Sunday, August 2, 2015

రెక్కలపైన రంగవల్లికలు;

సీతాకోకచిలకమ్మలవే 
వచ్చేసాయి, వచ్చేసాయి! ||

రెక్కల వన్నెల రంగవల్లికలు;
అలరే చక్కని సీతాకోకలు -
వచ్చేసాయి, వచ్చేసాయి ||  

బృందావనిలో పూవుల వ్రాలి; 
గోప భామినుల తికమకపెట్టుచు;
మల్లె పొదలలో నక్కుచు దాగిన ; 
నందకుమారుని నేస్తులమన్నవి 
|| రెక్కల వన్నెల రంగవల్లికలు;
అలరే చక్కని సీతాకోకలు
చకచక ఎగురుతు వచ్చేసినవి  ॥ 

అంబరమందున నీలి తెరలపై ; 
పున్నమి జాబిలి చేవ్రాళ్ళు ;  
ఆ సంతకమ్ముల ఇంపుసొంపుల; 
దరహాస చంద్రికలకు; 
సొంతదారులం మేమేనంటూ ; 
కిలకిలా నవ్వినవి 
||రెక్కల వన్నెల రంగవల్లికలు;
అలరే చక్కని సీతాకోకలు
చకచక ఎగురుతు వచ్చేసినవి ॥ 

*************************

# siitaakOkachilakammalawE 
wachchEsaayi, wachchEsaayi! ||
rekkala wannela ramgawallikalu; 
alarE chakkani siitaakOkalu - 
wachEsaayi, wachchEsaayi ||

bRmdAwanilO puuwula wraali; 
gOpa BAminula tikamakapeTTuchu;
malle podalalO : nakkuchu daagina ; 
namdakumaaruni nEstulamannawi ||

ambaramamduna niili teralapai ;
punnami jaabili chEwrALLu ;  
aa samtakammula impusompula; 
darahaasa chamdrikalaku; 
somtadaarulam mEmEnamTU
kilakila nawwinawi ||

************************* 

No comments:

Post a Comment