Sunday, March 20, 2016

చేమంతి పుప్పొడులు

మెడలోన మందారదామాలు , ఆ పైన
మొల నూలు గజ్జెలలొ బంతిరేకుల్లు ; 
కాలి అందెలలోన ; చేమంతి పుప్పొడులు; 
ఇరుకుకుని నవ్వాయి, చిందులే వేసాయి:
;
కస్తూరి ఘుమఘుమల ; 
పొగడ పూతావులు జలక్రీడలాడాయి ; 
మురుగులు, కడియాలు; కైందండ మురిపాలు
మణుల చిన్నెలకు దక్కె శతకోటి మురిపాలు;
కన్నయ్య సిగ ముడిని నెమలీకలు;
నీలమోహన క్రిష్ణ జాలముల 
ఓలాడు ఇన్ని వస్తు సామగ్రి
;
అవలోకితములగుచు నింగిలో మేఘాలు 
గునగునలు ఆడేను; గుసగుసలు ఆడేను ; 
"మరకతం మణి ఛాయనున్నాము మేము!
మాకు గల హక్కు బహు మిక్కుటము ! " - 
అనుచు ఉరుములే ఉరిమేను;
మెరుపు ఝళిపించేను ;
నీలంపు జిగి మేని అల్లరి క్రిష్ణయ్య
సందిటను చేరగా తపములే చేసేను;
నీలి మబ్బుల చాల తపములను చేసేను ||

by ;- [ శీర్షిక : మురళీ రవళి]
=====================================,

# meDalOna mamdaaradaamaalu , aa paina
mola nuulu gajjelalo bamtirEkullu ; 
kaali amdelalOna ; chEmamti puppoDulu; 
irukukuni nawwaayi, chimdulE wEsAyi: ||
[mukku puDakaga ]
kastuuri ghumaghumala ; pogaDa puutaawulu jalakrIDalADAyi ; 
murugulu, kaDiyaalu; kaimdamDa muripaalu
maNula chinnelaku dakke SatakOTi muripaalu;
kannayya siga muDini nemaliikalu;
niilamOhana krishNa jaalamula OlaaDu inni wastu saamagri !!!!!

awalOkitamulaguchu nimgilO mEGAlu gunagunalu ADEnu; 
gusagusalu ADEnu ; 
marakatam maNi CAyanunnaamu mEmu!
maaku gala hakku bahu mikkuTamu - anuchu
urumulE urimEnu; merupu jhaLipimchEnu ; 
neelampu jigi mEni allari krishNayya
samdiTanu chEragaa tapamulE chEsEnu 
neeli mabbula chaala tapamulanu chEsEnu ||
;
*************************************************
By ;- [ SIrshika : muraLI rawaLi]  కృష్ణం వందే జగద్గురుం
************************************************* 

No comments:

Post a Comment