చేమంతి, గులాబీ, మల్లిక ;
వసుధ ఆయె నేడు
అందాలకు వేదిక.
మోదమ్ములకు వసుంధర.
వేసెను ఆమోద ముద్ర ;
ప్రసూనముల వికాసములు.
ప్రకృతి సంతోష ఘంటిక.
గాలి స్వచ్ఛతకు బాసట.
చిరుగాలి జీవులకు ఊరట ;
పరిమళాల మేళాలతొ ;
జగమంతా కళ కళ
శాంతి,సంతోషములకు
తలమానికము తరువులు .
పచ్చ దనములు సదా
విలసిల్ల వలెను “ ఇల”పైన
సకల లోక శ్రేయస్సు బాట – కిదే
ఇదే మంచి మాట ;
సదా ఇదే మేలు బాట
&
మేలైన బాట ;- LINK :-
జాబిల్లి బాల పత్రిక గీతాలు
April 6, 2010 2 Comments
రచన : కాదంబరి పిదూరి చేమంతి, గులాబీ, మల్లిక