Friday, July 31, 2015

నరునికి మాతామహి

 బందరు కోతి!  బందరు కోతి!  
] బందరు కోతి!బందరు కోతి!
ఎక్కడి నుండి వచ్చితివి?
ఏందీ నీ కథ, కొంచెం చెపుమీ! ||

బందరు కోతికి కోపం వచ్చి, 
మూతి ముడుచుకుని కూర్చుంది:
అసలే మూతి కొంచెం వక్రం; ఆపై 
ఇంతటి అలుకా! రామ్ రామ్! ||

"రామ్!రామ్!"రామ శబ్దమును వినగానే; 
అలుక, కినుకలు మటుమాయం!
చటుకున వచ్చి వద్దకు చేరీ, 
మొదలెట్టింది బాతాఖానీ, మాట కచేరీ! 

చెట్టులు ఎక్కీ; కొమ్మలు దుమికీ; 
ఆకుల మాటున నక్కినది; 
ఆటలు ఎన్నో ఆడింది! 

మనకు నేర్పినది "కోతి కొమ్మచ్చి" 
నరునికి స్వయాన 'మాతామహీ!||

 చెట్ల ఊడలను పట్టుకు 
దూకుచు, దుముకుచు, దేకుచు, 
గంతులు వేయుచు కోతి చేరెను 

తిరుమల కొండలు; 
దర్శించుకొనెను శ్రీ బాలాజీని! 
"గోవిందా! శ్రీ గోవిందా!" అని 
నామ జపమును చేసినది  ||

తిరుమల లడ్డూ, వడ ప్రసాదం 
కొంచెం భాగం తినెను వానరం
తక్కిన స్వీటును తక్కినవారికి  
పంచి ఇచ్చెను మిగుల ప్రేమతో! ||

======================

మనకు నేర్పినది "కోతి కొమ్మచ్చి"
నరునికి స్వయాన 'మాతామహీ!||




No comments:

Post a Comment