Tuesday, April 8, 2014

కోతి తోక, తమసా నది

“బందర్ పూంఛ్” - అనే కొండ శిఖరం ఉత్తరాఖండ్ లో ఉన్నది.
హిమాలయ పర్వతశ్రేణిలోని అంతర్భాగం ఇది.  బందరు అంటే కోతి అని తెలిసిన సంగతి కదా!
బందర్ పూంఛ్ అంటే "వానర వాలము" అని అర్ధం.
దీనికే "శ్వేత శిఖరము"/White peak అనే నామం కూడా ఉన్నది.
ఆ దగ్గరలోని ఇంకో శిఖరానికి నల్ల శిఖరం/ కాలనాగ్ అనే నామం ఉంది.                        
ఉత్తరాఖండ్ ప్రకృతి సౌందర్యాలకు ఆలవాలము.  
గర్హ్ వాల్ ; హిమానీ నదములకు, యమునానది, యమునోత్రీ నదులకు నెలవులు ఈ కొండలు.
యమునకు ఉపనది తమసా నది, గర్హ్ వాల్ గిరి శృంగములనుండి పారుతూన్నది. ,  ఈ తమసా నుండి అధిక శాతంలో నీరు యమునమ్మకు అందుతూన్నది. తమసా నదికే Tons river అనే పేరున్నూ ఉన్నది.   1
950 లలో టెంజింగ్ నార్గే, మేజర్ జనరల్ విల్లియమ్స్ - హిమశృంగములపైన జెండాను ఎగురవేసి, రికార్డు సృష్టించారు. వారి పర్వతారోహణ యాత్రలో మొదటి బసయే బందర్ పూంఛ్.
बन्दरपूँछ (బందర్ పూంఛ్) గర్వాల్ (Garhwal) గిరి శ్రేణులలో ఉన్న బందర్ పూంఛ్ 1, बन्दरपूँछ 2 - అని
రెండు శిఖరములకు పేర్లు. జంట శిఖరములు తమసా వాహినికి అనుబంధం ఉన్న స్థల గాధలు.

తమసా నది ప్రాముఖ్యత 

కైకేయి భర్త దశరధుని వరములను కోరింది. ఆమె వాగ్దానమును నెరవేర్చడానికి వనవాసము చేయవలెనని శ్రీరాముడు నిశ్చయించుకున్నాడు.
శ్రీరాముడు అర్ధాంగి సీతాదేవి, సోదరుడు లక్ష్మణుడు వెంట రాగా దండకారణ్యములకు బయలుదేరాడు. అరణ్యవాసమునకు బైల్దేరిన తరుణములొ ఆ మహరాజు తొట్ట తొలిసారి విశ్రాంతి తీసుకోవడానికని విడిది చేసిన ప్రాంతం తమసాతీరము. ఒక రాత్రి నిద్ర చేసిన పావన క్షేత్రము ఇది. అందుకే తమసా ఝరి ఇతిహాస వాహిని ఐనది.
తమసా నది. పరిసరములలో క్రౌంచ పక్షుల జంటను కిరాతుడు కొట్టగా చూచిన వాల్మీకి  విలవిలలాడాడు. మొట్టమొదట తటాలున అప్రయత్నముగా ముని నోట వాక్యాలు, లయ బద్ధతతో- సుశ్లోకమైనవి.
ఛందస్సు అనుష్టుప్, రామాయణమునకు శ్రీకారము చుట్టినది ఆ క్షణం.
రాముడు అడవులకు పంపినప్పుడు సీతమ్మ వాల్మీకి ఋషి పర్ణశాలలో ఆశ్రయం పొందినది.
కిలకిలా నవ్వుతూ కుశ లవులు జన్మించిన శుభ సీమ తమస.  వాల్మీకి మహర్షి ఒజ్జ ఆయెను, పిల్లలు జోడీ వినయసంపన్నులైన శిష్యులై, యుద్ధ, కళలలను నేర్చుకున్నారు.
శ్రీమత్ రామాయణ గానామృతమును అందించిన లవకుశుల చరిత్ర మనోజ్ఞమైనది.

*******************************
( words tags twin peak: Bandarpunch, Uttarakhand )
 అఖిలవనిత  ; 711 posts 

No comments:

Post a Comment