Tuesday, March 7, 2017

కమ్మ కమ్మని విందు

చిలకమ్మ చిర్రు బుర్రు లాడింది
సితా కోక చిలకమ్మ రుస రుసలు
కస్సు బుస్సు మంటోంది గొరవంక
విస విసా వచ్చింది వన మయూరం

నేస్తాల చిట పటలు మాన్పి వేయంగా
యోచనలు చేసాయి గబ్బిలాయి, గుడ్ల గూబ;

“ అడవిలోని దోస్తులను అన్నిటినీ
విందుకు రమ్మని” పిలిచాయి.

“వివాహ భోజనంబు – వింతైన వంటకంబు “
ప్రిపరేషనులలోన తలమునకలు అయ్యాయి.

ఇది చూస్తూ గుర్రు గుర్రు మన్నది గుంట నక్క ,
అది బహు జిత్తుల మారి.
గుట్టు చప్పుడవకుండా 
నక్కి నక్కి వచ్చింది నక్కమ్మ,
అంతేనా!?
గుప్పెడు ఉప్పు క్షీరంలో 
గభాలున గుమ్మరించి
ఉప్పు చప్పుడవకుండా 
జారుకుంది చల్లగా!

పాలు కాస్త విరిగిపోయె!
చెవుల పిల్లి కుందేలు
“బెంబేలు పడకండ”న్నది;
క్షీరాన్ని వడ కట్టింది,
ఉడుత సాయమవ్వగా
పన్నీరు, రసగుల్లాలను
చిటికెలోన రెడీ ఆయె !
వన భోజనమ్ములొహో!
వన జంతు, పక్షి, కీటకమ్ములు
ఖుషి ఖుషిగా కానుకలిచ్చి
షడ్రుచుల విందు నారగించి
“బ్రేవ్!”మంటూ త్రేన్‌చాయి;

గుడ్ల గూబ, గబ్బిలములు
అందుకొనెను అందరి మన్ననలు, అభినందనలు.
$$$$$$$$$$$$$$$$$$$$$$;

ద్రావిడ భాషా వర్గానికి చెందినది “ఆంధ్ర భాష”. 
శబ్దాలను, సవ్వడులను రెండు సార్లు ( ద్విరుక్తి ) పలకడము 
తెలుగు మాటలకు ఒక అందము చేకూరుతున్నది.
గుస గుసలాడుట, కిల కిలా నవ్వుట, 
మిస మిస కాంతులు ……. 
ఇలాంటివి అన్న మాట.
బాల బాలికలారా! 
ఇలాంటి మరిన్ని సరదా సరదా పదాలను – 
సరదాగా ప్రయత్నించి సాధించండి , చూద్దాం!!!!!!
  
( writer : P. kadambari ) ;

*******************************************:

]] కమ్మ కమ్మని విందు ;-  March 27, 2010   
రచన : కాందబరి పిదూరి ;-
చిలకమ్మ చిర్రు బుర్రు లాడింది 
సితా కోక చిలకమ్మ రుస రుసలు 
కస్సు బుస్సు మంటోంది 
గొరవంక విస విసా వచ్చింది
]] పండు లాంటి పండుగ దీపావళి ;-   March 11, 2010   ;-
రచన : అనిల్ కుమార్ పిదూరి 
దివ్య దివ్య దీపావళి 
ప్రతి సారీ ఈ పండుగ “హుషార్ పండు” నవ్యమే! 
నవ నవీన పర్వమే! || – 
]] పక్షుల పలుకులు ;-           October 12, 2009 ;- 
“మాటలు అంటే   
మానవులకు మాత్రమె సొంతం”అంటే ఎట్లాగ? 
మైనా పిట్టల ఈల 
పాటలను, రామ చిలుకల ;
[ మా రచనల పట్టిక, జాబిల్లి, బాల కవితా గీతములు, గీత రూపకము ] 
&
jabilli 













జాబిల్లి బాల పత్రిక గీతాలు - 1 

No comments:

Post a Comment