Sunday, August 9, 2015

వెన్నెల ఆకులు

బాలలము, మేము బాలలము ||
చీకటి చెట్లకు - వెన్నెల ఆకులు ;
చక్కని చిగురులు వేయిస్తాము : || 

చిక్కని మబ్బుల - బుడి బుడి సిగ్గుల;
సొంపౌ మొగ్గలు - తొడిగిస్తాము ;
చిరుతప్రాయము సౌధమునందున ;
ఇపుడే అడుగిడినామండీ!

మా మిసిమి కాంతుల కలల వీధుల ;
బంగరుబాటలు వేస్తున్నాము ;
కంటకమ్ములను గ్రుమ్మరించెడి 
కర్కోటకులిటు రావొద్దండీ! ప్లీజ్! ||   

బాలగీతిక :- 

===========================; 


baalagiitika :-


baalalamu, mEmu baalalalmu ||
chiikaTi cheTlaku - wennela Akulu ;
chakkani chigurulu wEyistaamu : ||
chikkani mabbula - buDi buDi siggula;
sompau moggalu - toDigistAmu ; }}
chirutapraayamu saudhamunamduna ;
ipuDE aDugiDinaamamDii!
maa misimi kaamtula kalala weedhula ;
bamgarubaaTalu wEstunnaamu ;
kamTakammulanu grummarimcheDi ;
karkOTakuliTu rAwoddamDI! pleej! ||   

********************** 

No comments:

Post a Comment