Tuesday, April 22, 2014

శ్రీ ద్వారకామాయి

శ్రీ ద్వారకామాయి ఒడి నేడు ఇటు నిండెను; 
ఏమి తన భాగ్యము! మును జన్మ పుణ్యము ||

మహరాష్ట్రమందున 
మహోన్నత పీఠము;       
ఘన షిర్ది పురమిది కదా!                                 
జనుల కోర్కెలు తీర్చు;
శుభ కల్పతరువిదే! 
శ్రీ ద్వారకామాయి ||

దివినున్న దేవతలు; 
దివ్య భావములన్ని;                      
తమ – దివ్య భావమ్ములను  
కూర్చి నిర్మించిన; 
పూల ఊయెల ఇదియె! 
శ్రీ ద్వారకామాయి || 


****************************,

చైత్ర కోణ మానిని (712 పోస్టులు)

శ్రీ ద్వారకామాయి (గాన గీతిక )

No comments:

Post a Comment