కురంజి, నీలకురింజి - అనే పువ్వుకు ప్రత్యేకత ఉన్నది.
నీలగిరి కొండలకి (strobilanthes kunthiana)
ఈ పుష్ప సౌందర్యాలు ప్రకృతికి చెప్పలేనన్ని సోయగాల వరాలను అనుగ్రహిస్తూన్నవి.
పశ్చిమ కనుమల కోనల, లోయలలో, గుట్టలలో-
షోలా పచ్చిక బయళ్ళు కురింజి సుమ వన ధామములై,
టూరిస్టులకు నయనానందాన్ని కలిగిస్తూన్నవి.
దక్షిణాదిని చోలా గ్రాస్ లాండులు విస్తారంగా ఉన్నవి.
కురంజి పూల చెట్లు నీలగిరులను శోభాయమానంగా చేస్తూన్నవి.
సతత హరిత అరణ్యాలలో పూసే కురంజీలు
12 సంవత్సరాలకు- అంటే- పుష్కర కాలము అన్న మాట!
12 years ఒకమారు మాత్రమే పూస్తూంటాయి
Neelakurinji (Strobilanthes kunthiana) purplish blue flowers of Neelakurinji that blossoms gregariously,. వీటిని స్థానికులు పవిత్ర స్థానమును ఇచ్చి, గౌరవిస్తారు.
రాష్ట్ర ప్రభుత్వాలు నీల కురంజీ పొదరిళ్ళ వన సీమలను సంరక్షిస్తూ, ప్రత్యేక శ్రద్ధతో రక్షిస్తూ పెంచుతూన్నవి.
నీలగిరి కొండలలో Paliyan అనే
కొండజాతి జనులు నివసిస్తున్నారు.
తమిళ నాడు, కేరళ రాష్ట్రాలలోని ఈ పాళియన్ తెగ ప్రజలు
"తమ వయసును గురించి చెప్పేటప్పుడు-
కురింజీ పూలు పూచే టైమును- లింకుగా ఉపయోగిస్తారు.
ప్రజాతులలో- ఇండియాలో కనీసం 40 జాతులు ఉన్నవి.
కొన్ని 16 ఏళ్ళకు పుష్పిస్తూంటాయి.
డజను ఏళ్ళకు ఒకసారి కురంజీ సుమ వల్లరి
[shola grass lands; kuraMji, nIlakuriMji -]
No comments:
Post a Comment