Friday, April 18, 2014

పద్ధెనిమిది బస్తీలు

జైన వ్యాప్తి, కర్ణాటకరాష్ట్రమునకు అద్భుత శిల్ప, సాహిత్య సంపదలను అందించినది.
మూడబిదురు మున్నగు చోట్ల 18 బసిడి లు ప్రాచీన కాలములో ఏర్పడినవి.
మూడు = తూర్పు దిక్కు; బిదురు = వెదురు/ బొంగు;
అలనాడు వెదురు వనములు ఎక్కువగా పెరిగిన ప్రాంతాలు కాబట్టి ఈ ఊరికి అనే పేరు వచ్చింది.

**************,
వింధ్య గిరిలలోని శ్రావణబెళగొల- వద్ద "గో మఠేశ్వర" జైన పుణ్య మూర్తి.
"The White Pond of SrawaNa"  శ్రమణుకుల తెల్లని చెరువు/ మడుగు- అని భావము.
భారీ ఏకశిలావిగ్రహమములో ప్రపంచములో స్థానం ఆర్జించినది.

(బెల = తెల్లని; తెల్లని :
వెల్ల వేయుట , వెలవెల బోవుట, వెలుగు, వెలుతురు -
మున్నగు తెనుగు మాటలకు మూల ధాతువు)

వీర భైరవ, వీర పాండ్య మున్నగు రాజులు ఈ సీమలలో కట్టించిన కట్టడాలు సౌందర్య ప్రతీకలు.
मूलसंघ జైనుల ప్రధాన విశ్రాంతిమందిరములు.
జైన తీర్ధంకరులు 12 AD లో రచించిన తాళపత్రములు అపురూపమైనవి.
వానిని "ధవళ పత్రములు" ( White Texts ) అని పిలుస్తున్నారు,
అవి నేటికీ భద్రముగా ఉన్నవి.

**************,

కర్కాల్ :-

పాండ్య నగరి, కరికల్లు, కర్కాల- అనే నామ క్రమములు ఈ కర్కాల్ బస్తీవి.        
ప్రసిద్ధమైన వేణుగోపాలుని కోవెల ఉడిపి కి దగ్గరలో ఉన్నవి.
కర్కాల అనగా - తుళు, కన్నడములలో "నల్లరాయి" అని అర్ధం.
 వీర భైరవ, వీర పాండ్య మున్నగు రాజులు ఈ సీమలలో కట్టించిన కట్టడాలు సౌందర్య ప్రతీకలు.
ప్రసిద్ధమైన వేణుగోపాలుని కోవెల ఉడిపి కి దగ్గరలో ఉన్నవి మూడబిదురు, కర్కాల.
కర్కాల అనగా - తుళు, కన్నడములలో "నల్లరాయి" అని అర్ధం.

బస చేసే వసతి కలిగినవి “బసడి” అనవచ్చును.
వీరపాండ్య చక్రవర్తి స్థాపించిన “బాహుబలి” విగ్రహము సుప్రసిద్ధమైనది.
కర్కాల గ్రామములోని పెనుశిలపైన ఈ మూర్తి నెలకొని ఉన్నది.

**********************,

{కర్కాల లో ప్రసిద్ధ కన్నడ కవి ముద్దన జన్మించారు.
మునిమాణిక్యం తెలుగు సాహిత్యానికి "కాంతం కథలు" అమ్దిమ్చారు.
అలాగే ముద్దన సృజన "మనోరమ" కన్నడములో వాసికెక్కినది.}

***********************
శీర్లల్ village 

కొత్తగా ప్రతిష్ఠ చేసిన విగ్రహములకు "కాలాభిషేకము", "మహా కాలాభిషేకము" ఇత్యాది కార్యక్రమాలను నిర్వహిస్తారు.
భగవాన్ ఆది నాధ, భరత్, బాహుబలి ల భారీ విగ్రహములను శీర్లల్ పల్లెలో శాస్తోక్తముగా ప్రతిష్ఠించినారు.
శీర్లల్ పల్లె వద్ద 2013 ఫిబ్రవరిలో "కాలాభిషేకము", "మహా కాలాభిషేకము" భక్తులు
పదికాలాలపాటు అందరికీ గుర్తు ఉండేలా చేసారు.
శీర్లల్ కుగ్రామములో శ్రీ అనంత నాధ స్వామి బసడి 400 ఎకరములలో ఉన్నది.

&&&&&&&&&&&&&&&&&&&

#1) basa chEsE wasati kaliginawi “basaDi” anawachchunu.
2) weerapaamDya chakrawarti sthaapimchina “baahubali” wigrahamu suprasiddhamainadi. karkaala graamamulOni penuSilapaina I mUrti nelakoni unnadi.
3) bhagawaan aadi naadha, bharat,/ la bhaarii wigrahamulanu SAstOktamugaa pratishThimchinaaru.

kottagaa pratishTha chEsina wigrahamulaku "kaalaabhishEkamu", "mahaa kaalaabhishEkamu" ityaadi kaaryakramaalanu nirwahistaaru.
Siirlal palle wadda 2013 phibrawarilO "kaalaabhishEkamu", "mahaa kaalaabhishEkamu" bhaktulu padikaalaalapaaTu amdarikii gurtu umDElaa chEsaaru.
uDipi mamDalamulOni mamguLUru 70 ki. em. duuraana unna  samiipamlO unna graamamu idi.
Siirlal kugraamamulO SrI anamta naadha swaami basaDi 400 ekaramulalO unnadi.  mastakaabhishEkamu" jariginawi.#

{Tags:- 18 బసిడి, 18 Basidis ;
MuuD bidri , Shiirlal willage, 70 KM fram UDupi }
;
సేకరణ;  చైత్ర కోణమానిని

Tuesday, April 8, 2014

కోతి తోక, తమసా నది

“బందర్ పూంఛ్” - అనే కొండ శిఖరం ఉత్తరాఖండ్ లో ఉన్నది.
హిమాలయ పర్వతశ్రేణిలోని అంతర్భాగం ఇది.  బందరు అంటే కోతి అని తెలిసిన సంగతి కదా!
బందర్ పూంఛ్ అంటే "వానర వాలము" అని అర్ధం.
దీనికే "శ్వేత శిఖరము"/White peak అనే నామం కూడా ఉన్నది.
ఆ దగ్గరలోని ఇంకో శిఖరానికి నల్ల శిఖరం/ కాలనాగ్ అనే నామం ఉంది.                        
ఉత్తరాఖండ్ ప్రకృతి సౌందర్యాలకు ఆలవాలము.  
గర్హ్ వాల్ ; హిమానీ నదములకు, యమునానది, యమునోత్రీ నదులకు నెలవులు ఈ కొండలు.
యమునకు ఉపనది తమసా నది, గర్హ్ వాల్ గిరి శృంగములనుండి పారుతూన్నది. ,  ఈ తమసా నుండి అధిక శాతంలో నీరు యమునమ్మకు అందుతూన్నది. తమసా నదికే Tons river అనే పేరున్నూ ఉన్నది.   1
950 లలో టెంజింగ్ నార్గే, మేజర్ జనరల్ విల్లియమ్స్ - హిమశృంగములపైన జెండాను ఎగురవేసి, రికార్డు సృష్టించారు. వారి పర్వతారోహణ యాత్రలో మొదటి బసయే బందర్ పూంఛ్.
बन्दरपूँछ (బందర్ పూంఛ్) గర్వాల్ (Garhwal) గిరి శ్రేణులలో ఉన్న బందర్ పూంఛ్ 1, बन्दरपूँछ 2 - అని
రెండు శిఖరములకు పేర్లు. జంట శిఖరములు తమసా వాహినికి అనుబంధం ఉన్న స్థల గాధలు.

తమసా నది ప్రాముఖ్యత 

కైకేయి భర్త దశరధుని వరములను కోరింది. ఆమె వాగ్దానమును నెరవేర్చడానికి వనవాసము చేయవలెనని శ్రీరాముడు నిశ్చయించుకున్నాడు.
శ్రీరాముడు అర్ధాంగి సీతాదేవి, సోదరుడు లక్ష్మణుడు వెంట రాగా దండకారణ్యములకు బయలుదేరాడు. అరణ్యవాసమునకు బైల్దేరిన తరుణములొ ఆ మహరాజు తొట్ట తొలిసారి విశ్రాంతి తీసుకోవడానికని విడిది చేసిన ప్రాంతం తమసాతీరము. ఒక రాత్రి నిద్ర చేసిన పావన క్షేత్రము ఇది. అందుకే తమసా ఝరి ఇతిహాస వాహిని ఐనది.
తమసా నది. పరిసరములలో క్రౌంచ పక్షుల జంటను కిరాతుడు కొట్టగా చూచిన వాల్మీకి  విలవిలలాడాడు. మొట్టమొదట తటాలున అప్రయత్నముగా ముని నోట వాక్యాలు, లయ బద్ధతతో- సుశ్లోకమైనవి.
ఛందస్సు అనుష్టుప్, రామాయణమునకు శ్రీకారము చుట్టినది ఆ క్షణం.
రాముడు అడవులకు పంపినప్పుడు సీతమ్మ వాల్మీకి ఋషి పర్ణశాలలో ఆశ్రయం పొందినది.
కిలకిలా నవ్వుతూ కుశ లవులు జన్మించిన శుభ సీమ తమస.  వాల్మీకి మహర్షి ఒజ్జ ఆయెను, పిల్లలు జోడీ వినయసంపన్నులైన శిష్యులై, యుద్ధ, కళలలను నేర్చుకున్నారు.
శ్రీమత్ రామాయణ గానామృతమును అందించిన లవకుశుల చరిత్ర మనోజ్ఞమైనది.

*******************************
( words tags twin peak: Bandarpunch, Uttarakhand )
 అఖిలవనిత  ; 711 posts 

Tuesday, March 11, 2014

శశాంకునికి మనవి ఒకటి!

;
చంద మామ! చంద మామ! చందమామా!
ఎందు దాగి ఉన్నావు చంద మామా!  ||చంద మామ||

చిన్ని పాప మారాములు చేసెనోయీ!
అన్నమింత ముట్ట లేదు,అంట లేదు!
కారు మబ్బున దాగున్న చంద మామా!
మా పాపకుగోరు ముద్ద తినిపించగ వేగ రావోయీ!  ||చంద మామ||

ఆట బొమ్మలంటేను వెగటేసేను
నే- పాట పాడ "విననంటూ" హఠము చేసేను!
"అమావాస్య మఠము నుండి "చంద మామా!
మా అమ్మాయి కొఱకు రావయ్యా! - హఠమును మాని!  ||చంద మామ||

***************************,

22 ఫిబ్రవరి 2009 ఆదివారం
ఓ జాబిల్లీ! దిగి రావోయి! 2009 phibrawary (Link: కోణమానిని)


నాకు ఇష్టమైన పాట ఇది. నేను రాసిన అనేక బాలగీతాలలోని ఈ పాట, "ఆంధ్రప్రభ" వార పత్రికలో అచ్చు ఐనది.
మళ్ళీ మక్కువతో ఈ గీతబ్లాగింగు ఇప్పుడు.

నేను బ్లాగును మొదలు పెట్టిన కొత్తలలో సరిగా చేతకాక బ్లాగులో వేసిన పద్ధతి, తేడాను బ్లాగు పాఠకులు
గమనించగలరు.
***************************,

naaku ishTamaina paaTa idi. nEnu raasina anEka baalagItaalalOni I paaTa, "aamdhraprabha" waara patrikalO achchu ainadi.
maLLI makkuwatO I giitablaagimgu ippuDu.

nEnu blaagunu modalu peTTina kottalalO sarigaa chEtakaaka blaagulO wEsina paddhati, tEDAnu gamanimchagalaru.

Wednesday, February 12, 2014

మేలిమి బంగరు అక్షింతలు

పల్లవి:   
ముగ్గులు వేసిన గుమ్మములోన
చిందులు వేయును ముద్దుల గుమ్మడు  ||              

"కన్నయ్యా! ఈ అల్లరి ఏలర?                                     
వల్ల మాలిన రభసలు చేతువు, ఎలాగ?                                 
అడ్డూ ఆపూ లేని తుంటరివి!"                                
అన్న యశోదకు బదులుగ కన్నయ,  

"నా చిరునగవులతో ,
కొత్త ముగ్గులను                                  
తీగపూవుల 'రంగవల్లికల'                                         
తీర్చిదిద్దుతానో అమ్మా!"
                                                
అంటూ ,కృష్ణుడు   
"రభస"ను కాస్తా                                              
"రాసలీలల రా సభ" గాను   
తృటి కాలములో మార్చెను,ఔరా!                                  
తరుణుల్లారా! తిలకించండి! 
రాజు కొలువును 
రమణుల్లారా! 
మోదమ్మలరగ 
వీక్షించండి, 
సంకురాత్తిరి పండుగకివియే
లక్ష కోటుల మేలిమి బంగరు అక్షింతలు కదా!
;













***************************,
;
రాస లీలల రాజ సభ / నవ్వుల ముగ్గులు;1/18/2009 10:40:00 PM , Labels: బాల కవితా గీతికలు
సంకురుమయ్యకు స్వాగతము;నాట్యము చేసీ నటరాజ;
వెన్నెల రథము; మలబరి చెట్లు,చీనాంబరములు;
కుంకుమ భరిణలు, సంకురుమయ్యకు స్వాగతము;
కరచాలనము; చుక్కలతో స్నేహము; మామ కాని మామ,
1 జాబిలి చాలా తపములు చేసెను;
ఆటపట్టు; 1) ముద్దుల మూటలు - కట్టును మాటలు;
1) తళుకు తళుకు చుక్కలు; మిణుకు మిణుకు చుక్కలు;
విన్నపములు 1; "ఆట పట్టు " (విన్నపములు);
విన్నపములు 2; విన్నపములు 3;
1) లాహిరి ! లాహిరి! వీల పాటలను;
వెన్న పూసల దండలు; సీతాకోక చిలకలు:
1) సీతా కోక చిలకమ్మలు ; వచ్చేసాయి! వచ్చేసాయి!;
మల్లికా! మల్లికా! ఈ పూ దోటకు కానుకా!;
;

;
జాతీయ పక్షి; 1)కన్ను కన్ను నెమలి కన్ను; మరకత మణులు:
1) కిల కిల నవ్వులు, సందడులు; పిల్లలు, పాపలు ;
పుడమిని ముదముల సార్వ భౌములు!:
1)వెన్నెలా! వెన్నెలా! - మిన్నుల్లొ వెన్నెల; కన్నుల్లొ కురియగా - కాణాచి వెన్నెల;
హరి విల్లు బహుమతి;
1)బాల బాలికలు రావాలి!; ఆటలు పాటలు విర బూయాలి! మూతీ ముక్కూ విరుపులు మాని
ప్రకృతి గీతికి "పల్లవుల"వాలి!;
"భూమి పుస్తకము"; అమ్మలు నవ్వులు:
1)కెంపులు,రవ్వలు,రతనాలు - కొత్త మెరుపులు ,
మిరుమిట్లు; మణులు,మాణిక్యము - పగడాలు,ప్రవాళ అందాలు;
వెన్నెల రేడా!; ఉయ్యాలోయ్! ఉయ్యాల!;
1)బోసి నవ్వుల బాపు,నోటి: నుండి వచ్చినదె వాక్కు;
తాను:పలికిన పలుకు ;జవ దాటనట్టి; అపర ఋత్విక్కు;
మంగమ్మ చూపులే రంగారు బంగారు;("సప్తగిరి" పత్రిక); (జనవరి ,2009 పత్రిక లో ప్రచురణ) ;
వెలుగుల నవ్వులు; బాల బాలికల కిల కిల నవ్వులు;
ఆటలు, పాటలు -సందడి హేలలు;
ప్రకృతి అంతా - నవ రస భరితం; అలరించే బృందావని; వన్నెల పరిమళ పూవులము!;

కోణమానిని బ్లాగును మొదలుపెట్టిన కొత్త, నాటి రచనల ముద్రణ రూపాలు ఇవి.   J    

కోణమానిని 2009 Fibruary - January   (Link my Blog)

4 ఫిబ్రవరి 2009 బుధవారం

జూకాలు - సంకురుమయ్యకు స్వాగతము 
(konamanini : views: 54927)

Thursday, December 19, 2013

ఎంత సేపు ఈ ఎదురుతెన్నులు

ఎంత సేపు ఎంతసేపు ఎంతసేపనీ:
ఎదురు చూస్తు ఉండాలి!?
ఈ తీరుగనే గోపాలక్రిష్ణ! ||ఎంత సేపు ||
;
ఎద నిండా ఆరాటం, ఏవేవో సంశయాలు,
దోబూచులు దొంగాటల మేటివి ఎటులైనావని?
;
నీదు వామ హస్తమున  పాంచ జన్యమున్నది గద!
మా శంకలను తీర్చుమోయి?
శంఖు తీర్ధ ప్రసాదములు భక్త కోటి కందును గద!?||ఎంత సేపు||
;
నిరతము నీ కరము నుండు;
కౌమోదకము స్థితియె మేలు-
మా కన్నను కద! కన్నా! ||ఎంత సేపు ||
;
ఆర్త రక్షకుడవనుచును
నీకు గొప్ప బిరుదములు;
తోచి తోచకుండా; మము వేపుట నీ మరియాదా!?
సరి సరి! ఓ మురారీ! బర్హి పింఛధారీ! ||ఎంత సేపు ||
;
అవతారము లెత్తు విద్య మాకు; కాస్త నేర్పుమోయి!
నీ చెంత నుండు భాగ్యముకై;
విల్లుగానొ, దండగానొ, ఏదో ఒక వస్తువుగా;
నీ ఎడదపైన నుందుమోయి!
మేముందుమోయి! ||ఎంత సేపు||

*****************************;

పాట:- భక్తుల విన్నపములు!!!!!!!

[1. నీదు ఎడమ చేతిలోన/
    వామ హస్తము= ఎడమ చెయ్యి
    దక్షిణ హస్తము= కుడి చేయి ]

౧ ౨ ౩ ౪ ౫ ౬ ౭ ౮ ౯ ౧೦ ౧౧ ౧౨ ౧౩ ౧౪ ౧౫ ౧౬ ౧౭ ౧౮ ౧౯      

విజ్ఞానపు పసిడి మేడ!

Krish, Fancy Dress 


 బుడుగు బుడుగు పిల్లలార!
 రండి!రండి! స్కూలుకు
  అమ్మ నాన్న 'చిటి వేళ్ళను పట్టి
  రండి! రండి! బడికి;
             అక్షర గుడికి
             మీరందరు సత్వరమే!     ||

  చెడుగుడు గుడు గుంచం
  ఆటలంత తేలిక!
        అక్షరాలు నేరిస్తే
        ఉంటుందెంతెంతొ మజా!
               అది,విజ్ఞానపు పసిడి మేడ!     ||

                    ''''''''''''''''''''''''''''''''''

కిట్ కాట్ పేరెలాగ వచ్చింది?   (Link: See Essay: kONamaanini )
గురువారం 19 డిసెంబర్ 2013

ఆధార పదాలు:-
KitKat club, an 18th-century literary salon in Christopher Catling's
(hence the "Kit Cat") pie-house
in Shire Lane, 

Friday, September 6, 2013

dozen ఆనుపానులు

అర్ధణా,  అణా, బేడ- అనే కాయిన్లు నా చిన్నప్పుడు ఉండేవి.
పైస, దమ్మిడీ, కాణీ లు – ఒక పైస విలువ – తొలి ద్రవ్యం.
పిల్లలు కాణీలను (రాగి లోహంతో తయారు ఔతూండేవి)
చూపుడు వేళ్ళకు తగిలించుకుని, వెళ్ళి చిరుతిళ్ళు కొనుక్కునేవారు.
ఒక కానీకి ఒక నువ్వు జీడీ- వచ్చేది. ఆ చిన్ననాటి ముచ్చట్లు తలుచుకుంటే బహు ముచ్చట!                      

! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! ! !
మన దేశంలో దశాంశ పద్ధతి ముఖ్యంగా అనుసరించబడేది.
వస్తుమారక వినియోగ సందర్భాలలో, పదార్ధాలను తులలో తూచేటందుకు- ఒక ప్రామాణికతను ఏర్పరచవలసివచ్చింది.
తూనికలు, కొలతల కొఱకై // పద్ధతిని నిర్మించినారు. దీనికే "మెట్రిక్ పద్ధతి" అని పేరు. దశాంశ పద్ధతిని అక్టోబర్ 1 1958 లో ప్రవేశపెట్టి ఉన్నారు.
అల్తే దశాంశ పద్ధతి- లాగానే- ప్రాచీనకాలమున భారత దేశములో అభిమానించబడిన కొలమానము, "నవ్"= 9 - అనే నెంబర్.
నవమి తిథి, నవ నందులు, ఇత్యాదులు
×××××××××××××××××××××××××××××××××

అర్ధణా,  అణా, బేడ- ఈ గుణాంకములలో ఉన్న విశేషం ఏమిటో మీరు కనిపెట్టారా?
3, 6, (9), 12 అనే అంకెలు వీటికి మూలములు.
కాల గణనము- అధిక శాతం 6 పైన ఆధారపడి ఉన్నది.
చాంద్రమానము ఈ లెక్కలకు మూల స్తంభము.      
మూడు- ఆరు ఋతువులు, సీజన్లు, 12 నెలలు, ప్రధానంగా ఈ పరిగణనలు సాగుతూన్నవి.
సాంప్రదాయ, ఆచారములు, పండుగలు సైతము వీని ప్రకారమే ఏర్పరచబడినవి.
12 పవిత్ర నదులు, వాటిక్లో పుణ్య స్నానాలు- “పుష్కరము” – అంటే
“12 సంవత్సరములకు ఒకసారి వచ్చే పండుగ”.
ప్రాజ్ఞులు ప్రతి పన్నెండు ఏళ్ళకు ఒక సారి ఈ వేడుకలను –
పుష్కర కాలములో– వచ్చేలా – ఏర్పరిచారు.
×××××××××××××××××××××××××××××××××

బేడ = 12 నయా పైసలు. దుకాణములలో పళ్ళు కొనేటప్పుడు వి
క్రయదారుని ఏమని సాధారణంగా అడుగుతూంటారు?
ముఖ్యంగా అరటిపళ్ళ అంగడిలో  కొనేటప్పుడు అడిగే వాడుక మాట ఏమిటి?
“డజను ఎంతకి ఇస్తావు?” మన ఆంధ్రులు అచ్చ తెనుగులో -  అరటిపళ్ళు క్రయ విక్రయాలలో మాత్రం కొన్ని స్పెషల్ వర్డ్సు అగుపడుతూంటాయి! “హస్తం” = పండ్రెండు కదళీ ఫలములు. “అమడపళ్ళు” = జతగా ఉండే అరటిపళ్ళు. పన్నెండింటికి ఒక పండు ఉచితంగా ఇవ్వాలనేది- అవగాహనా ప్రధానంగా ఏర్పడిన  రూలు. దీనినే “కొసరు” అని   పిలుస్తారు. భోజనాల వేళ-  “కొసరి కొసరి వడ్డించుట” అనే తీపి జాతీయం కూడా ప్రయోగంలో ఉండేది. (ఇవన్నీ ఆనాటి ముచ్చట్ల మాటలే లెండి!)
మరి “డజను”  అనే పదము ఎక్కడి నుండి వచ్చి మన ద్రవ్య సీమలోనికి అడుగిడింది?
సంస్కృత భాష మన తెలుగుకు ఎన్నెన్నో పదముల పుష్పాలను ఒసగింది. అలాగే సరిహద్దు రాష్ట్ర భాషలైన - ఒరియా, కన్నడము, తమిళము,  మరాఠీ   భాషల నుంచీ, అలాగే రాజభాష ఐన హిందీ నుండి సైతము  “లెక్కలేనన్ని మాటల తొలకరి జల్లులతో” త్రిలింగ భాష ఐన తెలుగు సీమ ఓలలాడినది. ఉర్దూ, చాలా ఇంగ్లీషు  పలుకులు – తెలుగుతల్లి ఒడిలోకి చేరి  కేరింతలాడుతూన్నవి.
*********************;
“Dazon” అనే మాటను మనము ఏ భాష నుండి స్వీకరించినాము?
ఈ నుడికారము అటు కన్నడము నుండైనా కావాలి, ఇటు ఉర్దూ, పార్శీ, హిందీల నుండి ఐనా అవ్వాలి?
కానీ చిత్రంగా- ఈ నామము- ఫ్రెంచి లాంగ్వేజ్ లోనిది.
“ద్వాదశ” = 12.
మనకు మల్లేనే ఫ్రాన్సు దేశ ప్రజలు కూడా “12” ను కేంద్రముగా వ్యావహారిక లెక్కలను వాడేవారు.
"డజను” కి లఘు రూపం- doz, dz
కాలములు, పండ్రెండు మాసాలు, ఈ పగిదినే- ఏడాదికి- మున్నూట అరవై రోజులు;
దాదాపు సమయ నిర్ధారణలన్నీ ఈ “అర డజను”, "డజను” - ల మీదనే ఆధారపడి – ఖగోళ  శాస్త్రవేత్తలు సిద్ధం చేసిరి. సిరి! సిరి!
×××××××××××××××××××××××××××××××××

మెసపొటేమియా దేశస్థుల sexagesimal నుండి – యూరోపీయులు -ఈ గణితమును పుచ్చుకుని ఉండవచ్చును. ఇలాగ ద్వాదశ ఆధారిత సంఖ్యా గణనమును “ duodecimal system/ dozenal” అనే సాంకేతిక నామాలు కలవు.
ఇక మన సీమలో- “16 అణాల తెలుగుదనం ఉట్టిపడ్తూన్నది” అనే నుడికారం ఉన్నది.   బండి మీద పళ్ళు అమ్మకానికి వచ్చినప్పుడు, పదిరెండు- కు ఒకటి కొసరు ఇవ్వడం” ఆనవాయితీ మనకు కనపడ్తుంది.
తమాషా ఏమిటంటే- యూరోప్ లో కూడా ఈ అలవాటు ఉన్నది.
“బేకర్స్ డజన్” (A baker’s dozen) అంటే
12 కి బదులుగా- కాస్త చేతి బారుగా “13”  ఉరుములను ఇవ్వడమే!
కాస్త కొసరును ఇచ్చే ప్రక్రియకు "బేకర్స్ డజన్" అనే పేరు కలిగినది.
13 వ శతాబ్దం నాటిది ఈ వాణిజ్య సదుపాయము.
×××××××××××××××××××××××××××××××××

3, 6, 9 అంకెల ఆధారముగా ఏరియాలనూ, పొలాలనూ, స్థలాలనూ కొలుస్తూన్నారు.
అడుగులు, అంకణములు, గజములు- మొదలైన కొలతలు-
గుంటూరు, మధ్య ఆంధ్ర జిల్లాలలోనూ, దక్షిణాంధ్ర ప్రాంతాలలో ఇప్పటికీ ఉపయోగితమౌతూన్నవి
ఉదాహరణకు:- 72 ఫీట్సు ఒక అంకణము – ఈ పద్ధతితో అన్నమాట!

×××××××××××××××××××××××××××××××××
9వ ఎక్కంలో ఒక తమాషాను గమనించండి.
అంకెలను కూడితే మళ్ళీ "తొమ్మిది" మాత్రమే వస్తుంది.
ఇలా వచ్చేది ఈ "నవ సంఖ్య"కు మాత్రమే!
ఉదాహరణకు :-
9×1= 9;
9×6= 54:

54- లోని రెండు అంకెలనూ కూడి చూస్తే- తొమ్మిది- ఔతుంది.
5+4= 9;
ఇలాగే ఆ Nine ఎక్కము అంతా వస్తుంది.

×××××××××××××××××××××××××××××××××









 పది పైసలు; కాలక్షేపం కబురులు;  (ఫోటో లింక్ )
1 Gajam = 1 Sq Yard = 9 sq feet  ఫీట్సు ఒక అంకణము
9 చదరపు ఫీట్లు= 1 గజము
1 Acre = 100 cents/0.405 hectares/605 Ankanas
1 cent = 6.05 Ankanas/48 Sq.Yards
1 Ankana = 8 Sq. yard/      
72 Sq. Feet ( 72 ఫీట్సు ఒక అంకణము)
1 Sq. Yard = 9 Sq.Feet  ;  
             

Saturday, August 17, 2013

సీతమ్మ వారి జడ కుచ్చుల పూలు

సీతమ్మ వారి జడ కుచ్చు పూలు; 
మా తోటలోన  విరబూసినాయి;
మహ మంచిపువ్వులు; ఈ సీతమ్మ పూవులు;  || సీత ||  
;   
ముఖమల్లు పూలు, మెత్తన్ని పూలు; 
మహమల్లు పూలు, మహరాణీ పువ్వులు
మహలులందందున మురిపించే మెత్తన్ని పూలు ; 
మహ మంచి ఈ సీతమ్మ పూవులు  || సీత ||
;
సూర్య కాంతి మెరసేటి సొంపైన పువ్వాయిలు;          
పూరేకులన్నీ వెల్వెట్టు జారు; 
గుడిసెలందు, వాడలందు, గుడి ఆవరణలలోన; 
వీధులందు, అరుగు పక్క; అందాలై జాల్వారు;  || సీత ||    
;
మిసిమి కోమలమ్ములీ ఏక దళ పుష్పములు ;   
చూడ చూడ ; కిత కితలౌ - ద్వి దళముల సౌరులు; ;  
సీతమ్మ నవ్వులకు చక్కనైన గూళ్ళు || సీత ||    
పువ్వుల్లు తల్లి మొక్క కెంతో మోదమ్ములు; 
కొమ్మ కొమ్మన పూసిన సన్నాయి లోలె  
తోచేను ఈ సీతమ్మ జడ గంటల పూలు || సీత ||         
;
ఈ మొక్క శ్రీరామ చంద్రులకు; 
మనసారా ఇచ్చేనీ మనసైన పుష్పాలను; 
ఈ సీతమ్మ జడ కుప్పెపూలు ||  


************************************,


;


;
సీతమ్మ జడ గంటల పూలు;

53032 -  konamaanini views;

Wednesday, July 31, 2013

మహాత్మా గాంధీ రంగోలీ playing

రంగోలీ(रंगोली)  అరుదైన ఫొటో, చూడండి.
మహాత్మా గాంధీజీని ప్రజలు హోలీ వేడుకలతో రంగుల ఆటలు ఆడారు.
ఆ సరదాలను ఏ చేతి కెమేరా చిత్రబద్ధం చేసిందో గానీ, మనకు ఈ ఛాయాచిత్రం లభ్యమైనది.
;
























రంగోలీ Gandhi Mahatma रंगोली : : 

Tuesday, July 30, 2013

వసుంధరకు వైభోగం



ఇద్దరిని ఉన్నాము మనము: 
అద్దరిని ఉన్నాడు స్వామి!
సాగుదాము అందరమూ;
మనమందరమూ;  || 
బైలుదేరుదాము, రండి! - 
అద్దరిని ఉన్నాడు స్వామి!
స్వామి దరికి చేరుదాము; ||

వసుంధరకు వైభోగం; 
సదా అలంకారములే! 
ఎలాగెలాగెలాగ? 
ఆ భోగము రహస్యాలు 
అవి ఏలాగున, చెప్పండి! ||

వసుంధరకు వైభోగం; 

సదా అలంకారములే!  ||


ఆ ఆరునొక్క గిరులలోన; 
విరుల దండ వోలె ఉన్నవిలే!
ఏమిటవి? ఏమిటవి? 

( స్నేహితులు):- 
విరిబోణి నగవుల సిరులు అవ్వి; 
నవ్వు పువుల చెలువమ్ముల- 
పూజలను గైకొను మా తిరుమలపతి! 
నారాయణ! |నమో నమో! ||
కుడి ఎడమల; సతులిరువురు;
శ్రీదేవి, భూదేవి! 
మువ్వురినీ ముచ్చట కన: 
ముక్కంటికి తరమౌనా? 
ఆ సహస్రాక్ష- ఇంద్రునికీ సాధ్యమౌన? || 

నారాయణ! |నమో నమో! 
నమో నమో! నారాయణ! | || 

భక్త కోటి సునయనముల 
లబ్ధి దొరికి ఉన్నాది;
ఇన్ని కోట్ల కనుల నిధులు
వసుంధరకు వైభోగం



****************************;

#iddarini unnaamu manamu: 
saaguna manamamdaramuu; 
bailudErudaamu, ramDi! - 
addarini unnaaDu swaami!
swaami dariki chErudaamu; ||
 snEhiitulu:- 
aa aarunokka girulalOna; 
wirula damDa wOleunnawilE!
EmiTawi? 2;  = 
wiribONi nagawula sirulu awwi; 
nawwu puwula cheluwammula- 
puujalanu gaikonu maa tirumalapati! naaraayaNa! |namO namO! ||
kuDi eDamala; satuliruwuru; SrIdEwi, bhuudEwi! 
muwwurinii muchchaTa kana: mukkaMTiki taramaunaa? 
sahasraaksha- imdrunikii saadhyamauna? || ||
bhakta kOTi sunayanamula labdhi doriki unnaadi;
inni kOTla kanula nidhulu la
wasumdharaku waibhOgam
 
****************************;

 Song 2:-


valla maalina kOpamElanayyaa!
challanayyaa! taalmi daalchumu
bulli pedavula navvu chiMdiMchu!         ||

challa kuMDala pagula koTTi
golla BAmala nallareDataavu;
olla kuMDaga lEvidEmayyaa!
pollu pOnI chilipi nI sommu        ||

hari chaMdanamulanu challa mannaavaa
“mannaaru dEvaa”!
siri - vaalu chUpula tEru nekkEvaa!      ||  

{Thursday, July 15, 2010
akhila wanita
చతురతల దొర }

****************************;

Sunday, July 21, 2013

ఎంత సేపు ఎదురు చూస్తు ఉండాలి!?

ఎంత సేపు ఎంతసేపు ఎంతసేపనీ:
ఎదురు చూస్తు ఉండాలి!?
ఈ తీరుగనే గోపాలక్రిష్ణ! |||ఎంత సేపు ||
;
ఎద నిండా ఆరాటం, ఏవేవో సంశయాలు,
దోబూచులు దొంగాటల మేటివి ఎటులైనావని?
;
నీదు వామ హస్తమున  పాంచ జన్యమున్నది గద!
మా శంకలను తీర్చుమోయి?
శంఖు తీర్ధ ప్రసాదములు భక్త కోటి కందును గద!?||ఎంత సేపు||
;
నిరతము నీ కరము నుండు;
కౌమోదకము స్థితియె మేలు-
మా కన్నను కద! కన్నా! ||ఎంత సేపు ||
;
ఆర్త రక్షకుడవనుచును
నీకు గొప్ప బిరుదములు;
తోచి తోచకుండా; మము వేపుట నీ మరియాదా!?
సరి సరి! ఓ మురారీ! బర్హి పింఛధారీ! ||ఎంత సేపు ||
;
అవతారము లెత్తు విద్య మాకు; కాస్త నేర్పుమోయి!
నీ చెంత నుండు భాగ్యముకై;
విల్లుగానొ, దండగానొ, ఏదో ఒక వస్తువుగా;
నీ ఎడదపైన నుందుమోయి!
మేముందుమోయి! ||ఎంత సేపు||
;

********************************;

పాట:- భక్తుల విన్నపములు!!!!!!!

[1. నీదు ఎడమ చేతిలోన/
    వామ హస్తము= ఎడమ చెయ్యి
    దక్షిణ హస్తము= కుడి చేయి ]

Saturday, May 25, 2013

గిన్నెలని క్లీన్ చేసే 'కిల్మోరా' చెట్టు

“కటార్ మల్ కోవెల” కు సంబంధించిన ఆచారములలో ఒక మొక్కకు అవినాభావ సంబంధం ఉన్నది.
కిల్మోరా చెట్టు వలన ఆ ఊరికి కూడా పేరు వచ్చింది. తరువు హిమాలయములలో గుర్రం జీను ఆకారములో ఉన్న ఉపరితలమున ఈ చెట్టు పెరుగుతున్నది.
నిట్టనిలువుగా కోసుగా ఉన్న కనుమ లాంటి ఆ చోట కిల్మోరా వలన “కిల్మోరా” అనే పేరు వచ్చింది.
బ్రిటీషు వారు పాలించే రోజులలో పాశ్చాత్య ఉచ్చారణలో క్రమేణా “అల్మోరా” గా మారిపోయింది.
కోశీ/ కౌశిక్ నది, సూయల్/ శాల్మలీ నది
ఈ గ్రామము వద్ద ప్రవహిస్తూ, పాడిపంటలకు, పచ్చదనముతో
ప్రకృతి విలసిల్లే ఆహ్లాదకర వాతావరణానికి హేతువులౌతూన్నవి.
ఆల్మోరా జిల్లా హరితభరిత సౌందర్యాల రాశి, హిమగిరులలోని ఖగ్ మారా కొండలు
(Khagmara hills)సందర్శకులకు, ట్రెక్కర్స్ ని ఆకర్షించే దర్శనీయ స్థలములు.

************************;

ఇంతకీ కిల్మోరా కథాకమామిషూ ఏమిటి?

వంగ పండు రంగు కలిగిన పుష్ప ఫల భరిత వృక్షము కిల్మొరా. 

ప్రాచీన కాలములో ప్రజలు - కతర్ మల్ గుడిలో- పాత్రలను శుభ్రం చేయడానికి-
ఈ కిల్మోరా చెట్టును ఉపయోగించే వారు.
మన దేశములో - పుణ్య క్షేత్రములో, ఆలయములోని గిన్నెలు,
తదితరములను పరిశుభ్రం చేయడానికై ఒక చెట్టు భాగాలను వాడటం-
బహుశా ఈ "అల్మోర"  (పాత నామం- కిల్మోరా)లో మాత్రమే మనకు కానవస్తూన్నది.
Koshi, (Kaushiki), and Suyal (Salmale)

******************************************;

ఉత్తరా ఖండ్ కి కలికితురాయి “ఆల్మోరా” మండలము.
నండదేవి దేవాలయం, కాసర దేవీ ఇత్యాది అనేక కోవెలలు బాలో కళ్యాణ్ చాంద్ మహారాజు కాలములో నిర్మించబడినవి.  “అల్మోరా” లో ప్రసిద్ధి గాంచినది.
స్వామి వివేకానందుడు  కాసర్ దేవీ గుడి దరి ఒక గుహలో ధ్యానం చేసేవారు.

Taags:-

Purple colour fuits, Kilmora Tree;

(Almora plug Kilmora plant for washing the utensils of "Katarmal Temple".