Tuesday, January 24, 2017

పుష్పమంజరి తరళత

పూలూ పూలూ ; 
తగవులు ఏల? ;
మందారపు తావియె ; 
క్రిష్ణ నివాసము ఆయెననీ :  ||

అష్ట మహిషులు అల్లిరి దండలు ; 
రుక్మిణి తెచ్చెను మల్లెల దండలు ;
సత్యభామ కరమున ; 
పారిజాతముల విరుల దండలు ;  ||

కౌస్తుభ మణులు, మౌక్తికాభరణములు ; 
కన్నని మేనున ఉన్నా గాని ;
      ఎన్ని ఉన్నా గాని ;
మీ పువ్వుల తరళతలకు ; 
సమ ఉజ్జీలగునా!?  ||
;
రవ్వల కళలు ,  తళతళలు
మీ దళముల తేనెల 
సాటి ఔతాయా ఏమి!?
రుసరుస అలుకలు మానండీ ; 
మీ సుమ హాసములతొ 
మా వసుధను యావత్తూ ;
కళకళలాడించండీ! 
మేలుగ కళకళ లాడించండీ!! :  ||
;
⍏   - పుష్ప మంజరి తరళతలు ;

1 comment:

  1. hi
    nice poetry
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support https://www.youtube.com/garamchai

    ReplyDelete