Sunday, March 20, 2016

చెంగల్వరాయునికి పసిడి కీర్తనలు ;

కస్తూరి, కర్పూరములు రంగరించి , 
కాచు, పోకల కూర్పు మేలిమిగ సమకూర ;
గోరంత సున్నమును హంగుగా చేర్చంగ ; 
చెంగల్వరాయనికి బంగారు కానుక ||
;
పచ్చ పచ్చని చిలుక ; 
చెంగు చెంగున ఎగిరి ; 
దేవి ఒడిలో వాలె ||
;
స్వామి వైపు బాగ తొంగి చూచింది ; 
పరికించి చూసి కనిపెట్టె నొకటి;
అమ్మను అడిగింది కులుకుల కీరము ; 
"అయ్య అధరమ్ముల అరుణరాగాలు : 
ఎరుపు నురుగుల పొంగు - లెటుల వచ్చేను?" || 
;
కీరవాణి సిగ్గు దొంతరల మొగ్గాయె! 
'తాంబూలచర్వణ మహిమ కతమున జరిగె!'
తాంబూల విడియము నోరు పండించె! 
గోరింట అరచేత పంటలాయేను!" ||
;
అమ్మ వాక్కులకు నా తమాలమ్ము ; 
దరహాసిని ఆయె; 
పులకింతలందు ఓలాడె కురువకము; 
పద్మావతీ దేవి కెంపు పెదవుల ఎరుపు ; 
ముసిముసిగ కులికేను || 
;
=========================; 
;
# kastuuri , karpuuramulu ramgarimchi , 
kaachu, pOkala mElimiga samakuura ;
gOramta sunnamunu hamgugaa chErchamga ; 
chemgalwaraayaniki bamgaaru kaanuka ||
;
pacha pachchani chiluka ; 
chemgu chemguna egiri ; 
dEwi oDilO waale ||
;
swaami waipu baaga tomgi chuuchimdi ; 
parikimchi chuusi kanipeTTe nokaTi || 
;
ammanu aDigimdi kulukula keeramu ; 
"ayya adharammula aruNaraagaalu : 
erupu nurugula pomgu - leTula wachchEnu?" || 
;
keerawaaNi siggu domtarala moggaaye! 
'taambuulacharwaNa mahima katamuna jarige!
taambuula wiDiyamu nOru pamDimche! 
gOrimTa arachEta pamTalaayEnu!" ||
;
amma waakkulaku naa tamaalammu darahaasini aaye ; 
pulakimtalamdu OlalADe kuruwakamu; 
padmaawatii dEwi kempu pedawula erupu ; 
musimusiga kulikEnu ||
;
**************************************,
; - [ సుమదళ ]

**************************************;

అఖిలవనిత
Pageview chart 35272 pageviews - 837 posts, last published on Mar 20, 2016 
కోణమానిని తెలుగు ప్రపంచం
Pageview chart 65087 pageviews - 1041 posts, last published on Feb 28, 2016 -
తెలుగురత్నమాలిక
Pageview chart 5277 pageviews - 148 posts, last published on Jan 20, 2016 

No comments:

Post a Comment