్ణుడు : ||

ఈ రాధకు చూపవమ్మ 
కాస్త కరుణ చూపి, శిఖి పింఛధారిని చూపవమ్మ ; 
వన మయూరి, ఓ కేకీ! నా జీవన కాంతీ! : || 
;
నెమలి జవాబు ;- 
కనుగొన్నాను, వానిని నే కలుసుకున్నాను ; 
వాని జాడలను నీకు చెప్పమంటావా!? 
ఇపుడే నను చెప్పమంటావా!? ; || 
;
రాధ ;- అవశ్యం . సత్వరం . 
;
నెమిలి ;- 
తుంటరి కన్నయ్య ఆనవాళ్ళను ఇవ్వాలంటే ; 
నీకు - ఇవ్వాలంటే - 
పరిదానం, లంచము - ముట్టజెప్పాలి , 
నాకు ముట్టజెప్పాలి , 
గొప్ప దక్షిణలను నాకు - 
నసగకుండ భక్తితోటి - ఇవ్వవలెను, సరేనా!?!
;
రాధ ;- ఏమి కాన్క లివ్వాలో చప్పున చెప్పు!
వన మయూరి ;- 
నా ఈకలు, పింఛాలను - 
పరికరించవలె [tools] నీవు ; 
నెమలీకల తూలికలతో - తిలకములు దిద్దాలి ; 
క్రిష్ణమ్మకి కస్తూరి తిలకములను దిద్దాలి ; 
దిష్ఠి చుక్క అద్దాలి - నా పింఛముతో!
వాని మేను పయిన ; వన్నె బొమ్మలను వేయాలి , 
మకర పత్ర చిత్రలేఖనములను వ్రాయాలి అగణితముగ ; ||
;
రాధ ;- నీ షరతులన్ని తప్పక ; 
నెరవేరుస్తానమ్మా ఓ వయ్యారీ శిఖండమా! 
వైళమె వాని గురుతులను విప్పి చెప్పవమ్మ : || 
;
మయూరి ;-
మిలమిలలాడే నా పింఛాలెన్నిటినో : దారంట వేసాను ; 
కొండ గురుతులు, అవి నీకు దిక్సూచినులు ; 
నెమలీకల శోభలతో - తళ తళ లాడేస్తున్నది , ఆ బాటంతా ; 
ఈ దారిని పట్టుకుని, చకచక నువు నడిస్తేను - 
నీల మేఘ శ్యాముని, మురళీ మోహనుని - 
చిటికెలోన ఇట్టె నువ్వు చేరుతావు బేల రాధికా! 
చేరువ ఔతావు మదన గోపాలుని దివ్య సన్నిధిని ; || 
;
;- గీత రూపకం ;  
===================================;
;
=====================;  
gillikajjaalu, wairaalu peTTukuni, 
allarigaa ekkaDanO dAgunnaaDu , 
gOwimduDu , mana gOpAla kRshNuDu :  ||

 + kaasta karuNa cuupi, cuupawamma ; 

SiKi pimCadhArini O wana kEkI! naa jeewana kaamtee! :  || 

nemali jawaabu ;- 

kanugonnaanu , waanini nE kalusukunnaanu ; 
waani jADalanu neeku ceppamamTAwA!? 
ipuDE nanu ceppamamTAwA!? ; ||
raadha ;- awaSyam . satwaram . 

nemili ;-  tumTari kannayya aanawaaLLanu neeku - 


iwwAlamTE - paridaanam, 

lamcamu - muTTajeppaali ,  
goppa dakshiNalanu naaku - 
nasagakumDa bhaktitOTi iwwawalenu, sarEnA!?! ;
raadha ;- Emi kaan ka liwwaalO cappuna ceppu!

wana mayuuri ;- 

naa iikalu, pimCAlanu - parikarimcawale neewu ; 

nemaliikala tuulikalatO - 

tilakamulu diddaali ; kastuuri tilakamulanu diddaali  ; 
dishThi cukka addaali - naa pimCamutO!
waani mEnu payina ; 
wanne bommalanu wEyaali , 
makara patra citralEKanamulanu 
wraayaali agaNitamuga ; || 

raadha ;- nee sharatulanni tappaka ; 

nerawErustaanammA O wayyaarii SiKamDamA! 
waiLame waani gurutulanu wippi ceppawamma :  ||  

milamilalaaDE nA pimCaalenniTinO : 

daaramTa wEsaanu ; komDa gurutulu ; 
awi neeku diksuucinulu ; 
nemaleekala SOBalatO - 
taLa taLa lADEstunnadi , 
aa baaTamtaa ; 
ii daarini paTTukuni, 
cakacaka nuwu naDistEnu - 
neela mEGa Syaamuni, 
muraLI mOhanuni - 
ciTikelOna iTTe nuwwu cErutaawu 
bEla raadha ; cEruwa autaawu 

madana gOpaaluni diwya sannidhini ;  ||
;
రాధా మనోహర ;  यशोदा कृष्ण ;-

Wednesday, April 12, 2017

కారడవిని అడుగుల జాడలు

రఘు వంశమణి తేజులు 
ఆ మువ్వురివి నడకలు
మార్పులకు నాంది మువ్వల్లు ;  ||
;
ఆ అడుగుల జాడలు 
పరచిన ప్రతి చోట ;           
అడవి పచ్చందనాలు ; 
ఆ మువ్వురూ కలిసి ; అడుగడుగు పద్మాలు ; అడవి పచ్చందనాలు ;   || 
;
లక్ష్మణ సోదరుడు ; 
లభియించె రాములకు ; 
ఎనలేని ప్రేమ ఆ తమ్ముని పైన ; ||
;
సీతమ్మ సరి జోడు ; 
నడిచారు కారడవిలోన ;
వారి అడుగుల జాడలు 
పరచిన ప్రతి చోట ;           
అడవి పచ్చందనాలు ;  || 
;
దండకాణ్యాలు; 
     ప్రకృతీ మాతకు మురిపాల దండలు ;           
రామయ్య అడుగులకు మొక్కులు ముడుపులు ; 
చెప్పవలెనా ఏమి, వెయ్యొక్క అందాలు! :  ||  
;
;************************************;
; -   రామనిధి  ;
'
 అఖిలవనిత - posts 1010 







;

రాధామణి హైరానా

గోవింద మాధవునికి - స్వాగతాలు పలుకుదాము ; 
పదండి, ఆ నది కాళిందీ ఒడ్డు వైపు ; 
అని తొందరతో హైరానా పడుతున్నది పడతి రాధిక ;  || 
;
గిరిని మోసి అలిసినాడు గోవిందుడు ; 
గోవర్ధన గిరినెత్తి, కొన గోటను మోసి మోసి ; 
కడు బడలికతో డస్సినాడు 
మా ముకుంద మురళీధరుడు :  | | 
;
రేపల్లెను కాపాడెను ; 
అతను - లోక శ్రేయస్సుకు కవచము ;
అటూ ఇటూ పరుగులిడుతు ; 
పనులు బెత్తాయిస్తూ తిరుగును రాధామణి ;  ||
;
సన్నాయి మేళాలు, బాజా బజంత్రీలు , 
తాషామరప్పాలు - మిన్నంటే ఘోషలు ; 
శృతి సరిగా చూసుకొనండని ; 
పురమాయిస్తున్నది, 
విధులు పనులు అందరికీ , రమణి రాధిక ;  || 
;
వేణు గాన లోలుని సన్నిధిలోన ; 
వాద్యాలు, సంగీతం - 
లయ నెపుడూ తప్పవులే, 
తెలుసుకోవమ్మా, ఓ రాధమ్మా! || 

పాల చిందులకు సంగీతం

మధురానగరిలొ – 
నగరికి వెడలితి వనితామణులు ;
లలనల నడుముల పాలకుండలు ;  
పెరుగు, తక్రం, పాల చిందులు ; 
పాల తొణుకుల సవ్వడులన్నియు ; 
సరిగమ పదని – సప్త స్వరముల  
          సుభగత్వం వింతగ వింతలు ; 
            వంతులు వంతులు – భళీ భళీ! :  || 
;
క్షీరాంబుధిని కాపురముండి , 
వసుధకు విచ్చేసిన వాడు ; 
మునుపు విష్ణువు ఓయమ్మా! 
పాల కడలి వాసునికి ;
    పాలు అన్నచో ఎంతో ప్రీతి
        సహజమే  ఓయమ్మా! ;     ||   
;
పల్లె పడుచుల శిరసున మోసే –
దుత్తల పాలకు సంగీతమును నేర్పిస్తున్నది ; 
క్రిష్ణ మురళీ రవళి ; అందులకే కద ఓ యమ్మా! 
అది పూర్వ జన్మ స్నేహ బంధముల 
      కలబోతల  ఫలితం- తెలియగ, ఓ యమ్మా!  || 

అన్నానా, అనుకున్నానా !?

అన్నానా, అనుకున్నానా, 
రూపము లేని గాలికి - 
   చక్కని రాగ స్వరూపము 
         ఏర్పడుననుచూ ;  ||
;
తోపులొ ఎండిన పుల్ల దొరికెనట ; 
అది, మురళిగ ఆకృతి దాల్చెనట ;  
వెదురుకె అంతటి భాగ్యాలు ;
వేణుమాధవా! 
నీ పల్లవాంగుళుల -  పిల్లంగ్రోవిగ -
    నను చేయుదువనుకొన్నానా..... ;... ||
;
నీ పల్లవాంగుళుల పిల్లనగ్రోవిగ - 
నన్ను చేయుదువనుకొన్నానా, వేణు వినోదీ!
మరీ ఇంత కాపీనము నీకు ;
రాధిక పట్ల, భళి భళి, 
శీతకన్నును వేసినావులే!
;
పన్నగశయనా! మాయ నిద్దురను నటియిస్తావు ;
రాధ పట్టుదల నీవెరుగనిదా,
నీ వంశీ రాగము తానౌతుంది ;
తప్పదు, తప్పక - 
    ఇదియే ఎరుక!
       ఇది నీకెరుక!   ;  ||
;
;========================== =;
;
annaanaa, anukunnaanaa, 
ruupamu lEni gaaliki - 
cakkani raaga swaruupamu 
             ErpaDunanucuu ;  ||
;
tOpulo emDina pulla dorikenaTa ; 
adi, muraLiga aakRti daalcenaTa ;  ||  
;
weduruke amtaTi bhaagyaalu ;
wENumaadhawA! 
      nee pallawaamguLula
pillamgrOwiga - 
     nanu cEyuduwanukonnaanaa,
maree imta kaapiinamu niiku ;
raadhika paTla ; bhaLi bhaLi, 
SItakannu wEsinaawulE!
pannagaSayanA! 
       maaya nidduranu naTiyistaawu ;
raadha paTTudala neeweruganidaa,
nee wamSI raagamu taanautumdi ;
tappadu, tappaka - idiyE eruka!
idi neekeruka!   ;  ||
;