సీతమ్మ వారి జడ కుచ్చు పూలు;
మా తోటలోన విరబూసినాయి;
మహ మంచిపువ్వులు; ఈ సీతమ్మ పూవులు; || సీత ||
;
ముఖమల్లు పూలు, మెత్తన్ని పూలు;
మహమల్లు పూలు, మహరాణీ పువ్వులు
మహలులందందున మురిపించే మెత్తన్ని పూలు ;
మహ మంచి ఈ సీతమ్మ పూవులు || సీత ||
;
సూర్య కాంతి మెరసేటి సొంపైన పువ్వాయిలు;
పూరేకులన్నీ వెల్వెట్టు జారు;
గుడిసెలందు, వాడలందు, గుడి ఆవరణలలోన;
వీధులందు, అరుగు పక్క; అందాలై జాల్వారు; || సీత ||
;
మిసిమి కోమలమ్ములీ ఏక దళ పుష్పములు ;
చూడ చూడ ; కిత కితలౌ - ద్వి దళముల సౌరులు; ;
సీతమ్మ నవ్వులకు చక్కనైన గూళ్ళు || సీత ||
పువ్వుల్లు తల్లి మొక్క కెంతో మోదమ్ములు;
కొమ్మ కొమ్మన పూసిన సన్నాయి లోలె
తోచేను ఈ సీతమ్మ జడ గంటల పూలు || సీత ||
;
ఈ మొక్క శ్రీరామ చంద్రులకు;
మనసారా ఇచ్చేనీ మనసైన పుష్పాలను;
ఈ సీతమ్మ జడ కుప్పెపూలు ||
************************************,
సీతమ్మ జడ గంటల పూలు;
53032 - konamaanini views;
No comments:
Post a Comment