Tuesday, March 31, 2009
చంద్ర హాస (1965)
Tuesday, March 10, 2009
ఆణి ముత్యము
శ్రావణ మేఘములారా!
శ్రావణ మేఘములారా!
! కుప్పతెప్పలౌ జలముల మీ హృదయ కుహరముల
Saturday, March 7, 2009
వ్రత దీక్ష -(౪)
హరి విల్లులు (౩)
- స్వప్న కెరటముల తేలి ఆడెడు
నురుగుల వెల్లువలు తరుణి తలపులు
నా చేతికి అవి దొరకవు!
- సరియ!సరియ!
- ఐననేమి?!
- ఆ బుద్బుదముల విరియు
- కోటి వన్నియల (ను)
- కోమలీ !
- నా కంటి పాపలందున
- ఇంద్ర ధనువు వోలె
- పదిల పరచు కొంటిని నేడు
- నిక్షేపముగా
- ఆ నిక్షిప్తములన్నీ....... కుశలమ్ముగాను
- నాకు.......
- నాకే ............స్వంతము,లెమ్ము!
కాటుక కోటలు
చిరు ప్రశంస - (౧)
పూవుల దొన్నెల (గిన్నెల ) లోన
చల్లని వెన్నెల గంధము లివిగో!
కలువ మిథారీ !
నీ కోసరమే మోసుకు వచ్చిన
ఆ గంధ వాహుని ; మలయ సమీరుని
మెండు (-దౌ ) శ్రమ దమములను
కించిత్తైనా గురుతించవుగా!!!
మంజుల వాణి!
నీ పెదవుల నుండి
చిరు ప్రశంసకు అయినా నోచ లేదు గద!?
పాపం!అతడు!
ఎంతటి మంద భాగ్యుడో ?!'నా వలెనె!!'
'''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
ఈ లీల వెన్నెల హేల
(పల్లవి) ;;;;;;;;;
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
వేళ కాని వేళ ఇది
జాబిలి వెన్నెల హేల
ఈ లీలగ సిరి వెన్నెల
పగలు, రేల పండుగ?!
(అను పల్లవి) ;;;;;;;;;;;;;;;;
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
మేలమాడే 'వలపు తలపు'
బేరమాడే చిలిపి కులుకు//
౨) మలయ మారుత రాగం
వరి పైరుల తేలెనే!
ఏలనే??? ఏలనే??? మౌన రాగము?!//
""పగలు ,రేయి పండగ :
జాబిలి వెన్నెల హేల! ""
౨)మెరయు మంచు ముత్య మొకటి
మల్లె పెదవిపై నవ్వెను
ఏలనే? ఏలనే???మౌన రాగము?!//
""పగలు రేయి -పండుగ!
జాబిలి వెన్నెలల హేల ""
''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''''
ఆమని కులుకొక్కటి - 2
అవనికి దిగి వచ్చినది
ఆమని కులుకొక్కటి!
స-రి-గ-మ-అని పాడినది
విరి మాలిక సౌరభం !//
౧) చూడకు! చూడకు!
ఆ నింగి వైపునకు.
చూసినంత నీ చూపే ,
ఆ వెన్నెల నదిలోన
గూటి పడవగా మారీ
సాగి పోవునేమో!//
౨)బిగి కౌగిలి నీయవే!
బిగి కౌగిలి నీయవే!
నా మేను ఝల్లన -ఝలు ఝల్లన !
నీ కుంకుమ మేని తళుకు
పరిమళాలు విర బూసే
తోట అగును నా ఎడద //
ఒప్పుల కుప్పలు - 1
మోదమో -తన మాటయో?
నాట్యమో-తన నడకయో?
ఏమి వయ్యారం!
ఏమి సింగారం!//
౧)పుప్పొడి దొంగలు ఎవ్వరే? -ఎవ్వరే?
"ఒప్పుల కుప్పల దరహాసాలే!"
౨) చుక్కల లోకం ఎక్కడే?
"మిల మిల లాడే నీ చూపులలో."
౩)కొమ్మల చిగురులు మెసవిన దెవ్వరే ?
"కొమ్మల (=స్త్రీలు) వాలిన కోయిలలే!"
౪)నింగిని పూసిన కుంకుమ లెక్కడ?
"జంకు లేక అవి- నీ చేక్కిలిలో
చేరినాయిలే!ఓ చెలియా!!//
''''''''''''''''''''''