Pushpaka vimanam |
విశ్రావసు కుమారుడు, దేవతలకు గురువు కుబేరుడు.
ఆతడు గొప్ప శివ భక్తుడు. మహేశ్వరుడు
"కుబేరా!" నీ భక్తికి మెచ్చి, ఈ గగన గామిని ని ఇస్తున్నాను,! " అని
ఘన వస్తువును తన భక్తునికి ఒసగాడు.
అదే విశ్వఖ్యాతి గాంచి, ఇతిహాస చరిత్ర సృష్టించిన "పుష్పక విమానము".
తన విమానము (aircraft)లో-
సకల మహేశ దేవళములను- దర్శిస్తూ,
కుబేరుడు పుష్పక విమాన యానము చేయసాగాడు.
అలా వివిధ ఆలయాలను సందర్శిస్తూ,
ఒక చోట ఒక విచిత్ర దృశ్యాన్ని తిలకించాడు.
కావేరీ తీరాన (Cauvery) జింక, పులి, ఆవు, ఏనుగు, పాము, ఎలుక - లు
ఒకే చోట నిలబడి, నదిలోని నీళ్ళను తాగుతున్నాయి.
జంతు సహజ వైరము లేకుండా ఆ ఐదు
మైత్రీభావముతో అలాగ మెలగడము చూసిన కుబేరుడు, అక్కడ దిగాడు.
సుర గురువు- "సజ్జనులు, పుణ్య చరితులు, గంధర్వులు, మహర్షులు-
ఇక్కడకు వచ్చి, నివసిస్తున్నారు.
ఆ సౌజన్య ప్రవర్తనా పరిమళాలు విస్తరించిన పరిసరములు అవి!
కనుకనే అచ్చట స్నేహభావ, సౌమ్య భావములు విరబూస్తూన్నవి.
అందువలననే ఈ సీమలో జంతువులు సైతమూ
తమ తమ సహజ వైరాలను మరిచి,
స్నేహ భావముతో కలిసి మెలసి జీవిస్తూన్నవి" అని గ్రహించాడు.
కుబేరునికి ఆకాశములో నుండి- ఒక స్వరము వినిపించింది.
"ఇచ్చటి ఇల్లిందై చెట్టు (= రేగు చెట్టు/ బదరీ వృక్షము) ఉన్నది.
ఆ తరువు మూలమున తాళపత్రములు ఉన్నవి.
ఈ ప్రాంతమునకు వేదములు వచ్చినవి.
కనుక ఇది పవిత్ర మహిమాన్విత ప్రదేశము" అంటూ ఆ అశరీర వాణి పలికినది.
ఈ రేగి చెట్టు (Ilandhai Tree) దరిని- నీవు పూజించ వలసిన పరమేశ లింగము ఉన్నది.
భక్తుల సకల ఈప్సితములు నెరవేరు ప్రదేశము ఇది.
"ఈ మాటలకు విస్మయ చకితుడైన కుబేరుడు అన్వేషణలో- పవిత్ర లింగమును కనుగొన్నాడు.
కుబేరుని ఆరాధనలు పొందిన ఈశుడు-
కుబేరుని కోరికపై "అలఘేశుడు" (Alagesan) - అనే నామధేయ విలాసునిగా
భక్తులను అనుగ్రహిస్తున్నాడు.
"భవాని" అనే ప్రదేశములో వెలసిన ప్రసిద్ధ కోవెల పేరు "శ్రీ సంగమేశ్వర కోవెల",
కావేరీ, భవానీ, అంతర్వాహిని ఐనట్టి "అమృత" అనే మూడు నదులు కలుస్తూన్నవి.
అందుచేత- దక్షిణ భారతమున "త్రివేణీ సంగమముగా" వినుతి కెక్కినది.
సంగమేశ్వరుడు - స్వయంభువుగా వెలిసినాడు.అమ్మవారి పేరు "వేదనాయకి". తల్లి సౌందర్యవల్లి.
ఇక్కడ విష్ణుమూర్తి- "అధికేశ్వరర్" అని పేరు.
కావేరీ నది ఒడ్డున- పవిత్ర తీర్ధము ఇది. తేవారం అర్చకుల గానములు
ఈ చల్లని గాలులలో- మనోహరముగా వినిపిస్తూ ఉంటాయి.
ఈరోడ్ జిల్లాలో( Erode) భవానీ గుడి- "శ్రీ సంగమేశ్వర కోవెల" ఉన్నది.
;