నీ పదపద్మములను చేరుటకై ;
ఎక్కెద సోపానముల నెన్నైన నా స్వామీ! ||నీ||
:
మంచు కన్నియలు, వెలుగు కుండలలో;
నింపి యుంచిరి, నీటి ముత్యములు!
నీరాజనముల గైకొన రా! రా! నా స్వామీ! ||నీ||
;
తొడిమ బాలికలు, రెమ్మ దోసిట; ;
నింపుకొన్నవి , పూవులాకులను;
తోమాలలను స్వీకరించరా నా స్వామి!! ||నీ||
;
తరు పూజారులు, కొమ్మ పళ్ళెముల ;
తెచ్చి యున్నవి, ఫలములెన్నిటినో:
పక్వ ఫలములను గ్రోలర, దయతో నా స్వామీ! ||నీ||
;
విరహ ధూపముల, సొక్కి సోలిన ;
అన్నులమిన్న రాధను ఒక పరి ;
కడకన్నుల చూపున కనికరించరా! నా స్వామీ!! ||నీ||
==============================;
kannulachuupulu :-
nii padapadmamulanu chEruTakai ;
ekkeda sOpAnamula nennaina ||nii||
:
mamchu kanniyalu, welugu kumDalalO;
nimpi yumchiri, niiTi mutyamulu!
nIrAjanamula gaikona rA! rA! ||nii||
;
toDima bAlikalu, remma dOsiTa; ;
nimpukonnawi , puuwulaakulanu; tOmaalalanu
swiikarimcharaa naa swami! ||nii||
;
taru puujaarulu, komma paLLemula ; techchi
yunnawi, phalamulenniTinO:
pakwa phalamulanu grOlara, dayatO ||nii||
;
wiraha dhuupamula, sokki sOlina ;
annulaminna rAdhanu oka pari ; kaDakannula
chUpuna kanikarimcharA! ||nii||
౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦ - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦
కన్నులచూపులు :- [ పాట – 7 ; బుక్ పేజీ 18 ]
kannulachuupulu :- [ pATa 7 - buk pEjI 18]
No comments:
Post a Comment