Tuesday, January 24, 2017

ఆస్య గంధ ఆఘ్రాణపు నెపము

గోరంత వెన్నముద్ద చాలన్నాడు ;
అంత గిరిని నిలిపినావు ;
ఎంత వెన్న సరిపోతుందో,
సందేహం మాకు క్రిష్ణా! :  ||
;
చంద్రకళలు పదహారు వన్నెలయీ ;
చేరెను నీ నఖములందు ;
తెలుపు వన్నె నవనీతము
ముద్ద చాలునా క్రిష్ణ!? :  ||
;
అరచేతిలోన వెన్నపూస - భూగోళము తలపించును ;
యశోదమ్మకు ఆస్య గంధ ఆఘ్రాణపు నెపముతోటి ;
నిఖిల విశ్వములను చూపినట్టి గారడీడ!
ఎంత వెన్న కావాలీ  కాస్త మాకు తెలుపవయ్య  ! :  ||
[ రాధామనోహర ]  
===========================;

gOramta wennamudda chaalannADu ;
amta girini nilipinaawu ;
emta wenna saripOtumdO,
samdEham maaku krishNA! :  ||
;
chamdrakaLalu padahaaru wannelayii ;
chErenu nii nakhamulamdu ;
nawaneetamu telupu wanne ;
mudaa chaalunaa krishNa!? :  ||
;
arachEtilOna wennapuusa ;
bhuugOLamu talapimchunu ;
yaSOdammaku aasya gamdha aaghraaNapu nepamutOTi ;
nikhila wiSwamulanu chuupinaTTi gaaraDIDa!
emta wenna kaawaalii  kaasta maaku telupawayya  ! :  ||  

No comments:

Post a Comment