మేలిముసుగులోనికి ;
ఎనలేని సౌందర్యము ;
పోతపోసినారెవ్వరో!?||
ఎవ్వరే అందాలరాశి?
ఎవరే? ఇంకెవరే? –
|| ఇంకెవరు ఔతారు,
ఆమె మా రాధమ్మ!||
నీల నీలి యమునా వాహినిలో
నల్లా నల్లని నీట సాగేను పడవ;
హైలెస్స ఎత్తుగా తెరచాప -
ఆ అవస్తారముల;
వెనుక నిలబడి;
తొంగిచూచునది ఎవరమ్మా?
|| ఇంకెవరు ఔతారు,
ఆమె మా రాధమ్మ!||
ఎవ్వరే లావణ్య వారాశి?
ఎవ్వరే ఆ అందాలరాశి?
అట ఎవరమ్మా?
ఏమి ఆ వివరము?
|| ఇంకెవరు ఔతారు,
ఆమె మా రాధమ్మ!||
మెరుపులను మోసేటి మేఘముల పోలిక;
పరదాలు అందాలరాశి మూటలాయేను;
కరదీపిక వేరుగా; కావాలా ఏమిటి?
ఆ నిండుచందమామను
మన కన్నుల నింపుకొనగ! ||
****************************************
Total Pageviews ; Sparkline 32,260
ఎనలేని సౌందర్యము ;
పోతపోసినారెవ్వరో!?||
ఎవ్వరే అందాలరాశి?
ఎవరే? ఇంకెవరే? –
|| ఇంకెవరు ఔతారు,
ఆమె మా రాధమ్మ!||
నీల నీలి యమునా వాహినిలో
నల్లా నల్లని నీట సాగేను పడవ;
హైలెస్స ఎత్తుగా తెరచాప -
ఆ అవస్తారముల;
వెనుక నిలబడి;
తొంగిచూచునది ఎవరమ్మా?
|| ఇంకెవరు ఔతారు,
ఆమె మా రాధమ్మ!||
ఎవ్వరే లావణ్య వారాశి?
ఎవ్వరే ఆ అందాలరాశి?
అట ఎవరమ్మా?
ఏమి ఆ వివరము?
|| ఇంకెవరు ఔతారు,
ఆమె మా రాధమ్మ!||
మెరుపులను మోసేటి మేఘముల పోలిక;
పరదాలు అందాలరాశి మూటలాయేను;
కరదీపిక వేరుగా; కావాలా ఏమిటి?
ఆ నిండుచందమామను
మన కన్నుల నింపుకొనగ! ||
****************************************
Total Pageviews ; Sparkline 32,260
No comments:
Post a Comment