జగత్ జననీ! వాక్కులు జాలువారుటకు నీవు మూలస్థానమువు.
చంద్రకాంతి మణుల పభలు కలిగిన ఆ రజను, తెల్లనిది,
వశిన్యాది శక్తులు కలిగినవి నీ వాక్కులు.
అటువంటి వాక్ శక్తి కలిగిన నిన్ను పూజించిన మానవుడు -
రచనా సమర్ధుడగును,
అతడు సరస్వతీ ముఖపద్మమునందలి
పరిమళ యుక్త వాక్కులతో కూడిన
కావ్యాలను రచించగలుగుతున్నాడు.
- (సౌందర్యలహరి, 3 వ శ్లోకము) :
తాత్పర్య:- త్రిపురాంతికా దేవి - "మాతృకా వర్ణరూపిణి" అనీ,
"పంచాశత్పీఠికా రూపిణి" అనీ - లలితాసహస్రనామములందు కీర్తించ బడినది.
పై శ్లోకమునందు వశిన్యాది దేవతలు:- ఎనిమిది మంది.
1. వశిని; 2. కామేశ్వరి;
3. మోదిని; 4. విమల;
5. అరుణ; 6. జయిని;
7. సర్వేశ్వరి; 8. కౌళిని
'శ్రీ చక్రము 'నందలి 7 వ ఆవరణములోని 8 కోణములలో ఉంటారు.
[సన్స్కృత పదజాలము - పునాదిగా -
వ్యాకరణ పరిపుష్ఠ సిద్ధాంతములు నిర్మితమైనవి.
50 అక్షరములు; 8 వర్గములుగా విభజించబడునవి.
వానికి ఈ ఎనిమిదిమంది అధిష్ఠాన దేవతలు,
వశిన్యాది దేవతలు
ఉదాహరణకు - 'అచ్చులు ' ఒక వర్గముగా విభజితమైనవి.
ఈ అచ్చులకు వర్గాధిదేవత - "వశిని".
1) క చ ట త ప వర్గాధి దేవతలు ఐదుగురు.
2) అంతస్థములు ; 3) ఊష్మములు -
ఈ రీతిగా అష్ట వాగ్దేవతలు "మానవులు ఉచ్చరించు శబ్దములు" కు ప్రేరణ ఐనారు.
ధ్వనుల ఉచ్ఛారణలకు మూలస్తంభములు - వాగ్దేవతలు,
కనుక వీరు శక్తి స్వరూపిణులు.
ఇట్టి శక్తివంతములైన వాక్కులు, అందలి భావములు,
అటువంటి మాటలను పలుకవలెనను సంకల్పబలం,
ఉద్దేశ్యాలకు కేంద్రబిందువు "అమ్మవారు".
అందుచేతనే వాగ్దేవతలు ఆరాధిస్తున్న త్రిపురాంబికనూ,
అమ్మవారినీ సేవించి తరించగలము.
అద్భుత సౌగంధయుత కవిత్వమును అందించిన
కాళిదాసాదులు, రసహీనమైన వేదాంత సారాంశాన్ని కూడా సురభిళభరితమొనర్చిన శ్రీ ఆదిశంకరాచార్యుల ప్రతి రచన -
ఇందుకు ఉపబలకములే కదా!
శ్రీ శారదా దేవి - వాగ్దేవతల సంయుక్త రూపము.
సారస్వతస్వరూపిణి ఐన శ్రీవాణీ దేవి వదనకమలము నుండి
వెలువడు పరిమళము దైవికమైనది.
ఆ సారస్వత, మాతృ స్వరూపిణి ప్రసాదము -
మాధుర్య కవిత్వములు.
మధురిమలు రంగరించ బడిన కావ్య సృజనలను -
అమ్మవారి అనుగ్రహము - అని గ్రహించుట
కవి యొక్క విద్యుక్త ధర్మము.
- { రచన : కోణమానిని - కుసుమ
konamanini - kusuma )

roof design POP |
- { రచన : కోణమానిని - కుసుమ
konamanini - kusuma )
No comments:
Post a Comment