మృదు మధుహాసము;
మనోహర రూపము;
కని కని మురిసెను;
ఆ బాల గోపాలము ||
;
నెమలి పింఛమాడెను ;
నుదురు పయిన ;
నీలి నీలి ముంగురులు ఆడెను ||
;
ఎరుపు పెదవులాడెను ;
పెదవి పైన వేణువుపై –
చివురు వ్రేళులాడెను ||
;
కుండలములు ఆడెను ;
గళములోన - రంగు రంగు –
పూదండలు ఆడెను ||
;
హరి నడుము ఆడెను ;
సిరిమువ్వలు ఘలు ఘల్లన;
పదపద్మములాడెను; ||
;
పిల్లగాలి ఆడెను ;
రాసకేళి హేల చూసి -
బృందావని నవ్వెను ||
=============================;
mRduhaasamu :- [ pATa 5 - buk pEjI 16 ]
mRdu madhuhaasamu;
manOhara rUpamu; -
kani kani murisenu;
A bAla gOpaalamu ||
;
nemali pimCamADenu ;
nuduru payina ;
niili niili mumgurulu ADenu ||
;
erupu pedawulaaDenu ;
pedawi paina wENuwupai –
chiwuru wrELulADenu ||
;
kumDalamulu aaDenu ;
gaLamulOna ramgu ramgu –
puudamDalu aaDenu ||
;
hari naDumu aaDenu ;
sirimuwwalu ghalu ghallana;
padapadmamulaaDenu; ||
;
pillagaali aaDenu ;
raasakELi hEla chUsi -
bRmdAwani nawwenu ||
మృదుహాసము :- [ పాట 5 - బుక్ పేజీ 16 ]
mRduhaasamu :- [ pATa 5 - buk pEjI 16 ]
No comments:
Post a Comment