పోరడు, పోరి వచ్చారు
బొట్టి, బొట్టెడు వచ్చారు;
అబ్బాయ్, అమ్మాయ్ వచ్చారు
చెరకు గడలను తెచ్చారు ;
కణుపులు లెక్కెట్టి నవ్వారు,
మాగాణి పొలంలొ నాటారు;
కాడిని పట్టి అరకను పెట్టి
మడిచెక్కను చక్కగా దున్నారు;
భలేగ సేద్యం చేసారు;
ఏపుగ పెరిగిన చెరకు ముక్కలు
కొన్ని నీకు; మరి కొన్ని నాకూ –
అంటూ చక్కగ ఎంచారు
బాగా జనులకు పంచిచ్చారు;
తక్కిన మోపులు తీసుకువెళ్ళి
గానుగలోన ఆడించారు;
బెల్లం రసమును పిండారు
పాకం బాగా పట్టారు;
అరిసెలు, బూరెలు వండారందరూ!
బోసినవ్వుల అవ్వకు అప్పచ్చి;
అవ్వ అప్పచ్చి; తాత తిరుచ్చి;
బూరె బుసికి; గవ్వలు భరుచ్చి;
పప్పు ఉండలు తీపి రుచి;
చక్కెర చిలకల లచ్చి!
కాజా దోబుచి, బాదుషా హుళక్కి!
అవ్వకు లొట్టల అప్పచ్చి
చప్పరింతల తాతకు హాచ్ హాచ్ హాచ్ఛీ!
*****************************
pOraDu, pOri wachchaaru
boTTi, boTTeDu wachchaaru;
abbaay, ammaay wachchaaru
cheraku kaNupulu techchAru,
maagaaNi polamlo nATAru;
kaaDini paTTi baagaa sEdyam chEsAru;
Epuga perigina
cheraku mukkalu konni niiku;
mari konni naakuu – amTU
chakkaga pamchichchaaru;
cheraku mOpulanu
gaanugalOna aaDimchAru;
bellam paakam baagaa paTTiri;
ariselu, buurelu wamDAramdaruu!
bOsinawwula awwaku appachchi;
awwa appachchi; buure bharuchchi;
kaajaa tiruchchi;
chakkera chilakala lachchi!
baadushaa huLakki!
awwaku loTTala appachchi
awwa appachchi awwa appachchi!
awwa appachchi అవ్వ అప్పచ్చి awwa appachchi అవ్వ అప్పచ్చి
wijayaanandana
అఖిలవనిత 32533 akhilawanita