Thursday, January 31, 2013

చెమ్కీల పాట భళిర! భళిర!


కళ్ళకు కాటుక,సొట్ట - బుగ్గన దిష్టి చుక్క :
అర చేతుల, అరికాళ్ళకు ఎర్రగా గోరింట
పెట్టుకుని చిన్నారులు గంతులేస్తు వచ్చారు;
చెంగనాలు గంతులేస్తు వచ్చారు ||

బుట్ట చేతుల గౌను,  పట్టు జరీ పావడా ;
కంకణాలు, ఉంగరాలు, వంకీలు, హారాలు
           నడుస్తూ - నిటు బాలలు వచ్చినారు:
               హంస- నడకలతో వచ్చినారు  ||

లోలాకులు, జుంకీలు, చెంప సరాలు,
దుద్దులు : రవల పాపిట బిళ్ళ :
నెన్నుదుటను తిలకములతొ :
           బుజ్జాయిలు  వచ్చినారు :
                పరుగు తీస్తు వచ్చినారు  ||

జడ బిళ్ళలు, జడ కుచ్చులు:
మొగలి రేకు పూల జడలు; సరిగంచుల వోణీలు :
 చెమ్కీల మేలిముసుగు:
                  హుందాగా  వచ్చినారు:
                  ఆబాల గోపాలము మెచ్చు తెలుగు  పిల్లలు ||
;

8 Mutts;Car Street 


;














సంక్రాంతీ పౌష్య లక్ష్మి :-

అది తీయని స్వప్నము;
నిన్నటి, మొన్నటి కల:
         ఓ లచ్చీ గుమ్మడీ!

దశాబ్దమును చెవి పట్టుకు
        ఇటు లాక్కుని రావాలి!
తేట తెనుగు సొగసులను
      మరల మనము తేవాలి
        ఓ ముద్దుగుమ్మ!

తేట తెనుగు పలుకులలో
 చక్కనైన వేష భాష- లను
మళ్ళీ - పండుగ వేళల-
మురిపెంగా అనుసరింతుమందరమూ

పౌష్య లక్ష్మి గుండెలలో సౌరభాల గుబాళింపు !
       అప్పుడే అది నిజమైన నిక్కమైన
                                రంగోలీ సంక్రాంతి
                 అమ్మణ్ణీ! ఔనౌను,
  అప్పుడే అది నిజమైన నిక్కమైన -
                               రంగోలీ సంక్రాంతి       || 


(  చెమ్కీల పాట భళిర!భళిర! /
    నిక్కమైన సంక్రాంతి శోభలు:  By:- kadambari )

photo link : manasa. blaag

No comments:

Post a Comment