Thursday, November 22, 2012

ओम లిపిగా శివ ధనువు



సీతమ్మ కనుబొమ్మలు; స్వర్ణ ధనుసు పోలిక
శివధనువును చిటికెలోన; ఎత్తి, జరిపినట్టి, పూ బోణి  
;                       ఈమేనా? కడు వింత! ||

విల్లుతోనె ముడిపడినది జానకీ జీవితము ;
విలు వంపుల మేని హొయలు నవ రత్న నిధుల విలువెత్తు!
ఆ......! ఔనా? ఆహా ఔనా? ఔనౌనా? || 
స్వయంవరమండపమున
కోటిలోన ఒక్కనిగా; ఆ నడచి వచ్చునది ఎవరే?
నీలమోహనుడు, మేఘశ్యాముడు ఎవరమ్మా, చెప్పమ్మా ||

మునిజననుత, లోక వినుత; శ్రీరాముడు; ఓ చెల్లీ!
అతనే కోదండపాణి, జగదేకవీరుడౌనమ్మా! ||
;

;
విలువేదిక వద్ద కేగి, కాలి బొటన వ్రేలి క్రింద;
లోహ ధనువు నట్టిపెట్టి
నారిని కొన కొమ్ముకు ఒడుపుగాను కట్టబోయె ||
(మన రాములు
సంధించెనొ? సారించెనొ?
ఇటు వింటి నారినీ;
సారించెను దృక్కులనూ 
అటు సీత పైన కాబోలును)  

ఫెళ్ళున విరిగిన దదేమి? 
:        “ఆ ధూర్తుల గర్వమ్ములు!”
ఝలు ఝల్లున + తొణికినవేమి? 
:        “సీత ఎడద మైమరపులు!” 

లోకములకు ఆదర్శప్రాయ దాంపత్యపు సూచిక 
;                                      ఈ ఈశు ధనువు
అది "ఓమ్ కారము - ప్రతిబింబము!

;

;
సీతావరమాలిక లిక శ్రీరాముల గళ సీమలో
ఓమ్ లిపిగా తనరంగా;  
'ओम ओम' 'ओम 
'ओम' 'ओम' ओम'
ఫణి భూషణు భుజములందు సర్పమ్ములు నాట్యమాడె! || 


శ్రీరామ! జయ రామ! జయ జయ రామా!శ్రీరామా!


శ్రీ రామ! జయ రామ! జయ జయ రామా!శ్రీరామా!  
||



సీతావరమాలిక లిక శ్రీరాముల గళ సీమలొ/ లో 

ప్రతి నుడి "మది గడి" చేరును!


శ్రీ రామ! జయ రామ! జయ జయ రామా!
శ్రీ కృష్ణ! జయ క్రిష్ణ! మురళీ గానలోలా!  ||

అష్టమితో ముడివడిన క్రిష్ణయ్య తులిపి చేష్ఠలు;
నవమి వెన్నెలల నవ్వుల శ్రీ పురుషోత్తముడు!
అందరికీ అనుగ్రహించు శాంతీ సంతోషములు ||

కోదండము విలు పట్టిన సాకేత సార్వభౌముడు;
శివ ధనుస్సు ఒక లెక్కా? అవనిజ నిజ పత్ని అగుట
రామాయణ శ్రీకారము! చోద్యమేమి లేదులే!  ||

కొండనెత్తి చిట్టి వ్రేలు పైనెత్తిన గోవిందుడు;
అండ దండ ప్రజకెపుడూ;
స్వామి! నీదు- కైదండ విడువము
నీ భక్తులము మేమయ్యా! ||

జయ రామ!జయ క్రిష్ణ!  ! !!!!
వడి వడిగా వెల్వడును భజనల మధు సవ్వడి
సందడించు మా ఎడదల; జయ రామ!జయ క్రిష్ణ!
ప్రతి నుడి "మది గడి" చేరును; జయ రామ!జయ క్రిష్ణ!
ముడి పడు నాలుక, పెదవులు; కోవెలలే అయ్యేను,
అయ్యారే! విభ్రమము!
;
అధరములు భజన మందిరములు


Tuesday, November 20, 2012

శాణతనములు చాలును!


యోగ నిదుర చాలించి
మాయ తెరలు తొలగించి
నిదుర లేవరా! స్వామీ!మేలుకోవయ్యా!//

లగు బిగువులు చాలును
వగరు, పొగరులు చాలును
పెంకెతనము చూపిస్తే
రాధ నిన్ను కోపించును
జగతి మత్తు వదిలించగ
వైకుంఠవాసా! గీతా రాయ!
మేలుకో! మమ్మేలుకో!

శాణతనములు చాలును
కొంటె తనములు చాలును !
మర్మములు మాని వేసి
రమ్య వేణువును ఊది
లోకములను మేల్కొలుపగ
కరుణాలవాల! దేవ దేవ!
మేలుకో! మమ్మేలుకో!


పల్లవి
యోగ నిదుర చాలించి
మాయ తెరలు తొలగించి
నిదుర లేవరా! స్వామీ!మేలుకోవయ్యా!//
;

శాణతనములు చాలును!
By kadambari piduri, Jan 21 2009 12:17PM
యోగ నిదుర చాలించి
Views (113)

తకిట థోమ్ 'గురు'వాన

రాగమైన వాన, రమ్యమైన వాన
కొంగ్రొత్త రాగమై నిలిచినట్టి 'మైనా'!
ఈ చిరుజల్లు వాన
ముత్యాల వాన  ||

వైనవైనాలుగా తక్కుతూ తారుతూ
కోట్లాది 'ధారల- దారములు' పెనవైచి
గ్రహ గోళ తతులను సంధానపరిచేను||

మేఘాల మాయ తివాచీలనెక్కేసి
హరివిలుల ద్వారాలు దాటివచ్చేను
పుడమిపై అడుగిడిన బంగారు చాన!
వానమ్మ వాన! వయ్యారి వాన! ||      

కులుకు కులుకుల మెలిక నడకలతొ తాను
తైతక్కలాడుచూ, తచ్చాటలాడుతూ
ఋతు నాట్యరాణి విచ్చేసెనండీ!
ఈ ఉర్వితలమునకు ||

మెరుపుల చెలులతో    
తకిట థోమ్ దరువులను
ప్రకృతికి నేర్పేటి "నెరజాణ గురువు"    
మన వర్ష సామ్రాజ్ఞి!  
వానమ్మ వాన! ముచ్చటల వాన! ||  

;

తకిట థోమ్ "'గురువు"'వాన
(00049318 :  కోణమానిని views)
;


Friday, November 16, 2012

పద్మావతి గైకొనుమా హారతి


సకల కళా భూషిత
కలవాణీ! పద్మావతి!
గైకొనుమా హారతి ||

సప్తగిరుల స్వామికి
అనురాగపు దేవేరివి
మీ ఇరువురి దర్శనముల
తరియింతురు భక్త కోటి ||

శరణు కోరి నీ దరిని
చేరిన శిశువులము తల్లి!
వత్సలను లాలించి
పాలించుట నీ ఫణితి ||
;

;పద్మావతి గైకొనుమా హారతి (link: new AvakAya- web magazine)
Member Categories - కోవెల
Written by kadambari piduri
Sunday, 11 November 2012 11:23
;
photo: Vedic goddess (photo link)


Thursday, November 15, 2012

అమ్మకచెల్లా! క్రిష్ణుని చిత్తరువులు!


ఏలాగయినా ఎల్లాగయినా-
ఎల్లరు కూడి; క్రిష్ణుని పట్టాలి-
మా ముద్దుల కన్నని పట్టాలి  ||
;
వ్రేపల్లియలో ఉద్యానముల -
మల్లెల మొల్లల పొదరిళ్ళన్నీ-
వైకుంఠములో ఆదిశేషుని -
మైత్రిని నెరపెను కడు నేర్పుగను
శేషుని పడగల వేషాలూని-
మెల్లగ గుట్టుగ దాచినవేమో?    
దోబూచాటల మన పస పట్టగ (దలచి);
(వానిని) దాచినవేమో? అమ్మకచెల్ల!  ||

నల్లని మోహన బాలుని తోడ -
ఆడే చల్లని వేళలివి! –
దివిలో ఉన్న దివ్య దేవతలు-
పాలపుంతలను మోసుకొచ్చిరి;  
వినీలగగనము  దారులనిండా
పాలపుంతలను గ్రుమ్మరించిరి||

గొల్లభామల వృత్తుల నేర్చిరి-
ఎపుడో గానీ; అమ్మకచెల్లా!
పిల్లగాలులకు పరిమళమ్ములను;
దానము చేసిన మా రాధమ్మకు-
తన ఉల్లము నిండా హత్తుకున్నవి -
అల్లరి క్రిష్ణుని చిత్తరువుల్  
ఎంతటి వరముల భాగ్యములోహో!
లభియించినవి, (మా అమ్ములుకు) అమ్మకచెల్లా||
;



***********************************;

కోణమానిని తెలుగు ప్రపంచం
 34043 పేజీవీక్షణలు - 963 పోస్ట్‌లు, చివరగా Nov 14, 2012న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
అఖిలవనిత
 17939 పేజీవీక్షణలు - 673 పోస్ట్‌లు, చివరగా Nov 9, 2012న ప్రచురించబడింది
బ్లాగ్‌ని వీక్షించండి
Telugu Ratna Malika
 1942 పేజీవీక్షణలు - 109 పోస్ట్‌లు, చివరగా Sep 18, 2012న ప్రచురించబడింది

Friday, November 9, 2012

రెండు చెట్లు, కరింబన చెట్టు


కేరళలోని అలప్పుఝ జిల్లాలో మావెలిక్కారలో "భగవతీ కోవెల" ఆవరణలో
అనేక ఏళ్ళు వయసు ఉన్న చెట్లు ఉన్నవి.
"గంధర్వులకూ, యక్షిణిలకు నివాసము ఈ చెట్లు" అనే నమ్మకము 
ప్రజలలో ఉన్నది.
స్థానిక ప్రజలు ఈ తరువులను పూజిస్తారు.



[ కరింబన చెట్టు:- కరి= నలుపు: 
కర్రి:- --> కారు --> కారు మేఘాలు, కారు మొయిళ్ళు; నల్లని మబ్బులు- అని అర్ధం. 
అలాగే- ఏనుగు నల్లగా ఉంటుంది కాబట్టి "కరి" అన్నారు.
కరింబన వృక్షము- అంటే నల్ల తాటి చెట్టు.
చంపకము చెట్టు]

!!!!!!!!!!!!! !!!!!!!!!!!!! !!!!!!!!!!!!! 

Tags:- 

Chettikulangara Sree Bhagavathi temple 
Karimbana (Black palm tree) Chembakam tree, Varutthu Pokku’
Gandharvas and Yakshis,
mavelikkara, kerala, Alappuzha district