Thursday, January 28, 2016

పుష్పాదులు

వసంతముల సంతలోన
ఆగండమ్మా సుంత!
ఈసులన్నింటినీ మీరు ;
వీడండమ్మా! ఇసుమంతైనా! ||
;
పుష్పాదుల తలంబ్రాలు ;
వెండి వెన్నెలల మధుపర్కాలు ధరించి ;
వచ్చిందమ్మా ప్రకృతి వధువు;
చూడండమ్మా వేడుక తీరా! ||
;
ముద్దులగుమ్మల్లారా!
రేయి గుమ్మపు “మొయిలు తలుపులు”:
తెరచిందమ్మా, సంధ్యారాణి (సందియపొద్దు) :
కుడిపాదముಲು  పెట్టండమ్మా! ||
;
; యమునాతరగల కొసలపయిన ;
జలతారంచుల మిసిమిప్రోగుల ;
అల్లినదమ్మా, ఆ నెలవంక;
,,,,,,,,,,,,,,, కట్టండమ్మా! నెలతల్లారా! :

గుమ్మటములను మును వాకిళ్ళకు ;
తొడగండమ్మా తళుకు పావడలు ముచ్చటగాను||  ;
;
కృష్ణుడు వచ్చే వేళ ఇది ;
మన కన్నయ్య –  వచ్చే వేళ ఐనది ||  

==========================================;  ;

pushpaadulu :-   [పాట 4 ; buk pEjI 15 ]

 ; wasamtamula samtalOna aagamDammA sumta!
IsulannimTinii miiru ; wIDamDammA! isumamtainaa! ||
;
; pushpaadula talambraalu ;
wemDi wennelala madhuparkaalu dharimchi ;
wachchimdammaa, prakRti wadhuwu;
chuuDamDammA weEDuka tIrA! ||
;
; muddulagummallaaraa! rEyi gummapu “moyilu talupulu”:
terachimdammaa, samdhyA
rANi (samdiyapoddu) : kuDipAdamul peTTamDammA! ||
;
yamunaataragala kosalapayina ;
jalataaramchula misimiprOgula ; allinadammaa,

aa nelawamka; kaTTamDammA! nelatallArA! :
gummaTamulanu munu waakiLLaku ;
toDagamDammA taLuku paawaDalu muchchaTagAnu||  ;
;
kRshNuDu wachchE wELa idi ;mana
kannayya – wachchE wELa ainadi ||  

********************************;

 పుష్పాదులు :-   [ pATa 4 ; బుక్ పేజీ 15 ]
 ;pushpaadulu :-   [పాట 4 ; buk pEjI 15 ] 

No comments:

Post a Comment