Sunday, January 31, 2016

ఓమ్ - వింఖము - నాదము

ఓమ్ కార నాదము ;
ఓమ్ - వింఖము - నాదము
పంచ నాద బీజము  ||
;
నిరంతరం మననమున ;
మానసము అగును కదా నళినము;
సహస్ర దళయుతమౌ పుష్పము ||
;
హృదయమెపుడు;
మసకలైన దర్పణము; ఔను కదా!
మురికి మకిలిలను తుడువగ
ఓమ్ నాదం వస్త్రము ||
;
ఓమ్ కారం సుధా ఝరి ;
సలిల ధార లాలితమౌ;
మేధస్సులు పునీతం ||
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''',
ఓమ్  నమః శివాయ!
ॐॐॐॐॐॐ
===========
ఓమ్  nama@h Siwaaya!
నాసా విడుదల చేసిన వీడియో ;
=======================

# ఓమ్ kaara naadamu ;-

ఓమ్ - wimkhamu - naadamu ;
pamchanaada bIjamu ;
niramtaram mananamuna ;
maanasamu agunu kadaa naLinamu;
sahasra daLayutamau pushpamu ||
;
hRdayamepuDu;
masakalaina darpaNamu; aunu kadaa!
muriki makililanu tuDuwaga
ఓమ్ naadam wastramu ||
;
ఓమ్ kaaram sudhaa jhari ;
salila dhaara laalitamau;
mEdhassulu puniitam ||
'''
[  ఆదివారము; 31, 2016 -
in :- మన ఆచారాలు సంప్రదాయాలు సంస్కృతి ]
LINK :- 
http://www.sciencechannel.com/tv-shows/how-the-universe-works/videos/this-is-what-the-sun-sounds-like/      ]
[oct 10 2015 , NASA ; Solar Dynamics observatory - ]

వెన్నపూస ఇస్తాను చందురూడా!

వెన్నపూస ఇస్తాను చందురూడా!
వెన్నుని జాడలు తెలుపు, చందురూడా! ||
;
వన్నె వన్నె నూలుపోగులెన్నెన్నో ఇస్తాను;
ప్రతి విదియను నీవు బాగ సింగారం చేసుకోవోయ్!
విదియరేఖ నెలబాలుడ! చందురూడా!
విసుగుకోక మాకు ఊసు చెప్పుమోయీ! ||
;
మబ్బు వెనుక దాగుండీ చందురూడా!
మెల్లమెల్లగా రావోయ్ చందురూడా!
చటుకున వానిని పట్టి మాకు ఇవ్వుమోయ్ ||
;
వెన్నెలంత చల్లదనం 'వెన్నుని నవ్వు'!
కానుకగా నీకు దొరుకు చందురూడా!
నీదు శ్రమ వృధా కాదు చందురూడా! ||

[ పాట- 1 నీ శ్రమ వృధా కాదు చందురూడా! ]

[ రచన - కుసుమాంబ1955]

**********************************,

wennapuusa istaanu chamduruuDA!
wennuni jaaDalu telupu, chamduruuDA! ||
;
wanne wanne nuulupOgulennennO istaanu;
prati widiyanu; niiwu baaga
simgaaram chEsukOwOy! ;
widiyarEKa nelabaaluDa! chamduruuDA!
wisugukOka maaku; uusu cheppumOyI! ||
;
eM mabbu wenuka daagumDii chamduruuDA!
mella mellagaa raawOy chamduruuDA!
chaTukuna waanini paTTi maaku iwwumOy ||
;
wennelamta challadanam 'wennuni nawwu';
kaanukagaa niiku doruku chamduruuDA!
niidu Srama wRdhaa kaadu chamduruuDA! ||

[ paaTa- 1 - nii Srama wRdhaa kaadu chamduruuDA!]

[ rachana - kusumaamba1955]

*****************************,
;
[ మన సంస్కృతి - ఆచారాలు sampradaayaalu ; September 1, 2015 ·  ]
అఖిలవనిత
Pageview chart 34710 pageviews - 834 posts, last published on Jan 28, 2016 
తెలుగురత్నమాలిక
Pageview chart 5197 pageviews - 148 posts, last published on Jan 20, 2016

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 64308 pageviews - 1040 posts, last published on Jan 19, 2016

Thursday, January 28, 2016

కన్నులచూపులు

నీ పదపద్మములను చేరుటకై ; 
ఎక్కెద సోపానముల నెన్నైన నా స్వామీ!  ||నీ|| 
మంచు కన్నియలు, వెలుగు కుండలలో; 
నింపి యుంచిరి, నీటి ముత్యములు! 
నీరాజనముల గైకొన రా! రా! నా స్వామీ! ||నీ||  
తొడిమ బాలికలు, రెమ్మ దోసిట; ;
నింపుకొన్నవి , పూవులాకులను; 
తోమాలలను స్వీకరించరా నా స్వామి!! ||నీ||  
;
తరు పూజారులు, కొమ్మ పళ్ళెముల ; 
తెచ్చి యున్నవి, ఫలములెన్నిటినో: 
పక్వ ఫలములను గ్రోలర, దయతో నా స్వామీ! ||నీ||  
;
విరహ ధూపముల, సొక్కి సోలిన ; 
అన్నులమిన్న రాధను ఒక పరి ; 
కడకన్నుల చూపున కనికరించరా! నా స్వామీ!! ||నీ||  

==============================; 

kannulachuupulu  :-   

nii padapadmamulanu chEruTakai ; 
ekkeda sOpAnamula nennaina ||nii|| 
mamchu kanniyalu, welugu kumDalalO; 
nimpi yumchiri, niiTi mutyamulu! 
nIrAjanamula gaikona rA! rA! ||nii||  
toDima bAlikalu, remma dOsiTa; ;
nimpukonnawi , puuwulaakulanu; tOmaalalanu 
swiikarimcharaa naa swami! ||nii||  
;
taru puujaarulu, komma paLLemula ; techchi 
yunnawi, phalamulenniTinO: 
pakwa phalamulanu grOlara, dayatO ||nii||  
wiraha dhuupamula, sokki sOlina ; 
annulaminna rAdhanu oka pari ; kaDakannula 
chUpuna kanikarimcharA! ||nii|| 

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  - ౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧౦  
కన్నులచూపులు  :-   [ పాట – 7  ; బుక్ పేజీ 18 ] 
kannulachuupulu  :-   [ pATa 7 - buk pEjI  18] 

నీరజనయనా!

వంశీ కృష్ణ! రావోయీ! విందును చేకొన రావోయీ! 
మా కన్నుల విందుగాను, కువలయదళ నేత్రా!   ||  
;
పల్లవాంగుళి ఎంత ; కంది పోయినదో! ; 
గోవర్ధన గిరిని కెంగేలు మీదను – నిలిపీ, నిలిపీ || 
పదపద్మములెంతగ నొచ్చియున్నవో?  
పన్నగ ఫణముల నణచీ, అణచీ  || 
;
కమల నయనము లెంత సోలుచున్నవో, 
రేయి కేళిని – సలిపీ, సలిపీ  ||  

 ===========================;

   niirajanayanaa!  :- [ pATa – 6 ; buk pEjI 17 ] 

] wamSI kRshNa! raawOyI! ; 
wimdunu chEkona raawOyI! 
maa kannula wimdugaanu, 
kuwalayadaLa nEtrA!   ||  
pallawaamguLi emta ; 
kamdi pOyinadO! ; 
gOwardhana girini 
kemgElu miidanu – 
nilipii, nilipii || 
;
padapadmamulemtaga ; 
nochchiyunnawO?  
pannaga phaNamula 
naNachii, aNachii  || 
;
kamala nayanamu 
lemta sOluchunnawO, 
rEyi kELini – 
salipii, salipI  ||  
 
  ► ► ► ► ► ► ► ► ► ► ► ► ► ► ►  
;
నీరజనయనా!  :-   [ పాట – 6  ; బుక్ పేజీ 17 ] 

మృదు మధుహాసము

మృదు మధుహాసము; 
మనోహర రూపము;
కని కని మురిసెను; 
ఆ బాల గోపాలము || 
;
నెమలి పింఛమాడెను ; 
నుదురు పయిన ; 
నీలి నీలి ముంగురులు ఆడెను  ||
;
ఎరుపు పెదవులాడెను ; 
పెదవి పైన వేణువుపై – 
చివురు వ్రేళులాడెను ||
;
కుండలములు ఆడెను ; 
గళములోన - రంగు రంగు – 
పూదండలు ఆడెను ||
;
హరి నడుము ఆడెను ; 
సిరిమువ్వలు ఘలు ఘల్లన; 
పదపద్మములాడెను;  ||
;
పిల్లగాలి ఆడెను ; 
రాసకేళి హేల చూసి - 
బృందావని నవ్వెను ||

=============================;

          mRduhaasamu  :-   [ pATa 5 - buk pEjI 16 ] 

mRdu madhuhaasamu; 
manOhara rUpamu; - 
kani kani murisenu; 
A bAla gOpaalamu || 
;
nemali pimCamADenu ; 
nuduru payina ; 
niili niili mumgurulu ADenu  ||
;
erupu pedawulaaDenu ; 
pedawi paina wENuwupai – 
chiwuru wrELulADenu ||
;
kumDalamulu aaDenu ; 
gaLamulOna ramgu ramgu – 
puudamDalu aaDenu ||
;
hari naDumu aaDenu ; 
sirimuwwalu ghalu ghallana; 
padapadmamulaaDenu;  ||
;
pillagaali aaDenu ; 
raasakELi hEla chUsi - 
bRmdAwani nawwenu ||



మృదుహాసము  :-   [ పాట 5 - బుక్ పేజీ 16 ]
   mRduhaasamu  :-   [ pATa 5 - buk pEjI 16 ]   

పుష్పాదులు

వసంతముల సంతలోన
ఆగండమ్మా సుంత!
ఈసులన్నింటినీ మీరు ;
వీడండమ్మా! ఇసుమంతైనా! ||
;
పుష్పాదుల తలంబ్రాలు ;
వెండి వెన్నెలల మధుపర్కాలు ధరించి ;
వచ్చిందమ్మా ప్రకృతి వధువు;
చూడండమ్మా వేడుక తీరా! ||
;
ముద్దులగుమ్మల్లారా!
రేయి గుమ్మపు “మొయిలు తలుపులు”:
తెరచిందమ్మా, సంధ్యారాణి (సందియపొద్దు) :
కుడిపాదముಲು  పెట్టండమ్మా! ||
;
; యమునాతరగల కొసలపయిన ;
జలతారంచుల మిసిమిప్రోగుల ;
అల్లినదమ్మా, ఆ నెలవంక;
,,,,,,,,,,,,,,, కట్టండమ్మా! నెలతల్లారా! :

గుమ్మటములను మును వాకిళ్ళకు ;
తొడగండమ్మా తళుకు పావడలు ముచ్చటగాను||  ;
;
కృష్ణుడు వచ్చే వేళ ఇది ;
మన కన్నయ్య –  వచ్చే వేళ ఐనది ||  

==========================================;  ;

pushpaadulu :-   [పాట 4 ; buk pEjI 15 ]

 ; wasamtamula samtalOna aagamDammA sumta!
IsulannimTinii miiru ; wIDamDammA! isumamtainaa! ||
;
; pushpaadula talambraalu ;
wemDi wennelala madhuparkaalu dharimchi ;
wachchimdammaa, prakRti wadhuwu;
chuuDamDammA weEDuka tIrA! ||
;
; muddulagummallaaraa! rEyi gummapu “moyilu talupulu”:
terachimdammaa, samdhyA
rANi (samdiyapoddu) : kuDipAdamul peTTamDammA! ||
;
yamunaataragala kosalapayina ;
jalataaramchula misimiprOgula ; allinadammaa,

aa nelawamka; kaTTamDammA! nelatallArA! :
gummaTamulanu munu waakiLLaku ;
toDagamDammA taLuku paawaDalu muchchaTagAnu||  ;
;
kRshNuDu wachchE wELa idi ;mana
kannayya – wachchE wELa ainadi ||  

********************************;

 పుష్పాదులు :-   [ pATa 4 ; బుక్ పేజీ 15 ]
 ;pushpaadulu :-   [పాట 4 ; buk pEjI 15 ] 

వన్నెలకేళి

హోలీ!  హోలీ!  హోలీ! – 
రంగుల కేళీ, కేళీ, కేళీ – వేళల ;
ఆనందముల తేలీ తేలీ ; 
ఆడండమ్మా! రాసలోలునితో ||
;
మోవి చివురుల, సుధలను గ్రోలిన ; 
ఎఱ్ఱని పెదవుల వాడిదిగో!
వచ్చేనమ్మా వచ్చేను ;   
ఎఱ్ఱని రంగులు పూయండమ్మా! ||
;
చెక్కుటద్దముల, నొక్కుల నుంచిన ; 
తెల్లని గోరుల వాడిదిగో ;
వచ్చేనమ్మా వచ్చేను ;   
తెల్లనిరంగును చిలకండమ్మా! ||
;
జాణల, నానందాల డోలల నూచిన ; 
నల్లనివాడు ఇడుగోనమ్మా!
వచ్చేనమ్మా వచ్చేను ;   ; 
నల్లని రంగులు చల్లండమ్మా! ||
;
పచ్చని పొదల మాటున దాగిన ; 
వెచ్చనివలపుల వాడిదిగో;
వచ్చేనమ్మా వచ్చేను ;  
పచ్చని రంగును పరచండమ్మా! ||  
;
యమునాతీర యామిని విహారి ; 
వచ్చేనమ్మా వచ్చేను ;    
నీలపురంగులు వెదజల్లండీ! ||     
;
పసుపు పారాణి, సొగసుగ దిద్దే ; 
సొగసులరాయుడు, గోపీలోలుడు;
వచ్చేనమ్మా వచ్చేను ;   
పసుపును చెక్కిట రుద్దండమ్మా! ||

====================,

Wannela kELi ;-

                          
hOlii!  hOlii!  hOlii! – 
ramgula kELI, kELI, kELI – wELala;
aanamdamula tElii tElii ; 
ADamDammA! raasalOlunitO ||
;
mOwi chiwurula, sudhalanu grO lina ; 
e~r~rani pedawula wADidigO!
wachchEnammA wachchEnu ;   
e~r~rani ramgulu pUyamDammA! ||
;
chekkuTaddamula, nokkula numchina ; 
tellani gOrula wADidigO ;
wachchEnammA wachchEnu ;   
tellaniramgunu chilakamDammA! ||
;
jANala, naanamdaala DOlala nUchina ; 
nallaniwADu iDugOnammA!
wachchEnammA wachchEnu ;   ; 
nallani ramgulu challamDammaa! ||
;
pachchani podala mATuna daagina ; 
wechchaniwalapula waaDidigO;
;wachchEnammA wachchEnu ;  
pachchani ramgunu parachamDammaa! ||  
yamunaatiira yaamini wihaari ; 
wachchEnammA wachchEnu ;    ;
niilapuramgulu wedajallamDii! ||
;
pasupu pArANi, sogasuga diddE ;
;sogasularaayuDu, gOpIlOluDu;
wachchEnammA wachchEnu ;   
pasupunu chekkiTa ruddamDammaa! ||

****************************************;

  వన్నెలకేళి ;- [పాట 3  బుక్ పేజీ 13 ]
Wannela kELi ;- [పాట  3 ; buk pEjI 13 ]
తెలుగురత్నమాలిక
Pageview chart 5180 pageviews - 148 posts, last published on Jan 20, 2016

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 64242 pageviews - 1040 posts, last published on Jan 19, 2016 - 7 followers

అఖిలవనిత
Pageview chart 34616 pageviews - 829 posts, last published on Jan 18, 2016

Monday, January 18, 2016

వ్రజబాలుడు

మన కుంజవిహారి, భాండీర వన సంచారీ
ఆభరణమ్ముల స్థానము లెక్కడ? 
లెక్కించుదమా, రాగమయీ!
రమణి రాధికా !    ||
;
వ్రజబాలుని నాసికాగ్రమున ; 
ముత్యము, నీదు దంతములైనవ? రాధా! ||
;
రాసలోలుని – మణికుండలములింపుగ ; 
నీ నీలి కన్నులై, నిలిచె కాబోలును! ||
;
శౌరి కౌస్తుభాభరణము : 
చక్కని పొక్కిలి ఆయెనొ, ఏమో || 
;
శ్రీ హరి కస్తూరి తిలక రేఖలు, 
నీదు చివురు పెదవులుగ రూపొందినవేమో!? ||   
వ్రజబాలుడు = [ పాట 2 -  బుక్ పేజీ 13 ]

**********************************,
English (United States) Blogger options
New Blog
అఖిలవనిత
Pageview chart 34516 pageviews - 828 posts, last published on Jan 18, 2016

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 64027 pageviews - 1039 posts, last published on Jan 11, 2016 -  

తెలుగురత్నమాలిక
Pageview chart 5138 pageviews - 147 posts, last published on Nov 11, 2015

గోకులవనిలో కన్నయ్య

ఆడెను  కృష్ణుడు  ‘గోకులవనిలో’ ; 
ఆడెను కృష్ణుడు, నాట్యమాడెను ||
;
కౌస్తుభ రాణ్మణి తళుకులీనగా; 
కేయూరములు – బెళుకు లొత్తగా;
అంగుళీయకము మిలమిలలాడా ||
;
కంకణ నిక్వాణముల తూగగా :
శృంఖలములు నా - ట్యములు ఆడగా :   
మంజీరములు తాళములేయగా || 
;
పింఛకాంతులు - నింగి కెగయగా : 
కంకణరజము – సుద్దులాడగా :  
ముత్తెపు నఖములు - ముద్దులాడగా ||
;
మ్రోగెను వేణువు – బృందావనిలో : 
సాగెను Yఅమున – గానలహరిలో! 
మురళీగాన వీచీ లహరిలో!  
వీచికల లహరిలో 
హరి ప్రతి అడుగూ – నర్తనమాయెను || 
  
=========================,

    శ్రీకృష్ణగీతాలు :-
                 gOkulawanilO :- [pATa 1; buk pEjI 11 ] 

ADenu  kRshNuDu  ‘gOkulawanilO’ ; 
ADenu kRshNuDu, nATyamADenu ||
;
kauaustubha raaNmaNi taLukuliinagaa; 
kEyuuramulu – beLuku lottagaa; 
amguLIyakamu milamilalADA ||
;
kamkaNa nikwaaNamula tUgagA :
SRmKalamulu nA - Tyamulu ADagA :   
mamjIramulu taaLamulEyagA || 
;
pimCakAmtulu - nimgi kegayagA : 
kamkaNarajamu – suddulADagA :  
muttepu naKamulu - muddulADagA ||
;
mrOgenu wENuwu – bRmdAwanilO : 
saagenu yamuna – gaanalaharilO! : 
muraLIgaana weechii laharilO! ; 
weechikala laharilO ; 
hari prati aDuguu – nartanamaayenu || 

=============================;
           
 గోకులవనిలో కన్నయ్య :- [ పాట 1 ; బుక్ పేజీ 11 ] :-
 ********************************;
[ Faired - :- [ పాట;-  మంగళవారం, 06 అక్టోబర్ 2015 ; [buk pEjI 12 ] :-
********************************;

క్రిష్ణా! సేదదీరుమోయీ!

గింగురులెత్తే శంఖనాదమును; 
కడలికి ఇచ్చి సేదదీరుమోయీ! 
క్రిష్ణా! సేదదీరుమోయీ!    ||
;
వెదురు తోపులలొ; 
సాగే గాలికి వరములిచ్చినావా! 
మురళీరవముల వరములిచ్చినావా? !    || 

భాండీర వనము సర్వమూ 
ఓలలాడుచుండేను; 
క్రిష్ణా! ఇట ఓలలాడుచుండేను! !    ||  
వనముల, ఉద్యానమ్ముల;  
రాగ హేలలను ఒసగీ ఒసగీ; 
అలసినావు కదరా!! 
క్రిష్ణా!  అలసినావు కదరా! || 
;
సేదదీరుమోయీ! 
రాధ మమతల సేదదీరుమోయీ! 
క్రిష్ణా! సేదదీరుమోయీ||  
=================,
  
#gimgurulettE Samkhanaadamunu; 
kaDaliki ichchi sEdadiirumOyI! 
krishNA! sEdadiirumOyI!  ||  
;
weduru tOpulalo; 
saagE gaaliki waramulichchinaawA! 
muraLIrawaLini; 
bhaamDirawanamu sarwamuu 
OlalaaDuchumDEnu; 
iTa krishNA! OlalaaDuchumDEnu;  ||
;
wanamula, udyaanammula;  
raagahElalanu osagii osagii; 
alasinaawu kada! 
krishNA! sEdadiirumOyI! || 

*************************,   

అఖిలవనిత
Pageview chart 34477 pageviews - 826 posts, last published on Jan 11, 2016

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 64021 pageviews - 1039 posts, last published on Jan 11, 2016 - 7 followers

తెలుగురత్నమాలిక
Pageview chart 5135 pageviews - 147 posts, last published on Nov 11, 2015 

Monday, January 11, 2016

దశావతార కృతి

పురందరదాసు:- 1484 - 1564 ల ఉన్న భక్తవరేణ్యుడు.  
దాస సాహిత్యము, "హరిదాసు గాన సాహిత్యాదులు ' – 
కర్ణాటక దేశమున బహుళ వ్యాప్తి గాంచుటకు కారణమైన వారిలో పురందరదాసుఒకరు.
పురందరదాసు పాటలు మ్ర్దు లాలిత్య మాధురీభరితములు.   

పురందరదాసు దశావతార కృతి చూద్దాము!

పంకజముఖియ రెల్లరు బందు లక్ష్మీ – 
వెంకటరమణగారతి ఎత్తిరె ;  ||పం|| 
;
మత్స్యావతారగె ; మందరోద్ధారిగె ;;
ఉత్సాహది భూమి తందవగె ; 
వత్సగాగి కంబదిందలి బంద ; 
ఉత్సవ నరసింహగ్రారతి ఎత్తిరె  ||పం|
;
వామన రూపది దాన బేడిదవగె ; 
రామనాగి దశశిరనను కొంద ; 
స్వామి శ్రీకృష్ణ గారతి ఎత్తిరె  ||పం||
;
బత్తలెనింతగె బైద్ధావతారగె ; 
ఉత్తమ అశ్వవనేరిదగె ;
భక్తరసలహువ పురందరవిఠలగె ; 
ముత్తైదెయ రారతి ఎత్తిరె ;  ||పం||  

*****************,  
ధన్యాసి రాగం, ఆది తాళం - 
ఈ పాట భావం సుబోధకమే ఔతున్నది కదా! 
పురుషోత్తమునికి హారతి ఒసగుతూ గానం చేసాడు పురందరదాసు.
'హారతులు ఎత్తుట ' అని కన్నడములో - 
'ఎత్తుట’  ప్రత్యయ ప్రయోగం ఉన్నది. 
తెలుగువారు కూడా ' హారతి ఎత్తుట' అని 
కొన్ని స్థానిక ప్రయోగములుగా ఉన్నవి. 

=========================;

2]  కీర్తనలో దాసుల వారు 'ఉత్తమాశ్వము నెక్కిన వానికి హారతి - 
అని ప్రతీక మాత్రంగా  చెప్పారు, 
'కలి / కల్కి పురుషుని పేరును చెప్పలేదు.
] జయదేవుడు "కల్క్యావతారా!" అని చెప్పాడు.  
========,
#] Oh beautiful ladies with lotus-like faces, 
please come and offer auspicious camphor light to Lord Venkata Ramana.
] Offer Harati to the Lord who incarnated as fish, who lifted Mandara mountain, who incarnated as boar and rescued the earth and who emerged as Lakshmi Narasimha incarnation from iron pillar.;
] Offer Harati to the Lord who appeared as Vamana incarnation to beg charity from King Bali, who came as Parasurama wielding an axe, who incarnated as Sri Rama to destroy ten-headed Ravana and who incarnated as Lord Krishna.
] Offer Harati to the Lord who incarnated as Buddha and who will appear on great horse in Kaliyuga. Oh pious women, wave Harati to Lord Purandara Vitthala the protector of all devotees. # 
****************************************************************;
kiirtanalO daasula waaru 'uttamaaSwamu nekkina waaniki haarati - ani pratiika maatramgaa  cheppaaru, 'kali / kalki purushuni pErunu cheppalEdu.
jayadEwuDu "kalkyaawataaraa!" ani cheppADu.  

=================================;
puramdaradaasu:- 1484 - 1564 la unna bhaktawarENyuDu.   
daasa saahityamu, "haridaasu gaana saahityaadulu ' - 
karNATaka dESamuna bahuLa wyaapti gaamchuTaku 
kaaraNamaina waarilO puramdaradaasuokaru.

puramdaradaasu :-

pamkajamukhiya rellaru bamdu lakshmii - 
wemkaTaramaNagaarati ettire ;  ||pam|| 
;
matsyaawataarage ; 
mamdarOddhArige;;
utsaahadi bhuumi tamdawage ; 
watsagaagi kambadimdali bamda ; 
utsawa narasim 
hagraarati ettire  ||pam।। 
;
waamana ruupadi daana bEDidawage ; 
raamanaagi daSaSirananu komda ; 
swaami SRiikNshnagaarati ettire;  ||pam||
;
battalenimtage baiddhaawataarage ; 
uttama aSwawanEridage ;
bhaktarasalahuwa puramdarawiThalage ; 
muttaideya raarati ettire ;  ||pam||  

*****************,   
dhanyaasi raagam, aadi taaLam - 
I paaTa bhaawam subOdhakamE autunnadi kadA! 
purushOttamuniki haarati osagutuu gaanam chEsaaDu puramdaradaasu.
'haaratulu ettuTa ' ani kannaDamulO - 
'ettu' pratyaya prayOgam unnadi. 


+++++++++++++++++++++++++++++++++++++++;

కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 63814 pageviews - 1036 posts, last published on Jan 10, 2016 - 7 followers
Create new postGo to post listView blog
అఖిలవనిత
Pageview chart 34346 pageviews - 825 posts, last published on Nov 30, 2015
Create new postGo to post listView blog
తెలుగురత్నమాలిక
Pageview chart 5101 pageviews - 147 posts, last published on Nov 11, 2015
++++++++++++++++++